కొంతమంది ఉంటారు…
మంచిని చెప్పలేరు, చెడుని ఎదిరించలేరు, ఇంటికి వెళ్లి బాత్ రూమ్ లో పెద్దగా అరుస్తుంటారు..
వాడు ఎదవ, ఏం పీకలేదు, గోకలేదు… అంటూ….
టీడీపీలో అతిగాళ్ళు కొందరు ఉన్నారు.
సోషల్ మీడియాలో గంగిరెద్దులల్లే ఊగిపోవడం మాత్రమే వచ్చు.
పిచ్చినాయళ్ళు.. సోము అప్పుడేదో అన్నాడని గింజుకుంటున్నారు.
సో వి సిగ్గు విడిచి, చంద్రబాబుగారి కాళ్ళ మీద పడ్డాడు అని చెప్పరు?
9నెలల్లో చంద్రబాబు చేసిన మంచి మాత్రం చెప్పరు.
జగన్ నెలకోసారి నత్తిగా మాట్లాడితే అతన్ని ట్రోల్ చేయడం తప్ప ఏమి రాదు ఈ సోషల్ మీడియా పులులకు.
మన ఇంటిలో అందరిని బ్యాలెన్స్ చేసుకోవడానికి మనం ఎంత ఒత్తిడికి లోనవుతాము?
నీకు ఉన్నట్టు ఆయనకు 24గంటలు మాత్రమే ఉన్నాయి.
నీకు ఉన్నట్టు ఆయనకు ఒకటే మెదడు ఉంది.
నీకు ఉన్నట్టు ఆయనకు భార్య, కొడుకు, కోడలు, మనవడు ఉన్నారు.
నువ్వు నీవాళ్ళతో గడిపినట్టు అయన కూడా ఫ్యామిలీతో గడపవచ్చు.
జీవితంలో గడిచిపోయిన కాలం తిరిగిరాదు.
అయినా అవన్నీ వదిలేసి రాష్ట్ర ప్రజల కోసం అయన పనిచేస్తుంటే, ఆయనను విమర్శిస్తూ కాలం వెళ్ళబుచ్చుకుంటూ శునకానందం పొందుతున్నారు కొందరు. అంతే కానీ రాష్ట్రం తిరిగి దారిలో పడుతోందని కొద్దిగా అయినా ఆనందం లేదు.
కొందరు సోషల్ మీడియా పెద్దలు పోస్టులు పెడుతూ ఉంటారు. బాబు ఇది చెయ్యలేదు. అది చెయ్యలేదు. వాడిని బొక్కలో వెయ్యలేదు అని..
అవే ముఖ్యమా? రాష్ట్ర అభివృద్ది ముఖ్యమా?
అలోచించి పోస్టులు పెట్టండి పెద్దలారా.. రాష్ట్రభివృద్ధికి సలహాలు ఇవ్వండి.
ఆర్ధికంగా అణిగిపోయిన రాష్ట్రాన్ని మరల దారిలో పెట్టగల సమర్థులుంటే చెప్పండి.
జగ్గు లాంటి చచ్చినపాముని చూసి భయపడుతూ… అందరిని భయపడేలా చేస్తున్నారు అతిగాళ్ళు.
– రవీంద్ర తీగల