రాష్ట్ర పోలిస్ సేవా పతకం ఇచ్చినందుకు కృతజ్ఞతలు

278

ఏయస్పి గంగాధర్
అమరావతి:- పోలిస్ శాఖ లో 32 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న తనకు ప్రభుత్వం రాష్ట్ర పోలీస్ సేవా పతకం అందజేసినందుకు ఉన్నతాధికారులకు మరియు రాష్ట్ర హోం శాఖ మంత్రి సుచరిత, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికు కృతజ్ఞతలు తెలియజేసిన గుంటూరు అర్బన్ అడిషనల్ ఎస్పీ గంగాధర్.ఈ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందని ఆయన వ్యాఖ్యానించారు. ఐజి , ఎస్పి వంటి ఉన్నతాధికారుల ఆదేశాలతో, జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు మరింత కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. నేరాలు లేని సమాజం గా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ ఆశయం అని చెప్పారు. కాగా పోలీసు శాఖలో ఎస్ఐ స్థాయి నుంచి ఏ ఎస్పీ స్థాయి వరకు ఎదిగిన గంగాధర వంటి అజాతశత్రువు కు పోలీసు సేవా పథకం లభించడం పట్ల ఆయన బ్యాచ్మెట్లు, గంగాధర్ వద్ద పనిచేసిన పోలీసు అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.