అవాంఛనీయ పరిణామాలపై ఉద్యోగ సంఘాలు నోరుతెరవాలి
నిబంధనలు మీరి పనిచేస్తున్నందునే కోర్టుల్లో మొట్టికాయలు
చట్ట ప్రకారం పనిచేస్తామని ధైర్యంగా చెప్పాలి
– టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు
రాష్ట్రం ఆర్ధిక, సామాజిక, పారిశ్రామిక రంగాల్లో చాలా వెనుకబడింది. ఇది తెలుగు దేశం పార్టీ చేసే రాజకీయ ఆరోపణ కాదు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. దాదాపు 200 కేసులలో రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానాల్లో ప్రతికుల తీర్పులొచ్చాయి. కోర్ట్ ఆదేశాలను అమలు చేయక పోవడంతో అధికారులకు జైలు శిక్ష విధించే వరకు వెళ్లింది. నిన్న ఒకే సారి ఐడుగురు అధికారులకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించడం సంచలనంగా మారింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇంత మంది అధికారులపై కోర్ట్ ధిక్కరణ కింద శిక్ష పడింది లేదు.
అలాంటిది.. రాష్ట్రంలోని అధికారులకు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది.? కోర్ట్ ఆదేశాలను అమలు చేసే బాధ్యత ప్రభుత్వానిదే. రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ఆదేశాలను దిక్కరించడంతో అధికారులు కోర్టుల్లో చేతులు కట్టుకోవాల్సి వస్తోంది. ఐ.ఏ.ఎస్ అధికారులు సైతం బలవుతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారిపై ఐ.ఏ.ఎస్ అధికారులు సంఘం చాల తీవ్రంగా మాట్లాడింది. కాని నేడు జగన్ రెడ్డి రాజకీయ ఒత్తిడిలున్నాంటే.. ప్రధాన కార్యదర్శి, ప్రిన్సిపల్ సెక్రటరి, డి.జి.పి సహా జిల్లా కలెక్టర్లు రోజుకొకరు చొప్పున కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తోంది. పరిస్థితి అర్ధం కాని అధికారులకు రోజంతా కోర్టు హాలులో నిలబడమని ఆదేశించే పరిస్థితులూ నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న తర్వాత ఆత్మభిమానం ఉన్న అధికారి ఎవరైనా రాజీనామా చేసి వెళ్ళిపోతారు.
వేదింపులు అనేవి జగన్ రెడ్డి పాలనలో పరిపాటి అయిపోయాయి. ఒక స్దలానికి పరిహరం అందించే విషయంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం, కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడం ఏ విధంగా చూడాలి.? పరిహారం అందించడం.. ఆర్ధికంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే అంశం కూడా కాదు. నెల్లూరు గత కలెక్టర్ రేవు ముత్యాలరాజు గారు అ బ్యాచ్ లోనే టాపర్. రెవెన్యూ సెక్రటరి మన్మోహన్ సింగ్ గారు మోస్ట్ సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారి. అ లాంటి వ్యక్తులకు జైలు శిక్ష విధించడం, జరిమానా విధించడమంటే.. అది వారి కెరియర్ లో అతిపెద్ద మచ్చ. ఈ పరిస్దితికి కారణం ఎవరో సదరు అధికారులే ఆలోచించుకోవాలి. కలెక్టర్ ను గెస్ట్ హౌస్ నుండే వెళ్ళిపో కార్యలయానికి కూడ వెళ్ళ వలసిన అవసరం లేదని స్థానిక మంత్రి చెప్పే పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. బీహర్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇలా జరిగేదని విన్నాం. కొన్ని సినిమాల్లో చూశాం. కానీ.. నేడు మన రాష్ట్రంలో ప్రత్యక్షంగా చూడాల్సి వస్తోంది. ఇలాంటి అంశాలపై జాతీయ స్దాయి ఐఏఎస్ అధికారుల సంఘం కూడ మట్లాడవలసిన పరిస్దితి ఎందుకు వచ్చింది.?
పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధులు మా ఆత్మాభిమానం దెబ్బతింది అంటూ మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. అది ఎంత వరకు సమంజషమో వారో నిర్ధారించుకోవాలి. గతంలో రాజశేఖర్ రెడ్డి హయంలో కేబినెట్ నిర్ణయాలను అమలు చేసినందుకు అధికారులు జైలుకు వెళ్ళిన పరిస్దితి. నేడు జగన్ రెడ్డి నిర్ణయాలకు తలూపిన అధికారులకు జైల్ శిక్షలు.. జరిమానాలు సాధారణమైపోయాయి. కానీ.. పరిపాలనలో ఐ.ఏ.ఎస్ పాత్ర చాల కీలకమైనది. అలాంటి వ్యవస్థ నేడు ఎంతగా దిగజారిపోయిందో కళ్లారా చూస్తున్నాం. కేబినెట్ నిర్ణయం అమలులో తప్పుల్ని ఎత్తి చూపాల్సిన బాధ్యత అధికారులదే.
చట్ట వ్యతిరేక నిర్ణయాలు అమలు చేయమని ధైర్యంగా చెప్పే వ్యవస్థ అవసరం. అలా కాకుండా రాజకీయ ఒత్తిడికి లోబడి నిర్ణయాలు తీసుకుంటే రేపు జైలుకు వెళ్లాల్సింది.. అధికారులే అని గుర్తించాలి. రాష్ట్రంలో కింది స్దాయి అధికారులపై కూడ వేధింపులు తీవ్రమయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ వాడిన భాష జుగుప్సాకరంగా ఉంది. వ్యాక్సిన్ అమలుకు.. రెవెన్యూకు ఏం సంబంధం.? ఆరోగ్య శాఖ ఏం చేస్తోంది.
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై సీనియర్ అధికారులు నోరు తెరవాలి. ఒక మహిళా ఉద్యోగిని కొట్టినా కూడా మహిళ కమీషన్ స్పందించడం లేదు. గతంలో నెల్లూరులో ఎం.డి.వోపై దాడి కేసులో ఎమ్మెల్యేకు స్టేషన్ బైల్ ఇచ్చారు. కాని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారు. ఇలాంటి విషయాలపై ఆల్ ఇండియా సర్వీసు అధికారులు, ఉద్యోగ సంఘాలు మాట్లాడాలి. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులపై జరుగుతున్న దాడులపై ప్రధాన కార్యదర్శి నోరు తెరవాలి.
గతంలో ఎస్.ఎస్.సి బోర్డులో చిన్న ఘటనలు జరిగినా.. పెద్దఎత్తున పోరాటాలు చేశాం. ఇప్పడు రాష్ట్రంలో ఉద్యోగులపై దాడులు జరిగినా, పని ఒత్తిడి పెరిగినా స్పందించే నాధుడే లేకుండా పోయాడు. ముగ్గురు చేసే పనిని ఒకరు చేయాల్సిన పరిస్థితి. కీలకమైన శాఖలలో కాంట్రాక్టు ఉద్యోగుల్ని నియమించడం అత్యంత ప్రమాదకరం. ఈ విషయంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి.