– గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
గన్నవరం: కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు . గురువారం విజయవాడ రూరల్ గ్రామాలు అయిన పాతపాడు , నైనవరం , అంబాపురం గ్రామాల్లో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు . ఆయన దృష్టికి వచ్చిన సమస్యలు తక్షణమే ఆదేశించాలని అధికారులను ఆదేశించారు . నేరుగా ప్రజల వద్దకు వెళ్లి 100 రోజుల్లో ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ ఇది మాటల ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వం అని అన్నారు . వరదల కారణం గా నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ఆదుకుందని చెప్పారు . ప్రజల సమస్యలు తీర్చేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు . వరదలతో తాను కూడా ముఖ్యమంత్రి తో కలిసి రోజుకు 18 గంటలకు పని చేశానని గుర్తు చేశారు.
అధికారులు బదిలీలు పూర్తి అయిన వెంటనే విజయవాడ రూరల్ లో ఒక గ్రామ సభ నిర్వహించి సమస్యలు పరిష్కారం చేస్తా అని హామీ ఇచ్చారు . కెడిసిసి బ్యాంక్ ను నెంబర్ వన్ స్థానం లో ఏ విధంగా నిలిపానో అదే విధంగా గన్నవరం నియోజక వర్గాన్ని కూడా నెంబర్ వన్ గా నిలిపేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు . మల్లవల్లి పారిశ్రామిక వాడ రానున్న రోజుల్లో రాష్ట్రానికే తలమానికం గా నిలుస్తుందనీ అన్నారు. వారం లో నాలుగు రోజులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని వెల్లడించారు.