– ఉద్యోగులపై జగన్ ఉక్కుపాదం ‘ఫలితం’
– అపాయింట్‌మెంట్ల విషయంలో లెక్కలేనితనం చూపించే పాలకులకు ఉద్యోగుల షాక్ ఒక గుణపాఠం
– ఉద్యోగులతో గేమ్స్ యమా డేంజర్
విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు తమ తమ డిమాండ్ లా కోసం ఉద్యమించాలని ఎప్పటిలాగానే ధర్నా కు పిలుపునిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు లను పంపించి ఉద్యమ నేతలను ముఖ్యంగా ఉపాధ్యాయులకు చుక్కలు చూపించారు నాటి ప్రభుత్వ పెద్దలు.మరీ దరిద్రంగా అప్పటికి క్రితం ఎన్నికల్లో వైసిపి కి, పోస్టల్ బ్యాలెట్ లు మొత్తం వేయించిన మాకు తెలిసిన ఒక ఉపాధ్యాయ నేతను, ఇంటి ముందు ఇద్దరు కానిస్టేబుల్స్ ను పంపి నిర్బంధించారు.
అంతే హా ఏం పోతాం లే అనుకున్న ఉద్యోగుల్లో కసి రగిల్చి, మారు వేషాల్లో, వికలాంగుల వేషం లో ఎలాగోలా మొత్తం లక్ష మంది దాకా విజయవాడ చేరుకుని రచ్చ రచ్చ చేశారు. ఆ వీడియోలు న్యూస్ రాష్ట్రం నలుమూలలా చేరటమే కాక, వైసీపీ కి అనుకూలమైన ఉద్యోగులు కూడా వ్యతిరేకంగా మారారు. ఆ సభ సక్సెస్ అవ్వటం జీర్ణించుకోలేని నాటి జగన్ సర్కార్.. ఉపాధ్యాయులకు జీతాల విషయం లో ప్రతీ నెలా ప్రత్యక్ష నరకం చూపించి, 15 వ తేదీ వచ్చినా కాలయాపన చేసింది.
దెబ్బకు ఆ వ్యతిరేకత కాస్తా ద్వేషంగా మారే స్థాయికి వెళ్ళింది.వ్యతిరేకత ద్వేషం తగ్గించే ప్రయత్నం చేశారా అంటే, సజ్జల చేసిన వాఖ్యలు వ్యతిరేకత ను కాస్తా ద్వేషం స్థాయికి పెంచాయి. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు జస్ట్ జగన్ ను కలిసి మాట్లాడాలి అనుకున్నారు. ఆయన దైవాంశ సంభూతుడు గా ఫీల్ అయ్యి సజ్జల ను పంపాడు చర్చలకు. ఆ చర్చల్లో సజ్జల చూపిన ఆటిట్యూడ్ వాళ్ళను శాశ్వతంగా దూరం చేసింది.
ఆ తర్వాత వాళ్ళు .. కనపడ్డ ప్రతీ ఒక్కరికీ వ్యతిరేకత నూరి పోశారు. . ఉపాధ్యాయులు ఎన్నికల్లో దొంగ ఓట్లు కూడా వేశారు. ఆ విషయం వాళ్ళే గర్వంగా చెప్పుకుంటున్నారు కూడా. ఫలితం 151 నుండి 11 సీట్లకు దిగారు. వాళ్ళు నేరుగా అధికారం చేపట్టలేరు గానీ, అధికారం లోకి తీసుకు రాగలరు. అధికారం నుండి దించగలరు.కాబట్టి ఉద్యోగులతో గేమ్స్ యమాడేంజర్. జగన్ ఓటమిని శాసించింది వారే మరి! అపాయింట్‌మెంట్ల విషయంలో లెక్కలేనితనం చూపించే పాలకులకు ఉద్యోగుల షాక్ ఒక గుణపాఠం.