Suryaa.co.in

Andhra Pradesh

తెనాలి, మాచర్ల, అనంతపురంలో జరిగిన సంఘటలను తీవ్రంగా పరిగణించిన ఈసీ

-గృహనిర్బంధం తో పాటు కేసులు పెట్టాలని ఆదేశం
-పుంగనూరులో నిందితులను వదిలేసిన ఎస్ఐ ని సస్పెండ్ చేయాలని ఆదేశం
-సాయంత్రం 4 – 6 గంటల మధ్య ఎటువంటి సంఘటనలు జరిగినా చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక

అమరావతి మే 13: నేడు రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పలుచోట్ల పలు దుర్ఘటనలు జరగడాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారం ముఖేష్ కుమార్ మీనా తీవ్రంగా పరిగణించారు. తెనాలి, మాచర్ల, అనంతపురం లో జరిగిన సంఘటలకు బాధ్యులైన వారిని వెంటనే గృహ నిర్బంధం చేయటంతో పాటు కేసులు పెట్టాలని ఆయా జిల్లాల ఎన్నికల, పోలీస్ యంత్రాంగాలను ఆదేశించారు. పుంగనూరులో జరిగిన సంఘటనలో నిందితులను వదిలేసిన ఎస్ఐ ని వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. సాయంత్రం 4 – 6 గంటల మధ్య ఎట్టువంటి సంఘటనలు జరిగినా అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.

LEAVE A RESPONSE