Suryaa.co.in

National

కరోనా సమయంలో విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఆ ఫీజు తిరిగి ఇవ్వాల్సిందే

– హైకోర్టు సంచలన తీర్పు

కరోనా సమయంలో పిల్లల నుంచి వసూలు చేసే ఫీజులపై అలహాబాద్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పాఠశాలలన్నీ కరోనా కాలంలో పిల్లల నుండి వసూలు చేసిన మొత్తం ఫీజులో 15శాతం తల్లిదండ్రులకు తిరిగి ఇవ్వవలసి ఉంటుందని లేదా తదుపరి సెషన్‌లో సర్దుబాటు చేయాలని కోర్టు తన నిర్ణయంలో పేర్కొంది.

కరోనా సమయంలో పిల్లల నుంచి వసూలు చేసే ఫీజులపై అలహాబాద్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పాఠశాలలన్నీ కరోనా కాలంలో పిల్లల నుండి వసూలు చేసిన మొత్తం ఫీజులో 15శాతం తల్లిదండ్రులకు తిరిగి ఇవ్వవలసి ఉంటుందని లేదా తదుపరి సెషన్‌లో సర్దుబాటు చేయాలని కోర్టు తన నిర్ణయంలో పేర్కొంది. ఫీజు మాఫీకి సంబంధించి చాలా మంది పిల్లల తల్లిదండ్రులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని, అందులో కరోనా సమయంలో ఫీజులు వసూలు చేశారని, అయితే పిల్లలకు ఆన్‌లైన్ ట్యూషన్ తప్ప మరే సేవలను అందించలేదని పిటిషన్ లో పేర్కొన్నారు.

తల్లిదండ్రులకు అనుకూలంగా నిర్ణయం
2020-21 మధ్యకాలంలో పిల్లల నుండి వసూలు చేసిన మొత్తం ఫీజులో 15 శాతం పాఠశాలలు తదుపరి సెషన్‌లో సర్దుబాటు చేయాల్సి ఉంటుందని , పాఠశాలలు ఈ డబ్బును పాఠశాల నుండి నిష్క్రమించిన విద్యార్థులకు తిరిగి ఇవ్వాలని అలహాబాద్ హైకోర్టు తన నిర్ణయంలో పేర్కొంది. ఇందుకోసం పాఠశాలలకు కోర్టు ఒక నెల సమయం ఇచ్చింది. వాస్తవానికి.. 2020-21 సంవత్సరంలో పాఠశాలలు పిల్లలకు ఆన్‌లైన్ ట్యూషన్ తప్ప మరే ఇతర సేవలను అందించలేదని.. అయితే ఆన్ లైన్ క్లాస్ లు అయినా.. పాఠశాలకు వెళ్తే ఎంత ఫీజు తీసుకుంటారో.. అంతే వసూలు చేశారని తల్లిదండ్రులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు.
దీనితో పాటు.. పిటిషనర్లు తమ వాదనలో ఇండియన్ స్కూల్, జోధ్‌పూర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్‌పై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని కూడా ఉదహరించారు. పాఠశాలలకు ఎలాంటి సేవలు అందించకుండా ఫీజులు డిమాండ్ చేయడం లాభాపేక్ష విద్యను వ్యాపారీకరణ చేయడమేనని ఈ నిర్ణయంలో పేర్కొన్నారు.

కరోనా వల్ల పెద్దవాళ్లే కాదు.. పిల్లల జీవితాలపై కూడా తీవ్ర ప్రభావం పడింది. కొన్ని వందల పాఠశాలలు మూసివేయబడ్డాయి. దానిలో పని చేసే ఎందో మంది ఉపాధ్యాయులు రోడ్డున పడ్డారు. ఇలా రెండు సంవత్సరాల వరకు గడ్డుకాలం నడిచింది. ఇక పాఠశాల పిల్లల విషయాలనికి వస్తే.. 2 సంవత్సరాలు ఇంట్లోనే చదువుకోవాల్సి వచ్చింది. చాలా పాఠశాలలు జూమ్ మీట్ , గూగుల్ మీట్ ద్వారా ఆన్‌లైన్ తరగతులు తీసుకున్నాయి. అయితే ఈ సమయంలో పూర్తి పాఠశాల ఫీజు తల్లిదండ్రుల నుండి రికవరీ చేశారు.

దీనిలో ఒక్క రూపాయి కూడా ఫీజు రాయితీ ఇవ్వలేదు. ఆ సమయంలో ఒక్క విద్యారంగమే కాదు.. మిగతా రంగాల్లో కూడా అంతగా ఉపాధి ఉండేది కాదు. దీంతో పాఠశాల ఫీజులు కూడా కట్టలేని స్థితిలో తల్లిదండ్రులు ఉండగా.. వాళ్ల వద్ద ఫీజులు వసూలు చేశారు. ఇలా చేయడం ద్వారా తల్లిదండ్రులు ఆర్థికంగా చితికి పోయారు. చాలా మంది కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయారు. ఎన్నో వ్యాపారాలు నిలిచిపోయాయి.

LEAVE A RESPONSE