రాష్ట్రానికి పూర్వవైభవం చంద్రబాబుతోనే సాధ్యం

– వైసీపీ పాలనలో యువత భవిష్యత్తు నాశనం
– మహిళల ప్రాణాలకు రక్షణ కరువు
– నారా భువనేశ్వరి

చంద్రబాబు పాలనలో అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ గా వెలుగొందిన రాష్ట్రం వైసీపీ పాలనలో అరాచక ఆంధ్రప్రదేశ్ గా మారిందని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. పుంగనూరు నియోజకవర్గం, పులిచర్ల మండలం, కమ్మపల్లి గ్రామంలో పార్టీకార్యకర్త వెంకటపతినాయుడు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం గ్రామస్తులతో భువనమ్మ మాట్లాడుతూ…

గంజాయి, మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏపీని ఈదేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబెట్టింది.గత నాలుగున్నర సంవత్సరాలుగా తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులపై దాడులు, హింసాకాండకు పాల్పడుతున్నారు.వైసీపీ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నారనే అక్కసుతోనే చంద్రబాబుపై అక్రమకేసు పెట్టి 53రోజులు జైల్లో పెట్టారు.

చంద్రబాబుకు సంఘీభావంగా నిరసన తెలిపిన టీడీపీ కార్యకర్తలపై కూడా వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి జైళ్లలో పెట్టింది.చంద్రబాబుకు సంఘీభావంగా శాంతియుత కార్యక్రమాలు చేసిన మహిళలను కూడా జగన్ ప్రభుత్వం అరెస్టు చేసి, అక్రమ కేసులు పెట్టి వేధించింది. వైసీపీ పాలనలో మహిళల మాన, ప్రాణాలకు రక్షణ కరువైంది. ఏపీలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక రాష్ట్ర యువత పక్కనున్న రాష్ట్రాలకు వలసలు వెళ్లిపోతున్నారు.

గంజాయి, మత్తు పదార్థాలకు యువత బానిసలై వారి జీవితాలను వైసీపీ పాలనలో నాశనం చేసుకుంటున్నారు. ఏపీకి పూర్వవైభవాన్ని తీసుకురావాలంటే ఆ సామర్థ్యం కేవలం చంద్రబాబు ఒక్కరికే ఉంది. భావితరాల భవిష్యత్తు బాగుంటాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి.

ఇప్పటి వరకు పోరాటాలతో పార్టీని నిలబెట్టుకున్న కార్యకర్తలు రానున్న ఎన్నికల్లో పట్టుదలతో, చేయిచేయి కలిపి ఎన్నికలను పారదర్శకంగా జరిపించుకునేందుకు ముందుకు రావాలి. ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు విధించినా, ఇబ్బందులు పెట్టినా వచ్చే ఎన్నికల్లో పోరాడి గెలవాలి. వైసీపీ సిద్ధం అంటే…మనం సై అంటూ ముందుకు దూకాలి..అని భువనమ్మ అన్నారు.

Leave a Reply