– ఉపాధ్యాయులపై వైసీపీ మొసలికన్నీరు
– ప్రభుత్వ ఉద్యోగుల గురించి మాట్లాడే అర్హత మాజీ సీఎంకు లేదు
– నీలాయపాలెం విజయ్ కుమార్
మంగళగిరి : జగన్ రెడ్డి ఐదేళ్ల తరువాత ఉద్యోగులపై మొసలికన్నీరు కారుస్తున్నారని ఆంధ్రప్రదేశ్ బయో డైవర్సిటీ బోర్డు ఛైర్మన్, నీలాయపాలెం విమర్శించారు. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నూరు ఎలుకలను తిన్న పిల్లిలా జగన్ రెడ్డి ఉపాధ్యాయుల పట్ల వ్యవహరిస్తున్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 43 శాతం పీఆర్సీ ఇచ్చింది. జగన్ 21 శాతానికి తగ్గించారు.. ఇప్పుడు జగన్ ఉద్యోగుల గురించి మాట్లాడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే…
ఒక్కొక్క యూనియన్ నాయకులను, ఉద్యోగులను హౌస్ అరెస్ట్ చేసిన చరిత్ర జగన్ రెడ్డి మర్చిపోయి మాట్లాడుతున్నారు. పీఎఫ్ నిధులను దోచుకొని ప్రశ్నించిన కేఎస్ సూర్యనారాయణను చంపేస్తామని బెదిరించింది, రాష్ట్రం వదలి వెళ్లిపోయే పరిస్థితి తీసుకొచ్చిన క్రిమినల్ చరిత్ర వైసీపీ నాయకులది. కరోనా సమయంలో మాస్క్ కు అడిగినందుకు డాక్టర్ సుధాకర్ ను చేతులు విరిచిన మీరు… ఉద్యోగుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్ కు ఉందా? ప్రభుత్వం ఉపాధ్యాయులకు వైన్ షాపుల దగ్గర డ్యూటీలు వేసి తలదించుకునే పరిస్థితి తీసుకుచ్చింది జగన్ రెడ్డి కాదా? ప్రభుత్వ ఉద్యోగులు చేసే పనులను వాలంటీర్లు చేసినట్లు చెప్పి ప్రభుత్వ ఉద్యోగులను అవమానించారు.
గత ఐదేళ్లు వైసీపీ నాయకులు ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేసిన సందర్భంలో ఏనాడు జగన్ ప్రశ్నించలేదు. వైజాగ్ భూ మాఫియా ఎంఆర్ఓని హత్య చేస్తే వారిపై చర్యలు తీసుకున్నారా? అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానని అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి సీపీఎస్ రద్దు చేశారా? భూ మాఫియా నుంచి కల్తీ లిక్కర్ మాఫియా వరకు ఉద్యోగులను జైలు పాలు చేసింది జగన్ రెడ్డి కాదా? ఈ రోజు సడన్ గా ఉద్యోగులపై జగన్ ప్రేమను ఒలకపోస్తున్నాడు. ఒక డీఎస్సీ ఉద్యోగం నియామకం చేపట్టకుండా వరల్డ్ బ్యాంక్ ఒప్పందం తో నాడు-నేడు పేరుతో వేల కోట్లు దోచుకున్నారు.
15 నెలల్లోనే మెగా డీఎస్సీ ద్వారా 16వేల టీచర్లు పోస్టులు భర్తీ చేశాం. ఉద్యోగులపై సీబీఐ గుఢాచారి మాదిరి ప్రవీణ్ ప్రకాశ్ ను నియమించి ఉపాధ్యాయులకు నరక యాతన చూపించిన ఘనత జగన్ రెడ్డిది.. నేడు జగన్ ఆస్కార్ లెవెల్ లో ఉద్యోగులపై దొంగ ప్రేమ చూపిస్తున్నారు.
ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకు డ్యూటీ వద్దని చెప్పిన వ్యక్తి జగన్ రెడ్డి కాదా? గత ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. టీచర్లకు ఇంత జీతాల అని వారిని అవమానించింది జగన్ రెడ్డి కాదా.? నేడు కూటమి ప్రభుత్వంలో 1వ తారీఖునే జీతాలు ఇవ్వడం జరుగుతోంది.
వైసీపీ హయాంలో ఐబీ పేరుతో 28వేల కోట్లు అవినీతి చేశారు. ఉద్యోగులకు మాయమాటలు చెప్పి వారి రెచ్చగొట్టాలని చూస్తున్నారు.. జగన్ మాయలో ఉద్యోగులు పడ్డారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అన్నింటిని అమలు చేస్తోంది.
కస్తూర్బా గాంధీ గిరిజన పాఠశాలల్లో 729 నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేశాం. జూనియర్ కాలేజీల్లో 700 సిబ్బంది నియామకాలను భర్తీ చేశాం. 700 కోయ భారత్ టీచర్లు పోస్టులు భర్తీ చేశాం..476 ప్రభుత్వం జూనియర్ కాలేజీల్లో 3619 కాంట్రాక్ట్ సేవలు పునరుద్ధరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 117 జీవోను రద్దు చేశాం.. ఉద్యోగులపై వైసీపీ హయాంలో పెట్టిన క్రిమినల్ కేసులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేసులు ఎత్తివేశాం.
సాల్డ్ ద్వారా ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. గత వైసీపీ ఉపాధ్యాయులకు 18 యాప్ లు పెట్టారు. ఇప్పుడు ఒకే యాప్ అమలు అవుతోంది. ఉద్యోగులను అన్ని విధాలుగా అందుకునేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది