– దేవినేని ఉమామహేశ్వర రావు ప్రశంస
పెనమలూరు : కృష్ణాజిల్లా పెనమలూరులో కమ్మవారి సేవా సమితి-గ్రేటర్ విజయవాడ కిలారు విశాలాక్షి గారి స్మారక విద్యాలయ బాలికల వసతిగృహాన్ని దేవినేని ఉమామహేశ్వర రావు సందర్శించారు. పెనమలూరులో కమ్మవారి సేవా సమితి సేవలు ఆదర్శవంతమైనవని, దివంగత దేవినేని వెంకటరమణ-ప్రణీత మెమోరియల్ ట్రస్ట్ తరపున సేవా సమితికి రూ. 5 లక్షల విరాళం అందజేస్తున్నట్టు దేవినేని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
పేదరికంలో మునిగి చదువుకోలేని విద్యార్థినులకు అవకాశాలు కల్పిస్తున్న కమ్మవారి సేవాసమితి సేవలు ఆదర్శవంతమైనవని, ప్రభుత్వ సహాయం లేకుండా దాతల ఔదార్యంతో 3,000 మంది విద్యార్థినులకు భవిష్యత్తులో గొప్ప అవకాశాలు కల్పించేలా తీర్చిదిద్దాలనే లక్ష్యం గర్వకారణమన్నారు. పెనమలూరు ప్రాంతంలో 150 మంది బాలికలకు వసతి సౌకర్యాలు అందిస్తున్న కమ్మవారి సేవా సమితి సేవలు అసాధారణమైనవని, పేదరికంలో ఉండి చదువుకోలేని విద్యార్థినులను గుర్తించి, వారికి అవకాశాలు కల్పిస్తున్నారని అన్నారు.
విద్యతో పాటు ఉన్నత విలువలు, క్రమశిక్షణను నేర్పుతూ మెలుగుతున్న విద్యార్థుల తీరు అభినందనీయం..
తాతినేని విద్యాసాగర్ నవత, యూనియన్ బ్యాంక్, మార్క్ ఫెడ్, చైతన్యలలో పనిచేసిన అనుభవంతో ఇక్కడ హెచ్ఆర్గా ఉన్నత సేవలు అందిస్తున్నారని ఉమా తెలిపారు. ఎర్రబడి జనార్దన్ సంస్థ అభివృద్ధి కోసం మూడున్నర కోట్ల రూపాయలతో స్థలం కొనుగోలు చేసి, భవనం నిర్మాణానికి కృషి చేస్తున్నారు… ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థినులు ఉత్తమ ప్రతిభ చూపుతూ ప్రతి సంవత్సరం 15 మంది ఐఐటీలకు ఎంపికవుతుండడం అభినందనీయం.