Suryaa.co.in

Features

చాణక్యుడి ‘మూడు జల్లెడ’ల నీతి

ఒకసారి చాణక్యుని దగ్గరకు
ఓ మిత్రుడు వచ్చి
“నీకు తెలుసా నీ సన్నిహిత మిత్రుడి గురించి..?
నేను ఒక విషయం విన్నాను”
అంటూ..ఎంతో ఉత్సాహంగా ఇంకేదో చెప్పబోతున్న అతన్ని చాణక్యుడు వారిస్తూ….

“నీవు నా మిత్రుడి గురించి చెప్పబోయే ముందు.. ఒక్క నిముషం ఆగు.. నీవు చెప్పబోయే విషయాన్ని కొద్దిగా జల్లెడ పడదాం” అన్నాట్ట..
ఆ మిత్రుడు
ఇక్కడ జల్లెడతో పనేమి అన్నాడట..!!?

ఓ మిత్రమా..ఎవరు ఎవరి గురించి ఏం చెప్పినా..
“మూడు జల్లెడ్లల పరీక్ష”
అనేదొకటుందని నేను నమ్ముతాను అంటూ..
చాణుక్యుడు తన జల్లెడలను ఇలా చెప్పాడు

మొదటి జల్లెడ:

దాని పేరు ‘నిజం’..
“నీవు నా స్నేహితుడి గురించి చెప్పబోయే విషయం కచ్చితంగా నిజమైనదని నీకు తెలుసా ?” అని చాణుక్యుడు అడిగాడు.
అందుకు ఆ స్నేహితుడు “లేదు ఎవరో అంటుండగా విన్నాను” అని అన్నాడు.
అంటే.. ‘నీవు చెప్పబోయే విషయం నిజమైనదే అని నీకు తెలీదన్న మాట’
అని చాణిక్యుడు అన్నాడు.

రెండో జల్లెడ:

దానిపేరు ‘మంచి’
‘నీవు నాకు చెప్పబోయే విషయం నా మిత్రుని గురించిన మంచి విషయమా?’ అని అడిగాడు చాణక్యుడు.
“కాదు” అన్నాడు చాణక్యుని స్నేహితుడు
అంటే…
‘నీవు నా మిత్రుని గురించి చెడు చెప్పాలనుకున్నావు. అది కుడా నీకు ఖచ్చితంగా నిజమని తెలీని విషయంపై’ కదా..?
సరే ఇంక మూడో జల్లెడకు వెళదాం అన్నాడు చాణక్యుడు.

మూడో జల్లెడ:

దాని పేరు ‘ఉపయోగం’

‘నీవు నా మిత్రుని గురించి చెప్పబోయే విషయం నాకు ఉపయోగమైనదా?’ అని అడిగాడు చాణుక్యుడు
“లేదు” అన్నాడు ఆ మిత్రుడు.

“అయితే నీవు చెప్పబోయే విషయం నిజమైనది, మంచిది, ఉపయోగకరమైనదీ..కానపుడు నాకు చెప్పటం ఎందుకు ?” అని అడిగాడు చాణుక్యుడు.

నీతి: దీనివల్ల మనకు అర్ధమయ్యేది ఏమిటంటే ఇతరులపై నిందలు వేసే ముందు దానిని నిర్థరించుకోవాలి. అది చేయకుండా గాలివార్తలు ప్రచారం చేస్తే అది మీ వ్యక్తిత్వానికే నష్టం.

 

LEAVE A RESPONSE