– జలగన్న నిజస్వరూపమేమిటో జనానికి అర్థం కాలేదు
– యువగళం పాదయాత్ర నుండి నారా లోకేష్
రాష్ట్రంలో పెట్రోలు ధరలు జగన్ పాపాల చిట్టా మాదిరిగా రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆదోనిలోని భారత్ పెట్రోలు బంకు వద్ద లీటరు పెట్రోలు ధర రూ.111.31, డీజిల్ ధర రూ.99.09 రూపాయలు కాగా, పొరుగున ఉన్న కర్నాటకతో పోలిస్తే పెట్రోలు 13రూపాయలు, డీజిల్ ధర 10రూపాయలు అధికం. ఎన్నికలప్పుడు జగన్ పెంచుకుంటూ పోతానంటే అమాయక ప్రజలు నమ్మి ఓట్లు గుద్దేశారు. అధికారంలోకి వచ్చాక ఆకాశమేహద్దుగా రోజురోజుకు పెంచుతూ పోతున్న పెట్రోలు, డీజిల్, నిత్యవసరాలు, ఇంటిపన్నులు, కరెంటు చార్జీలు చూశాక గానీ జలగన్న నిజస్వరూపమేమిటో జనానికి అర్థం కాలేదు. ఒక్కఛాన్స్ తో నిండామునిగిన ఏపీ ప్రజలనోట ఇప్పుడు వస్తున్న మాట సైకో పోవాలి…సైకిల్ రావాలి!