Home » మేనిఫెస్టోలో నాకు నచ్చిన హామీ 20 లక్షల ఉద్యోగాలు

మేనిఫెస్టోలో నాకు నచ్చిన హామీ 20 లక్షల ఉద్యోగాలు

-సైకో వేధింపులతో వెళ్లిన పరిశ్రమలను తిరిగి తీసుకువస్తాం
-వందరోజుల్లో గంజాయి, బ్లేడ్‌ బ్యాచ్‌లను జైలుకు పంపుతాం
-వైసీపీ వేధింపులకు బలైన కుటుంబాలకు న్యాయం చేస్తాం
-రాజంపేట యువగళం సభలో యువత ప్రశ్నలకు నారా లోకేష్‌ సమాధానాలు

డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం రాబోతోంది. అభివృద్థి, సంక్షేమంలో దూసుకెళతాం. వెళ్లిపోయిన పరిశ్రమలను బతిమిలాడి కాళ్లు పట్టుకుని, చేతులు పట్టుకుని ఏదో ఒకరకంగా తీసుకువస్తాం. పెట్టుబడులు తీసుకువచ్చి యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తాం. ఐదేళ్లలో మన గడ్డపై పరిశ్రమలు తీసుకువస్తాం. మన వారికే ఉద్యోగాలు కల్పిస్తాం. పక్క రాష్ట్రాల వారికి అవకాశం ఇవ్వం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు అనేది మేనిఫెస్టోలో నాకు నచ్చిన హామీ.

కిషోర్‌, యాంకర్‌: రాజంపేట కీలకమైన ప్రాంతం. ఇక్కడ గెలిచిన పార్టీనే అధికారంలోకి వస్తుంది. ఇలాంటి గడ్డపై ఏ ధైర్యంతో సమరశంఖం పూరిస్తున్నారు?
నారా లోకేష్‌: టీడీపీ అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసింది. పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకు వచ్చాం. నేను రాయలసీమలోనే ఎక్కువ రోజులు పాదయాత్ర చేశా. టీడీపీ హయాంలో పెద్దఎత్తున సీసీ రోడ్లు వేశాం. కియా పరిశ్రమ తీసుకువచ్చాం. మేం తీసుకువచ్చిన పరిశ్రమల ముందు సెల్ఫీలు దిగి చాలెంజ్‌ చేస్తే జగన్‌ రెడ్డి నుంచి సమాధానం లేదు.జరుగు జగన్‌..జరుగు జగన్‌..వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే.

ఇందు, రాజంపేట: వైఎస్‌ వివేకాను దారుణంగా చంపారు. చంద్రబాబు గారిపై నిందమోపారు. నేడు వివేకా కుమార్తె బయటకు వచ్చి జగనే చంపేశారంటున్నారు. దీనిపై మీరేమంటారు?
నారా లోకేష్‌: నిజం గడపదాటే లోగా అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. వివేకాను చంపి నారాసుర రక్తచరిత్ర అంటూ సాక్షి ఫుల్‌ పేజీలో రాశారు. నిజం నిప్పులాంటిది. ఈ రోజు సునీత గారు బయటకు వచ్చి నిజం చెప్పారు. ఇప్పుడు అర్థమైంది కదా ఎవరు చంపారో? చంద్రబాబు ఏనాడు హత్యా రాజకీయాలు, మత ఘర్షణలను ప్రోత్సహించలేదు. తెలుగువారు ఎక్కడున్నా నెం.1గా ఉండాలనేదే మా లక్ష్యం. అన్న ఎన్టీఆర్‌ నుంచి చంద్రబాబు వరకు ఏపీని అభివృద్ధి చేశారు. పరిశ్రమలు, ఉద్యోగాలు తీసుకువచ్చారు. 2019లో బ్రేక్‌ వచ్చింది. టీడీపీని గెలిపిస్తే కుల,మతాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం.

కుసుమకుమారి: టీడీపీ హయాంలో మేము ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీ ప్రారంభించాం. మేం వైసీపీకి మద్దతు ఇవ్వలేదని మాకు సబ్సిడీలు, రుణం రాకుండా ఇబ్బందులు పెట్టారు. మా ఇండస్ట్రీని మూతవేయడం వల్ల నా భర్త ఆత్మహత్య చేసుకున్నారు. మా ఇండస్ట్రీకి చేయూత ఇస్తే 700 మంది వరకు ఉపాధి కల్పిస్తాం. మన ప్రభుత్వం వచ్చాక సహకరించాలి.
నారా లోకేష్‌: పరిశ్రమలకు పార్టీ పేరు రుద్దుతున్నారు. అమర రాజా రాష్ట్రంలో అత్యధిక పన్ను చెల్లిస్తుంది. ఆ కంపెనీ సీఈవో జయదేవ్‌ గల్లా టీడీపీ అని పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ను పంపించి వేధించారు. దీంతో తెలంగాణలో ప్లాంట్‌ పెట్టి 20 వేల మందికి ఉద్యోగాలు కల్పించారు. కుసుమ గారిని కూడా ఇబ్బంది పెట్టారు. చట్టం ప్రకారం రావాల్సిన సబ్సిడీలు రాకుండా చేశారు. మేం ఏనాడైనా భారతి సిమెంట్స్‌, సండూర్‌ పవర్‌, సాక్షి పత్రికను ఇబ్బంది పెట్టామా? పార్టీలకతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. చివరి మూడు నెలలు రాజకీయం చేద్దాం. పెట్టుబడులు పెట్టిన వారిని, క్వారీ యజమానులు, మైనింగ్‌ యజమానులను పాపాల పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు ఇబ్బంది పెట్టారు. వాటిని లాక్కున్నారు. దీనివల్ల యువత నష్టపోయింది. ఐదేళ్లలో ఒక్క పరిశ్రమ రాలేదు. వైసీపీ రాజకీయ వేధింపుల వల్ల రాష్ట్ర నష్టపోయింది. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే పరిశ్రమలకు రావాల్సిన సబ్సిడీలు ఇస్తాం. కోడిగుడ్డు మంత్రి పరిశ్రమలు ఎప్పుడు తీసుకువస్తారంటే కోడి ముందా, గుడ్డు ముందా అని మాట్లాడతారు. అందుకే ఆయనకు ఆమ్లెట్‌ వేసి రిటర్న్‌ గిప్ట్‌ ఇవ్వబోతున్నారు.

కిషోర్‌, యాంకర్‌: రెడ్‌ బుక్‌ ప్రజల్లోకి బలంగా వెళ్లింది. దీనివల్ల లాభమా, నష్టమా?
నారా లోకేష్‌: 2019కి ముందు లోకేష్‌పై ఒక్క కేసు లేదు. ఇప్పుడు 23 కేసులు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, హత్యా యత్నం కేసులు పెట్టారు. 6,7 సార్లు పోలీసుస్టేషన్‌కు వెళ్లాం. ఏ తప్పూ చేయని చంద్రబాబు గారిని 53 రోజులు జైల్లో పెట్టారు. సింహం ఎక్కడున్నా సింహమే. జగన్‌ రెడ్డిని ఈ సింహం వదిలిపెట్టదు. బాంబులకే భయపడని కుటుంబం మాది. ఎక్కడా తగ్గేదే లేదు. మేం ఏనాడు తప్పు చేయలేదు. అందుకే మేం పరదాలు లేకుండా తిరుగుతున్నాం. జగన్‌ రెడ్డిలా తండ్రిని అడ్డుపెట్టుకుని అవినీతి చేయలేదు. సిమెంట్‌ ఫ్యాక్టరీలు కట్టుకోలేదు, పేపర్‌, టీవీ పెట్టలేదు. నీతి, నిజాయతీతో మేం బతికాం. అదే మాకు శ్రీరామరక్షణ. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై న్యాయవిచారణ జరిపి జైలుకు పంపిస్తాం. చట్టాన్ని కొంతమంది కోసం చుట్టం చేయకూడదు. అందుకే రెడ్‌ బుక్‌. తప్పు చేసిన వారిని వదిలిపెట్టం.

వేణుగోపాల్‌, నెల్లూరు: పేదలకు ఇది చేశా, అది చేశా అని జగన్‌ చెబుతున్నారు. పేదలకు భోజనం పెట్టే అన్న క్యాంటీన్లను మూసివేశారు. మీరు వచ్చిన తర్వాత తిరిగి ప్రారంభిస్తారా?
నారా లోకేష్‌: జగన్‌ బులుగు బటన్‌ నొక్కి అకౌంట్‌లో రూ.10 వేసి రెడ్‌ బటన్‌తో రూ.100 లాక్కుంటు న్నారు. కరెంట్‌ చార్జీలు 9 సార్లు పంచారు, ఆర్టీసీ చార్జీలు మూడు సార్లు పెంచారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచారు. దాదాపు 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. ఆపేసిన సంక్షేమ కార్యక్రమాలు తిరిగి ప్రారంభించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. మూసేసిన అన్న క్యాంటీన్లను ప్రారంభించే బాధ్యత మేం తీసుకుంటాం.

యువకుడు: ఒక బీసీ నాయకుడిగా మా భూములు కబ్జా చేయకుండా చూడాలని అడుగుతున్నా?
నారా లోకేష్‌: వైకాపా నాయకులు ఎక్కడ చూసినా భూకబ్జాలు చేస్తున్నారు. నంద్యాలలో అబ్దుల్‌ సలాం కుటుంబానికి చెందిన భూమి లాక్కున్నారు. న్యాయం చేయాలని అడిగితే వేధించారు, అవమానించారు. దీంతో వారు ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా భూములు లాక్కున్నారు. రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూపై విచారణ వేస్తాం. బలవంతంగా భూములు లాక్కున్న వారిపై చర్యలు తీసుకుని భూములు తిరిగి బాధితులకు అప్పగిస్తాం.

రితష్వి: సూపర్‌ సిక్స్‌ పథకాల్లో మీ ఫేవరెట్‌ పథకం ఏంటి? ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామన్నారు. చిన్న సిలిండర్లు ఇస్తారని వైసీపీ ప్రచారం చేస్తోంది. ఇది నిజమేనా?
నారా లోకేష్‌: అబద్ధాలు చెప్పడంలో జగన్‌ రెడ్డి దిట్ట. మేం నిజం కూడా బాగా చెప్పలేం. నాకు నచ్చిన హామీ ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పన. దీంతో ఏపీ ఎకానమీ రెండు రెట్లు పెరుగుతుంది. ఈ ఆదాయాన్ని పేద ప్రజల కోసం వెచ్చిస్తాం. ఏడాదికి మూడు ఎర్ర కలర్‌ గ్యాస్‌ సిలిండర్లు మేం అందిస్తాం.

యువకుడు: లులూ మాల్‌ వెళ్లిపోయింది కదా. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వెళ్లిపోయిన పరిశ్రమను తిరిగి తీసుకువస్తారా?
నారాలోకేష్‌: డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం రాబోతోంది. అభివృద్థి, సంక్షేమంలో దూసుకెళతాం. వెళ్లిపోయిన పరిశ్రమలను బతిమిలాడి కాళ్లు పట్టుకుని, చేతులు పట్టుకుని ఏదో ఒకరకంగా తీసుకువస్తాం. పెట్టుబడులు తీసుకువచ్చి యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తాం.

యువకుడు: నేను బీటెక్‌ చేశాను. ఉద్యోగం కోసం బెంగుళూరు వెళితే మీది ఏ రాష్ట్రం అని అడిగారు. ఏపీ అని చెబితే బయటకు పంపించారు. ఏపీని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు?
నారా లోకేష్‌: ఐదేళ్లలో మన గడ్డపై పరిశ్రమలు తీసుకువస్తాం. మనకే ఉద్యోగాలు కల్పిస్తాం. పక్క రాష్ట్రాల వారు వస్తే నో ఎంట్రీ. ఓన్లీ ఫర్‌ ఆంధ్రా. గతంలో షావోమీ ఫోన్‌ ఏపీలో తయారైంది. కియా కార్లు, టీసీఎస్‌, అపోలో టైర్స్‌, హీరో మేడిన్‌ ఆంధ్రప్రదేశ్‌. ఏషియన్‌ పెయింట్‌, బర్గర్‌ పెయింట్‌ కూడా మేడిన్‌ ఆంధ్రప్రదేశ్‌, క్యాడ్‌ బర్రీ కూడా మేడిన్‌ ఆంధ్రప్రదేశ్‌. ఐదేళ్లలో ఎన్నో పరిశ్రమలు తీసుకువచ్చాం. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.

కిషోర్‌, యాంకర్‌: బస్సు కండక్టర్లు, లాయర్లకు, విద్యావంతులు, సామాన్యులకు అన్న ఎన్టీఆర్‌ టికెట్లు ఇచ్చా రు. మీ జనరేషన్‌లో మీరేం చేస్తారు?
నారా లోకేష్‌: టీడీపీ యూనివర్సిటీ లాంటిది. గ్రామస్థాయి అధ్యక్షుడిని ఉపముఖ్యమంత్రిని చేశారు చంద్రబా బునాయుడు. ఒక మీడియా మిత్రుడిని మంత్రిని చేశారు. ఈ సారి కూడా మీడియా మిత్రులకు, డాక్టర్లకు, పారిశ్రామికవేత్తలకు అవకాశం కల్పించారు. టీడీపీ ఎప్పుడూ లీడర్లను తయారు చేస్తుంది. తెలంగాణ ఇద్దరు ముఖ్యమంత్రులు కేసీఆర్‌, రేవంత్‌ను తయారు చేసింది తెలుగుదేశం పార్టీ. వైసీపీలో కూడా 20 శాతం టీడీపీ వారే. నాయకులను తయారు చేయడం మాకు అలవాటు. యువతకు కూడా రాజకీయ అవకాశాలు కల్పిస్తాం.

యువకుడు: నేనొక దళితుడిని. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా చంద్రబాబు రుణమాఫీ చేశారు. రుణాలు ఇప్పిం చారు. 23 ప్రత్యేక పథకాలు ఇచ్చారు. జగన్‌ రెడ్డి వచ్చి అన్నింటినీ రద్దు చేశారు. వైసీపీ పాలనలో దళితులైన కిరణ్‌ను మాస్క్‌ లేదని కొట్టి చంపారు. దళిత డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంను చంపారు. మద్యంపై ప్రశ్నించిన ఓం ప్రతాప్‌ను శవంగా మార్చారు. మీ ప్రభుత్వం వచ్చాక శవాలను పంపిస్తారా, పథకాలు ఇస్తారా?
నారా లోకేష్‌: ఓం ప్రతాప్‌ను చంపింది పాపాల మిథున్‌రెడ్డి. పెద్దరెడ్డి కుమారుడు. పుంగనూరు నియోజక వర్గంలో అతడిని చంపారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు గంజాయి మత్తులో తన దళిత డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం ను చంపి డోర్‌ డెలివరీ చేశారు. అలాంటి వ్యక్తిని సీఎం పక్కన పెట్టుకుంటారు. వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. వంద రోజుల్లో ఆయా కుటుంబాలకు న్యాయం చేస్తాం.

యువకుడు: అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయింది. రైతులు నష్టపోయారు. ఇప్పటివరకు డ్యాం నిర్మించలేదు. అరటి, నిమ్మ రైతులకు మద్దతు ధర దక్కడం లేదు. కోల్డ్‌ స్టోరేజీలు నిర్మించాలి. కరెంట్‌ కోతలతో ఇబ్బందులు పడుతున్నాం. ఆడవారు కూడా వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల కరెంట్‌ ఇవ్వాలి. గుండాలపల్లి కొండను కబ్జా చేశారు. ఐదేళ్లుగా పోరాడుతున్నాం. ఈ రోజు వరకు సమస్య పరి ష్కారం లేదు.
నారా లోకేష్‌: అరటిని పెద్దఎత్తున ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ. కర్జూరాను కూడా ప్రోత్సహించాం. ధరలు తగ్గినప్పుడు రైతులను ఆదుకుంటాం. జగన్‌ రెడ్డి గిట్టుబాటు ధర కల్పించడం లేదు. తాము కోల్డ్‌ స్టోరేజ్‌, చాంబర్స్‌ నిర్మిస్తాం. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడానికి అక్రమ ఇసుక తవ్వకాలే కారణం. నాడు వెయ్యి రూపాయలు ఉన్న ట్రాక్టర్‌ ఇసుక నేడు రూ.7 వేలకు చేరింది. ఇసుకలో జగన్‌ రోజుకు 3 కోట్లు సంపాదిస్తున్నారు. ఏడాదికి రూ.1080 కోట్లు సంపాదిస్తున్నారు. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడం వల్ల 38 మంది చనిపోయారు. ఆదుకుంటామని బిల్డప్‌ ఇచ్చి ఒక్కరిని కూడా ఆదుకోలేదు. మన ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తాం. అన్నమయ్య డ్యాంను తిరిగి నిర్మించి నీరు నిల్వ చేస్తాం.

ప్రసన్న: అసెంబ్లీలో దిశ చట్టం గురించి మాట్లాడుతూ గన్‌ కంటే ముందు జగన్‌ వస్తారన్నారు. మేం కాలేజీకి వెళ్లి తిరిగి రావాలంటే డ్రగ్స్‌ తీసుకున్న వారు, ఆల్కహాల్‌ తీసుకున్న వారు కనిపిస్తున్నారు. బయటకు వెళ్లాలం టే భయమేస్తోంది. గన్‌ ఎక్కడికి పోయింది. మీరు వస్తే ఏం చేస్తారు?
నారా లోకేష్‌: జగన్‌ది తుస్సుతుస్సు గన్‌. నొక్కితే నీళ్లు బయటకు వస్తాయి. ఐదేళ్లలో 31 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారు. కొత్త కొత్త చట్టాలు తీసుకువచ్చామంటారు. ఒక్కరికి కూడా శిక్ష లేదు. దిశ చట్టమే లేదు. కేంద్రమే వెనక్కి పంపింది. మహిళా హోంమంత్రి ఉన్నారు. గుంటూరులో దళిత యువతి రమ్యను కిరాతకంగా హత్య చేస్తే పట్టించుకోలేదు. నేను వెళ్లి అండగా నిలిచా. నన్ను మొదటసారి పోలీస్‌ స్టేషన్‌ తీసుకెళ్లింది ఆ విషయంలోనే. గంజాయి, మద్యం వినియోగం పెరిగింది. మేం వచ్చిన వంద రోజుల్లో గంజాయికి ఫుల్‌స్టాప్‌ పెడతాం. చంద్రబాబు గారిని చూస్తే రౌడీలకు, దొంగలకు ఎర్రచందనం స్మగ్లర్లకు భయం. సీబీఎన్‌ అంటే ఒక బ్రాండ్‌. నెలరోజులు ఓపికపట్టండి. మన ప్రభుత్వం వస్తుంది. ఈ రౌడీషీటర్లు, ఈ గంజాయి బ్యాచ్‌, బ్లేడ్‌ బ్యాచ్‌ భారతదేశాన్ని వదిలైనా వెళ్లాలి లేదా జైల్లో ఉండాలి. రెండిరటిలో ఏదో ఒకటి జరుగుతుంది. అది చేసే బాధ్యత మీ లోకేష్‌ తీసుకుంటాడు.

యువకుడు: రాజంపేటలో ఆర్‌ఎస్‌ మెయిన్‌ రోడ్డు డెవలప్‌ మెంట్‌ లేదు. దీనివల్ల చాలా కాంప్లెక్స్‌లు కన్‌ స్ట్రక్షన్‌ చేయకుండా ఆపేశారు. దీంతో ఉపాధి లేక యువత నష్టపోతోంది. రాజంపేటను అభివృద్ధి చేయాలి.
నారా లోకేష్‌: పంచాయతీల్లో 25 వేల కి.మీ సీసీ రోడ్లు వేశాం. రాజంపేటలో పసుపు జెండాను ఎగురవే యాలి. టీడీపీని గెలిపిస్తే అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటా.

యువకుడు: అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి 38 మంది చనిపోయారు. రేపు మీరు వచ్చిన తర్వాత డ్యాం నిర్మించాలి. తాగునీరు అందించాలి. చుక్కల భూములు తీసేయాలి. రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలి.
నారాలోకేష్‌: అన్నమయ్య డ్యాంను తిరిగి నిర్మించి నీరు నిల్వ చేస్తాం. పాపాల మిథున్‌ రెడ్డి అనేక భూములను చుక్కల భూముల్లో పెట్టారు. నేను చూసుకుంటా. రాజంపేటను జిల్లా కేంద్రంగా చేస్తాం. పాదయాత్రలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నా.

హిమబందు: నేను పీజీ చేసి నిరుద్యోగిగా ఉన్నా. రేపు కూటమి ప్రభుత్వంలో ఉద్యోగాలు కల్పిస్తారా?
నారా లోకేష్‌: కియా, ఫాక్స్‌ కాన్‌, సెల్‌ కాన్‌, హెచ్‌ సీఎల్‌, టీసీఎస్‌, జోహో వంటి పరిశ్రమలు తీసుకు వచ్చింది చంద్రబాబు. జగన్‌ బూమ్‌ బూమ్‌, 9 గుర్రాలు, ఆంధ్రా గోల్డ్‌, ప్రెసిడెంట్‌ మెడల్‌ తీసుకువచ్చారు. మేం పెట్టుబడులు తీసుకువచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం. ఇద్దరు నాయకుల మధ్య తేడా గమనించాలి.

యువకుడు: స్మశానాలకు స్థలం కేటాయించాలి.
నారా లోకేష్‌: రాష్ట్రవ్యాప్తంగా ఈ సమస్య ఉంది. దామాషా ప్రకారం భూములు కొనుగోలు చేయాలి. స్మశానా లు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.

నాగరాజు, షికారుపాలెం: సైకో ప్రభుత్వంలో మా గ్రామంలో అభివృద్ధి లేదు. కనీసం తాగునీరు లేదు. ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ఎదురుచూస్తున్నాం. మీరు వచ్చిన తర్వాత స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మారుస్తారని ఆశిస్తున్నా.
నారా లోకేష్‌: ఈ ప్రభుత్వం పోవాలంటే టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిని గెలిపించాలి. ఎంపీగా కిరణ్‌ కుమార్‌ రెడ్డి, ఎమ్మెల్యేగా సుబ్రహ్మణ్యంను గెలిపించాలి.

మల్లికార్జున: ఎంతోమంది నాలాంటి యువకులు నష్టపోవడానికి కారణమైన జీవో 77ను రద్దు చేయాలి.
నారా లోకేష్‌: జీవో 77 పీజీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రద్దు చేస్తూ ఇచ్చారు. స్కూల్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలులో కూడా ఇబ్బందులు ఉన్నాయి. సకాలంలో సర్టిఫికెట్లు అందక ఇబ్బందులు పడుతున్నారు. మేం వచ్చిన వెంటనే పాత ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తాం. పీజీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తిరిగి తీసుకు వస్తాం. బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ను తిరిగి తీసుకువస్తాం. విదేశీ విద్య పథకాన్ని తిరిగి ప్రారంభిస్తాం.

యువకుడు: రాష్ట్రానికి ఆదాయమే లేదు. ఇన్ని పథకాలు ప్రకటించారు. వీటిని ఎలా నెరవేరుస్తారు?
నారా లోకేష్‌: జగన్‌రెడ్డి అప్పులు చేసి బటన్‌ నొక్కుతున్నారు. అందుకే అన్ని ధరలు పెరిగాయి. మేం అభివృద్ధి చేసి.. ఆ వనరులను సంక్షేమానికి ఖర్చుపెడతాం. ఆ లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల బండి. రెండిరటిని సమానంగా ముందుకు తీసుకెళతాం.

అలీబాబు, వంగిమళ్ల: ఇక్కడ నిరుద్యోగం ఎక్కువగా ఉంది. 10 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. చిన్న చిన్న పోస్టులు కూడా లక్షల రూపాయల లంచం అడుగుతున్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు సరిగా లేరు. తాగునీటి సమస్య పరిష్కరించాలి?
నారా లోకేష్‌: టీడీపీ హయాంలో 11 డీఎస్సీల ద్వారా లక్షా 70 వేల పోస్టులు భర్తీ చేశాం. జగన్‌ రెడ్డి ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదు. అవినీతి లేకుండా యూనిఫైడ్‌ వెబ్‌సైట్‌ తీసుకువచ్చి ప్యూన్‌ నుంచి గ్రూప్స్‌ వరకు ఉద్యోగాలను భర్తీ చేస్తాం. పోలవరంను రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో నాశనం చేశారు. హంద్రీ-నీవాను మేం 90 శాతం పూర్తిచేశాం. ఇవన్నీ పూర్తిచేస్తే ప్రతి ఇంటికి కొళాయి ద్వారా తాగునీరు అందుతుం ది. చివరి ఎకరా వరకు సాగునీరు అందిస్తాం. 117 జీవో ద్వారా పాఠశాలలను మూసివేశారు. మేం వచ్చిన తర్వాత జీవో 117 రద్దు చేస్తాం. ఇంగ్లీషు మీడియంతో పాటు తెలుగు మీడియంను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.

కిషోర్‌, యాంకర్‌: వైసీపీ ప్రభుత్వంలో సందుపల్లి భూఆక్రణ ఎక్కువగా జరిగింది. దీనిపై ఏం చర్యలు తీసుకుంటారు?
నారా లోకేష్‌: రెవెన్యూ విషయంలో చాలా స్పష్టమైన హామీ ఇచ్చా. నెలలో మన ప్రభుత్వం వస్తుంది. ఎంక్వైరీ వేస్తాం, ఎవరైతే బలవంతంగా భూములు లాక్కున్నారో తిరిగి అందజేసే బాధ్యత మేం తీసుకుంటాం.

యువకుడు: ఈ ఐదేళ్లలో ఇసుక దందాలు, భూకబ్జాలకు పాల్పడుతున్నారు. సుండుపల్లి మండలంలో ప్రభుత్వ భూములు విచ్చలవిడిగా అమ్ముకున్నారు?
నారా లోకేష్‌: టీడీపీ హయాంలో వేలాది కోట్లతో రాజంపేటను అభివృద్ధి చేశాం. జగన్‌ రెడ్డి వచ్చిన తర్వాత అంతా నాశనం చేశారు. ఈ రోజు ఎక్కువగా మాట్లాడిరది భూకబ్జాలపైన. కొండలు, స్మశానాలు ఆక్రమించా రు. దీనంతటికి కారణం ఆకేపాటి అమర్నానాథ్‌ రెడ్డి. మళ్లీ ఆయనకే జగన్‌ టికెట్‌ ఇచ్చారు. ఆయన వస్తే మన ఇంటిపై కప్పు కూడా మిగలదు. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌తో మన భూములు దోచేస్తారు. ఒక్క ఎకరం భూమి కూడా మిగలదు. ఇవన్నీ ఆపాలంటే సుబ్మహ్మణ్యంను గెలిపించాలి.

Leave a Reply