Suryaa.co.in

Andhra Pradesh

సైకో పోవాలి… రాష్ట్రం బాగుపడాలి

-ఉత్తరాంధ్ర ద్రోహి జగన్
-అయోధ్యలో రామాలయం కడితే నెల్లిమర్లలో రాముడి తల తీసేశారు

-భోగాపురం విమానాశ్రయాన్ని 2025 నాటికి పూర్తి చేస్తాం
-ఇండస్ట్రీయల్ హబ్ గా నెల్లిమర్ల
-ఉత్తరాంధ్రలో ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశావా?
-కూటమికి ఓటు జగన్ గుండెలకు గుచ్చుకోవాలి
-రోజు రోజుకు పెరుగుతున్న బూటకపు గులకరాయి దెబ్బ
-నెల్లిమర్ల ప్రజాగళం సభలో నారా చంద్రబాబు నాయుడు

జగన్ సభలకు రావాలంటే రూ.500 నోటు, క్వార్టర్ బాటిల్ ఇస్తున్నా జనం రాని పరిస్థతి. అయోధ్యలో రామాలయం కడితే నెల్లిమర్లలో రాముడి తల తీసేశారు. 160 దేవాలయాలపై విధ్వంసాలు, విగ్రహాలు ధ్వంసాలు జరిగాయి. సీఎంని ప్రశ్నిస్తే పోలీసులు గోడలు దూకి మరి వచ్చి అరెస్ట్ చేశారు. అదే రాముడి తల తీసేస్తే ప్రశ్నించినందుకు నా మీద కేసు బనాయించారు. ఉత్తరాంధ్రకు ఒక్క ప్రాజెక్టు, ఒక్క సాగు నీటి ప్రాజెక్టు పూర్తి చేశారా, ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు, ఒక్క ఆడబిడ్డకు న్యాయం చేశావా అని సైకో జగన్ కి సవాల్ విసురుతున్నాను.

భోగాపురం విమానాశ్రాయాన్ని పూర్తి చేస్తాం
నేను ఉంటే ఈపాటికే ఉత్తరాంధ్రాకు భోగాపురం ఎయిర్ పోర్టు వచ్చేది. కాని ఇప్పటికే రాలేదు. 2,750 ఎకరాలతో భూసమీరణ చేసి శంకుస్థాపన చేస్తే జగన్ వచ్చాక దానికి మళ్లా శంకుస్థాపన చేస్తాడు గాని పని మాత్రం పూర్తి చేయరు. ఈ నియోజకవర్గంలో 2025 నాటికి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును పూర్తి చేస్తాను. విమానాశ్రయం వస్తే పరిశ్రమలు వచ్చి ఉద్యోగాలు వస్తాయి. పోలవరం పూర్తి కావాలి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి కావాలి. కాని జగన్ దుర్మార్గుడు వచ్చి అన్నింటిని నాశనం చేశారు.

ప్రజల కోసం పని చేస్తున్న పవన్ ఎక్కడ? శవాలతో రాజకీయం చేసే జగన్ ఎక్కడ?
జగన్ అహంకారంతో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఆయన కింద బానిసలుగా బ్రతకాలా? ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం వచ్చిన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన సినిమాలు తీసుకుంటే విలాశవంతగా ఉండేవారు కాని ప్రజల కోసం ఆయన ముందుకు వచ్చారు. జగన్ కు పవన్ కళ్యాణ్ కు చాలా తేడా ఉంది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్ష కోట్లు సంపాదించిన జగన్ ఎక్కడ? పవన్ కళ్యాణ్ ఎక్కడ? జగన్ కి అడ్డం వస్తే దేన్ని వదిలిపెట్టడం. కాని మేమిద్దం మాత్రం జగన్ ను చిత్తు చిత్తు ఓడిస్తామని నెల్లిమర్ల సభలో శపధం చేస్తున్నాను.

కనపడని గులకరాయి దెబ్బ 13వ తేదీ వరకు ఉంటుంది
జగన్ లాంటి బంధిపోట్లను ఓడించాలంటే మంచి వాళ్లందరూ, ప్రజలందరూ ఒకటవ్వాలి. 2014లో తండ్రి శవరాజకీయంతో వచ్చాడు, 2019లో బాబాయ్ ని హత్య చేసి శవరాజకీయాలు చేశాడు. ఇప్పుడు గులకరాయి డ్రామాతో మళ్లీ వస్తున్నాడు. కనపడని గులకరాయితో జగన్ కి దెబ్బ తగిలిందంటా? రోజు రోజుకు దెబ్బ పెరుగుతూనే ఉంది. 13 వ తేదీ సాయంత్రం వరకు దెబ్బ అలానే ఉంటుంది.

ఒక ప్రాంతానికి ఒక చిన్న పరిశ్రమను తెచ్చాను అని జగన్ బస్సు యాత్రలో చెప్పారా?
ఉత్తరాంధ్ర ద్రోహి జగన్ రెడ్డి. ఇడపుల పాయ నుంచి జగన్ యాత్ర సాగించి ఇంత వరకు ఈ ప్రాంతానికి ఈ మంచి చేశాను, ఈ ప్రజలకు ఇది చేశాను అని ఎక్కడా చెప్పని పరిస్థితి. ఒక్క చిన్న పరిశ్రమ, ఒక చిన్న ప్రాజెక్టు, ఒక ఊర్లో కట్టాడా అని అడుగుతున్నాను. అడవులు, కాల్వల్లో, శ్మశానాల్లో ఇళ్ల పేరుతో గూడులు కట్టారు. విశాఖలో రూ.500 కోట్లతో విలాశవంతమైన బంగ్లా కట్టుకొని పేదలకు మాత్రం సెంటు భూమి ఇస్తున్నారు.

సైకో పోవాలి రాష్ట్రం బాగుపడాలి
ప్రజల ఆదాయం పెరగలేదు. ప్రజల ఖర్చులు పెరిగాయి. జీవన ప్రమాణాలు తగ్గిపోయాయి దీనికి కారణం అసమర్ధుడు, అవినీతి పరుడు, చేతగాని పాలన. అభివృద్ధి అంటే సంపద సృష్టించాలి ఆదాయం పెంచాలి, ఉద్యోగాలు ఇవ్వాలి. మూడు పార్టీలు కలిసింది మాకోసం కాదు, ముగ్గురం త్యాగం చేశాం. కేవలం రాష్ట్రం బాగు కోసం కలిశాం. సైకో పోవాలి రాష్ట్రం బాగుపడాలి. అభిమానం ఉంటేనే చాలదు ఓటు రూపంలో చూపించాలి. 175 కి 175 సీట్లు, 25కి 25 సీట్లు రావాలని జగన్ అంటున్నారు. కాని అవ్వన్ని వచ్చేది కూటమికే. వై నాట్ పులివెందుల అని అడుగుతున్నాం. పులివెందల్లో ఓ మొఖం పెట్టుకొని జగన్ ఓటు అడుగుతాడు. జగన్ రుషికొండ ను మింగేసిన ఆదర్శంగా తీసుకుంటే ఈ ప్రాంతం ఎమ్మెల్యే అప్పలనాయుడు నియోజకవర్గంలోని కొండలన్నింటని మింగేశాడు. పూసపాటి రేగి మండలంలో విచ్చల విడిగా కొండను దోచేశారు.

ఇండస్ట్రీయల్ హబ్ గా నెల్లిమర్ల
ఈ ప్రాంతపు సమస్యలన్నింటిని మేం పరిష్కరిస్తాం. మాధవికి ఓటు వేస్తే బంగార్రాజు సంగతి మేం చూసుకుంటాం. త్యాగాలు చేసిన నాయకులను గుర్తుంచుకుంటాం. టిడిపి, జనసేన, బీజేపీలో ఎవరికి సీట్లు రాని వాళ్లను ప్రభుత్వంలో భాగస్వామ్యులం చేస్తాం. నదుల అనుసంధానం చేసి పోలవరం పూర్తి చేసి ఉత్తరాంద్ర సుజల స్రవంతిని పూర్తి చేసే బాధ్యత మాది. తారక రామతీర్ధ సాగర్ ప్రాజెక్టును ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించాను, ఇప్పుడు మళ్లీ మేమే పూర్తి చేసే బాద్యత మాది. భోగాపురం ఎయిర్ పోర్టుతో పాటు రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ హబ్ గా నెల్లిమర్లను తీర్చిదిద్దుతాం. హుద్ హుద్ తుఫాను బాధితులకు న్యాయం చేస్తాం.

కూటమికి ఓటు జగన్ గుండెలకు గుచ్చుకోవాలి
యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. మొదటి సంతకం డిఎస్సీ మీదే పెడతాం. ప్రతి ఆడబిడ్డకు రూ.1,500 చొప్పున నెలకు ఇస్తాం. ప్రతి రైతుకు రూ.20వేలు ఏడాదికి ఇస్తాం. తల్లికి వందనం పేరుతో విద్యార్ధికి రూ.15వేలు ఇస్తాం. 3 ఉచిత గ్యాస్ సిలెండర్లు, డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు జీరో పర్మంట్ వడ్డీతో వడ్డీలేని రుణాలు ఇస్తాం. పెంచిన పింఛన్ రూ.4వేలు ఏప్రిల్ నుంచి ఇంటి వద్దే ఇస్తాం. ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం. ఎన్నికల రోజున పోలింగ్ బూత్ దద్దరిల్లాలి. ఒక బటన్ గాజు గ్లాస్, సైకిల్, కమలం పైకి వేయాలి. అది జగన్ గుండెలకు గుచ్చుకోవాలి. అప్పలనాయుడుకు ఓటు వేసి ఒక సామాన్య కార్యకర్తను ఢిల్లీకి పంపించాలి. హలో ఏపీ బై బై జగన్.

LEAVE A RESPONSE