ఏపీ శాసనసభకు రేపే షెడ్యూల్ విడుదల

రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించనున్న ఈసీ

లోక్ సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలకు రేపే నగారా మోగనుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. ఈ మేరకు ఈసీ ఆరోజు అధికారికంగా ప్రకటించింది. నాలుగు రాష్ట్రాల శాసన సభ ఎన్నికలు కూడా ఇదే సమయంలో జరుగుతాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు జరగనున్నాయి. లోక్ సభ పదవీకాలం జూన్ 16తో ముగుస్తోంది. ఈలోగానే కొత్త ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంటుంది. గత ఎన్నికల సమయంలో మార్చ్ 10న షెడ్యూల్ విడుదలయింది. ఏప్రిల్ 11 నుంచి ఏడు విడతల్లో పోలింగ్ జరిగింది. మే 23న ఓట్ల లెక్కింపు జరిగింది. మరోవైపు రేపు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో… రేపటి నుంచి దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.

 

Leave a Reply