Suryaa.co.in

Political News

అభివృద్ధి నినాదకర్త అప్పుడు.. ఇప్పుడూ చంద్రబాబునాయుడే!

బ్రిటిష్ పాలన తరువాత కొత్తగా ఉద్భవించిన భారత దేశం, జాతి కుల , మత,ప్రాంత, సంసృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, ఇలా ఎన్నెన్నో భావాలు, భావోద్వేగాలు,కలగలిపి ర0గరించి, ఈ దేశానికి ఒక నిర్ధిష్టమైన రాజ్యంగ0 ఏర్పరచుకోగలిగింది. అప్పటి రాజకీయ మేధావుల్లో ఉత్పన్నమైన ప్రశ్న.. బ్రిటిష్ ప్రభుత్వం ఈ దేశంలో నిర్మించిన అనేక ప్రాజెక్టులు, వివిధ ప్రాంతాల్లో నిర్మితమైన నిర్మాణాలు లో సాంకేతిక పరిజ్ఞానం తక్కువ. కానీ రాబోయే కొన్ని దశాబ్దాల అవసరాల ముందుచూపు వారి నిర్మాణాల్లో ప్రస్ఫుష్టం గా కనిపించింది. “డిస్కవరీ ఆఫ్ ఇండియా” పుస్తకం లో, ఇంత పెద్ద కొత్త దేశంలో ఇన్ని వ్యవహారాల్ని బ్రిటిష్ పాలకుల కంటే మెరుగ్గా చేయాలి అంటే, అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం కొంత. అయితే పరిపాలకులు కార్యదీక్ష ముందు చూపు కాలానుగుణంగా మార్పులు చాలా అవసరం అని తెలపటం జరిగింది.

దేశాన్ని పాలించే ప్రభుత్వాలు, పాలకులు మారుతున్న ప్రతి తరుణం లో విజన్ ఇండియా అనేది లోపిస్తోంది అని, మొదటగా వెలిబుచ్చిన మేధావి పి.వి.నరసింహ రావు గారు. అభివృద్ధిలో అగ్ర రాజ్యాల తో పోటీ పడాలి అంటే రిఫార్మ్స్(సరళీకరణ) ఈ దేశానికి , సగటు భారతీయుడి జీవన విధానానికి ఎంతో అవసరం అని అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ గారితో చర్చించినట్లు వారి పుస్తకం లో వ్రాయటం చూశాం.

క్రమేణా ప్రభుత్వాలు, పాలకు లు మారుతున్న క్రమంలో.. దేశ ప్రజల భవిష్యత్తు, రాష్ట్రాల అభివృద్ది కంటే.. వ్యక్తి గత కాంక్షలు, పట్టింపులు పెరుగుతూ వచ్చాయి. మచ్చుకు జయలలిత గారు పట్టింపు కోసం నెలలో కేంద్ర ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించండం. అప్పట్లోనే అస్సాం నుంచి ఆంధ్ర ప్రదేశ్ వరకు ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం. కేంద్రానికి, రాష్ట్రాలకు అభిప్రాయ భేదాలు దరిమిలా పాలకుల (ప్రాంతీయ,జాతీయ) దృక్పథంలో ” విజన్” అన్నది లోపించిన మాట వాస్తవమే అయినా, వాజపాయి గారి “ఇండియా షైనింగ్” తో కొంత వరకు సరళీకరణ ద్వారా క్రొత్త పుంతలు తొక్కింది.

దేవేగౌడ గారిని ప్రధానమంత్రి గా చేయాలి అనుకున్నప్పుడు.. దేశం, రాష్ట్రాల అభివృద్ధి, కొత్త నగరాల సృష్టి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు, పి.వి.నరసింహారావు గారు అప్పటి ప్రణాళిక మండలి చైర్మన్ అహ్లువాలియా, మన్మోహన్ సింగ్ గారు, చంద్రబాబు నాయుడు గారినీ, N.T. రామారావు గారితో కలిపి కమిటీలో నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ప్రస్తావించ వలసిన విషయం ఆ కమిటీ(ఫ్రంట్) లో మిగతా ముఖ్యమంత్రులు ఉన్నా , చంద్రబాబు గారి విజన్ ప్రెసెంట్ చేసిన విధానం, అప్పట్లో జాతీయ మీడియాలో కూడా ప్రముఖంగా రావటం జరిగింది, ఒక దశలో చంద్రబాబు ప్రధానమంత్రి అయితే బావుణ్ణు అని కూడా పుకార్లు షికార్లు చేశాయి. ఇది అభివృద్ధి, మానవ వనరుల సంపదే గాక.. రాష్ట్ర సంపదను సృష్టించడం, అభివృద్ది చెందిన పట్టణాలు ముంబై,చెన్నై,బెంగళూర్ మించి చేయాలని తపన కారణంగానే వారిని, ఆ రోజు ఒక దేశ ప్రధాన మంత్రి ఎంపికలో ప్రముఖ భాగస్వామిని చేయడం జరిగింది.

ఐటీ రంగంలో అప్పట్లో అగ్ర స్థానం లో ఉన్న బెంగళూరు, ఒకానొక సందర్భంలో అప్పటి అక్కడి ముఖ్య మంత్రి ఎస్. ఎం.కృష్ణ గారు స్వయంగా వ్యాఖ్యానించిన మాటలు చంద్రబాబు వలన కొత్త ఐటీ కంపెనీలు, బెంగళూర్ లో ఉన్న పెద్ద కంపెనీలు సైతం హైదరాబాద్ వైపు చూస్తున్నాయి గనుక జాగ్రత్త పడాలి అని సహచరుల తో చెప్పటం, పత్రికలలో కూడా రావటం చూస్తే చంద్రబాబు గారి అంకిత భావం, పట్టుదల అభివృద్ధే అజెండా , తనకు తాను టార్గెట్లు ఫిక్స్ చేసుకొని, విజన్ 20, 30, పెట్టుకోవటం చూస్తే , వారి కార్యదీక్ష ఏ పాటి దో దేశమంతా చూసింది.

1999-2004 మధ్యలో అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కోసం, ఐటీ అభివృద్ధి కోసం , విదేశాల్లో నిరుద్యోగి లాగా ఫైళ్లు పట్టుకుని ఐటీ కంపెనీల చుట్టి తిరిగి ఒక్క కంపెనీ లేని హైదరాబాద్ కు ప్రముఖ ఐటీ కంపెనీ లన్నిటిని తీసుకరావటం లో కృతకృత్యులయ్యారు, హైదరాబాద్ ను ఒక మహా నగరంగా తను అనుకున్నట్లుగా రూపకల్పన చేయకలిగాడు అంటే, అది అభివృద్ధి పట్ల అయనుకున్న కసి. ఏ విజన్ ఉన్న నాయకులు దేశానికి అవసరం అని ఆరోజు జవహర్లాల్ నెహ్రూ అశించారో, అలాంటి లక్షణాలని పుణికి పుచ్చుకున్న ఒక నాయకుడు చంద్రబాబు గారు. ఇది సాక్షాత్తు అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ గారు హైదరాబాద్ వచ్చి చేసిన వ్యాఖ్య.. మైక్రోసాఫ్ట్ చైర్మన్ హైదరాబాద్ భారతదేశం లోనే, అత్యుత్తమ ఐటీ డెస్టినేషన్ అని చేసిన ప్రశంస , కొంతమంది ముఖ్య మంత్రులకు అసూయ కలిగించేంతగా జరిగింది.

ఇక విడబడ్డ చిన్న రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి గా చంద్రబాబు గారు పగ్గాలు చేపట్టినప్పుడు.. లోటు బడ్జెట్, ఆదాయ వనరులు బాగా తక్కువగా ( హైదరాబాద్ తో పోలిస్తే) ఉన్న ప్రాంతం. మరేమో చంద్రబాబు గారు మళ్లీ టార్గెట్ ఫిక్స్ చేసుకొని తన విజన్ ప్రపంచానికి చాటి, ప్రముఖ విద్యా సంస్థలే గాక, అన్ని బ్యాంకుల ప్రాంతీయ కార్యాలయాలు, కార్పొరేట్ వివాదాల కోర్టు (NCLT) సింగపూర్ భాగస్వామ్యంతో నగరాభివృద్ధి, దేశంలో.మొదటి సారిగా ప్రభుత్వ సారథ్యం లో గృహ సముదాయానికి నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ లో లిస్ట్ చేస్తే అపూర్వ స్పందన. ఇది కేవలం చంద్రబాబు పైన ఉన్న దేశ ప్రజలకి ఉన్న నమ్మకం.ఈరోపియన్ కంట్రీస్ లో వ్యాపార దిగ్గజం ,” లుల్లు” దేశం లో ఎక్కడ ఔట్లేట్ లేకున్నా ఆంధ్రప్రదేశ్ కు తీసుకు రాగలిగిన ఘనత చంద్రాబుదే, కొన్ని ఏళ్ళకి గానీ హైదరాబాద్ కు రాని emrates నీ, కొత్త రాష్ట్రానికి తీసుకు రావటానికి ఎంత వ్యయ ప్రయసాలు చేకూరిస్తేగానీ రాదో దేశమంతా తెలుసు.

ఇంత నేపథ్యం, పరిణితి, అభివృద్ది అనే ఒకే నినాదం. ముందు తరాలకు కావాల్సిన ,జరగాల్సిన అవసరాలూ , ఇన్ని నెత్తికి ఎత్తుకుంటున్న ఒకే ఒక వ్యక్తి, శక్తి ఎప్పుడూ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే.

ఓ.వి.రమణ
టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు

LEAVE A RESPONSE