స్పీకర్ వెన్నెముక లేకుండా వ్యవహరిస్తున్నారు

• పిరికి సన్నాసి ముఖ్యమంత్రిని, ప్రజలకు భయపడే ముఖ్యమంత్రిని ఇప్పుడే చూస్తున్నాం
• ఎన్నుకున్న ప్రజలకు సమాధానం చెప్పలేకే, పల్లెల్ని అభివృద్ధి చేయలేకపోతున్నామన్న బాధతోనే అధికార పార్టీ సర్పంచ్ లు కూడా ముఖ్యమంత్రికి ఎదురు తిరిగారు
• అరెస్ట్ చేసిన సర్పంచ్ లు ప్రభుత్వం వెంటనే విడుదల చేయించి, వారికి బహిరంగ క్షమాపణలు చెప్పాలి
• ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసరాల ధరలపై సభలో చర్చ చేపడితే తన బాగోతం బయటపడుతుందన్న భయంతోనే ముఖ్యమంత్రి టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేయించాడు.
• స్పీకర్ వెన్నెముక లేకుండా వ్యవహరిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా ముఖ్యమంత్రి చెప్పిందే తనకు వేదం అన్నట్టుగా సభను నడుపుతున్నాడు
• ప్రజల కోసం గొంతెత్తిన టీడీపీ సభ్యుల్ని అన్యాయంగా సస్పెండ్ చేసిన ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ప్రజలు రాష్ట్రం నుంచే సస్పెండ్ చేసే రోజు దగ్గర్లోనే ఉంది
– శాసనసభ నుంచి సస్పెండ్ అయిన అనంతరం మీడియాతో మాట్లాడిన తెలుగుదేశం శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు

ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్ లు..ఎంపీటీసీలు.. జడ్పీటీసీలను ఉత్సవ విగ్రహాలుగా మార్చిన జగన్ రెడ్డి: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
“ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పెరిగిన నిత్యావసరాల ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు, పెంచిన ఆర్టీసీ.. విద్యుత్ ఛార్జీలు,ప్రభుత్వం వేస్తున్న వివి ధ రకాల పన్నులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరోపక్క ఈ ముఖ్యమంత్రి స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేసి, సర్పంచ్ లు.. ఎంపీటీసీలు..జడ్పీటీసీలను ఉత్స వ విగ్రహాలుగా మార్చాడు. 14 మరియు 15వ ఆర్థిక సంఘం స్థానిక సంస్థల అభివృద్ధికి కేటాయించిన నిధుల్ని కూడా ఈ ప్రభుత్వం దుర్వినియోగం చేసింది.

మూర్ఖత్వం, మొండితనంతో జగన్ రెడ్డి కేంద్రప్రభుత్వ చట్టాలను కూడా తుంగలో తొక్కి స్థానిక సంస్థలకు దక్కాల్సిన వేలకోట్లను రాష్ట్రఖజానాకు మళ్లించాడు
కేంద్రం చేసిన చట్టం ప్రకారం ప్రభుత్వం ఇచ్చే నిధులు పంచాయతీలకు వెళ్లాలి. కానీ జగన్ రెడ్డి తన మూర్ఖత్వం, మొండితనంతో కేంద్ర ప్రభుత్వ చట్టాలు కూడా తుంగలో తొక్కి స్థానిక సంస్థలకు దక్కాల్సిన వేలకోట్లను రాష్ట్రప్రభుత్వ ఖజానాకు జమ చేయించాడు. అమృత్, జల్ జీవన్ మిషన్ కు కేటాయించిన నిధులు ఏమ య్యాయో కూడా తెలియదు. కేంద్రప్రభుత్వం మంజూరుచేసిన నిధులకు ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ నిధులు కూడా రాష్ట్రప్రభుత్వం ఇవ్వలేదు. ప్రజలతో ఎన్నుకోబడి చివరకు పంచాయతీలకు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ప్రజలకు సమాధానం చెప్పుకోలేక సర్పంచ్ లు ప్రభుత్వంపై ఎదురుతిరిగారు.

స్థానిక సంస్థలకు ఎన్నికైన వారిలో 90శాతం వైసీపీకి చెందినవారే. అయినా కూడా జగన్ రెడ్డి వారికి నిధులు ఇవ్వకుండా వాలంటీర్లతో పెత్తనం చేయిస్తూ, పంచాయతీల్లో ఎలాంటి అభివృద్ధికి ఆస్కారం లేకుండా చేశాడు. ఆఖరికి బ్లీచింగ్ చల్లడానికి కూడా నిధులు లేక సర్పంచ్ లు ఏమిటి మాకీ ఖర్మ అనుకునే పరిస్థి తి తీసుకొచ్చాడు.

ప్రజలచే ఎన్నుకోబడిన తమకు న్యాయం చేయమని కోరిన సర్పంచ్ లపై పోలీసులతో లాఠీఛార్జ్ చేయించడం అమానుషం..అన్యాయం
తమకు న్యాయం చేయమని సర్పంచ్ లు ఆందోళనకు దిగితే వారిపై పోలీసులతో లాఠీ ఛార్జ్ చేయించి పోలీస్ స్టేషన్లకు తరలించడం అమానుషం, అన్యాయం. ప్రజ లకు సేవచేయడానికి నియమించిన బడిన వాలంటీర్ వ్యవస్థను జగన్ రెడ్డి, తన పార్టీ అనుబంధ విభాగంగా మార్చాడు. వైసీపీ సభలకు జనం రాకపోతే వాలంటీర్ల తో బెదిరించి తీసుకొస్తున్నారు. వాలంటీర్లతో పాటు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బందిని కూడా ముఖ్యమంత్రి ప్రజల్ని తరలించడానికే వినియోగిస్తున్నాడు. రాష్ట్ర పంచాయతీ రాజ్ సంఘం, మున్సిపల్ సంఘాలు నెలల నుంచీ ప్రభుత్వాని కి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాయి. సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల సమస్యలతో పాటు, ప్రజలు ఎదుర్కొంటున్న అతి ప్రధానమైన ధరల పెరుగుదల సమస్యలపై మాట్లాడకుండా మమ్మల్ని సభలో అడ్డుకుంటారా?

తన పాలనలో జగన్మోహన్ రెడ్డి ఉభయసభల్లో ఎన్నిసార్లు, ఎంత సమయం టీడీపీ సభ్యులకు మాట్లాడే అవకాశమిచ్చాడో చెప్పాలి
జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతిపక్ష టీడీపీ సభ్యులకు ఎన్నిసార్లు సభలో మాట్లా డే అవకాశమిచ్చారు..ఎంత సమయం ఇచ్చారో ప్రభుత్వం చెప్పాలి. అసెంబ్లీలో మాట్లాడకుండా ఎన్నాళ్లు మా గొంతులు నొక్కేస్తారు? 4 సంవత్సరాల 10 నెలల పాలనలో ఎన్నినిమిషాలు టీడీపీ సభ్యులకు అవకాశమిచ్చారో ముఖ్యమంత్రి చెప్పాలి. శాసనసభ స్పీకర్ వెన్నెముక లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడు చుకుంటూ ముఖ్యమంత్రి చెప్పిందే తనకు వేదం అన్నట్టు ప్రవర్తిస్తున్నాడు. రాజ్యాంగం ప్రకారం ప్రతిపక్షాలకు కొన్ని హక్కులుంటాయి. వాటిని కూడా అణచివేస్తారా?

అసెంబ్లీ ప్రాంగణంలో ఇన్నివేల మంది పోలీసుల్ని ఎప్పుడైనా చూశామా? ముఖ్యమంత్రి నివాసముండే తాడేపల్లి ప్యాలెస్ నుంచి అసెంబ్లీ వరకు కనీసం 4వేల మంది పోలీసులున్నారు. ఇంత పిరికి సన్నాసి ముఖ్యమంత్రిని, ప్రజలకు భయపడే ముఖ్యమంత్రిని ఇప్పుడే చూస్తున్నాం. ప్రజలకు అంత బ్రహ్మండంగా సేవలు అందించి, గొప్ప పాలన అందిస్తే ఇన్నివేల మంది పోలీసు ల్ని జగన్ రెడ్డి ఎందుకు కాపలా పెట్టుకుంటున్నాడు? తన సభలు, సమావేశాల కు కూడా ప్రజలు రావడంలేదని గ్రహించే జగన్ రెడ్డి అధికారయంత్రాంగాన్ని భయపెట్టి, ప్రజల్ని బలవంతంగా రప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆఖరికి డబ్బులిచ్చినా, బిర్యానీలు పెట్టి, మద్యం పంచినా ముఖ్యమంత్రి సభలకు జనం రావడంలేదు.

మొన్న జరిగిన ఒకసభకు 5 జిల్లాల నుంచి జనాన్ని తరలించారు. కానీ జగన్ ప్రసంగం మొదలయ్యే సమయానికి అక్కడ పట్టుమని 20వేల మంది కూడా లేరు. ప్రజల్లో జగన్ పై ఎంత వ్యతిరేకత ఉందో ఇక్కడే అర్థమవుతోంది. జగన్ రెడ్డి తన రాజకీయ పబ్బంకోసమే ఉత్తుత్తి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, నిధులు.. విధులులేకుండా తనకు భజన చేసేవారిని చైర్మన్లుగా నియమించాడు.

అరెస్ట్ చేసిన సర్పంచ్ లను ప్రభుత్వం వెంటనే విడుదల చేసి, వారికి బహిరంగ క్షమాపణలు చెప్పాలి దుర్మార్గపు ముఖ్యమంత్రి రాక్షస పాలన అంతం అయితేనే స్థానిక సంస్థలకు మరలా మంచిరోజులు
రాష్ట్రాన్ని పోలీస్ రాజ్యంగా మార్చి, నియంత్రత్వ పోకడలు పోతున్న ఈ ముఖ్య మంత్రికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది. పవిత్రమైన చట్టసభల్ని నిర్వీ ర్యం చేసి, ప్రజాప్రతినిధులకు గౌరవం లేకుండా చేశాడు. అరెస్ట్ చేసిన సర్పంచ్ లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయించి, వారికి బహిరంగ క్షమాపణలు చెప్పాలి. వారికి కేటాయించాల్సిన నిధులు కేటాయించి, గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి సహకరించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్ లకు ప్రభుత్వమే తగిన రక్షణ కల్పించాలి.

ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థతో సర్పంచ్ లు, ఎంపీటీసీలు ఎందుకూ పనికిరాని వారిగా మారిపోయారు. స్థానిక సంస్థల్లో ఖాళీ అయిన స్థానాల్లో ముఖ్యమంత్రి ఎందుకు ఎన్నికలు నిర్వహించడు? ఓటమి భయంతోనే ఎన్నికల గురించి ఆలోచించడం లేదు. ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి రాక్షస పాలన అంతం అయితేనే స్థానిక సంస్థ లకు మరలా మంచిరోజులు వస్తాయి. సహకార రంగాన్ని కూడా సర్వనాశనం చేసిన ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రిలో నిలిచిపోతాడు.

సర్పంచ్ ల పోరాటానికి టీడీపీ మద్ధతు ఉంటుంది
సభ నుంచి మమ్మల్ని సస్పెండ్ చేసినంత మాత్రాన ప్రజలకోసం పోరాడుతున్న మా గొంతు నొక్కలేరని ముఖ్యమంత్రి తెలుసుకోవాలి. ప్రజల మధ్యకు వెళ్లి, ప్రజా పోరాటంతోనే వైసీపీ ప్రభుత్వానికి బుద్ధిచెబుతాం. సర్పంచ్ ల పోరాటానికి టీడీపీ పూర్తి మద్ధతు ఇస్తుంది. అలానే ఆశావర్కర్లు, అంగన్ వాడీ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు న్యాయం జరిగేవరకు వారికి మా మద్ధతు ఉంటుం ది.” అని బుచ్చయ్య చౌదరి తెలిపారు.

జగన్ రెడ్డి ధరల పెంచడంతో ఒక్కో పేద కుటుంబంపై సంవత్సరానికి రూ.60వేల భారం పడింది: నిమ్మల రామానాయుడు
“ ఆకాశాన్ని అంటిన నిత్యావసర ధరలు, పెరిగిన పన్నులు, ప్రభుత్వం పెంచిన వివిధ రకాల ఛార్జీలపై చర్చచేపట్టాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ తరుపున ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. మహిళలు, పేదల పక్షాన టీడీపీ సభ్యులు మాట్లాడకూడదు అన్న దురుద్దేశంతోనే మమ్మల్ని సభ నుంచి సస్పెండ్ చేశారు. ఏం కొనేట్టు లేదు.. తినేట్టు లేదు అనే సినిమా పాట ప్రస్తుతం పేదల బతుకులకు సరిగ్గా సరిపోతుంది.

ధరల మోత – పన్నుల వాత ఇదే జగన్ రెడ్డి మార్క్ పాలన
టీడీపీప్రభుత్వంలో లీటర్ పెట్రోల్ రూ.72లు ఉంటే, ఇప్పుడు రూ.112లు అయ్యింది. లీటర్ డీజిల్ అప్పుడు రూ.69లు ఉంటే, ఇప్పుడు రూ.99కి పెరిగింది. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచింది కేంద్రప్రభుత్వమని జగన్ సర్కార్ తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రప్రభుత్వ వాటాగా ఉన్న ట్యాక్స్ లను 32 శాతం నుంచి 35శాతానికి పెంచింది జగన్ రెడ్డే. రాష్ట్రంలో పెంచిన పన్నుల వల్లే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే లీటర్ పై రూ.8 నుంచి రూ.10లు అదనపు భారం ప్రజలపై పడింది. టీడీపీప్రభుత్వంలో కేజీ బియ్యం రూ.40లు ఉంటే, ఇప్పు డు రూ.55 ఉంది.

కందిపప్పు గతంలో రూ.80లు ఉంటే, ఇప్పుడు రూ.120కి పెరిగింది. కేజీ చింతపండు టీడీపీప్రభుత్వంలో రూ.120లు అమ్మితే, ఇప్పుడు రూ.240లకు పెరిగింది. ఇలా పంచదార, వంటనూనె, ఇతర పప్పుల ధరలు పె రిగాయి. చంద్రబాబు హయాంలో గ్యాస్ సిలిండర్ ధర రూ.600లు ఉంటే, ఇప్పుడు రూ.1200లకు ఎగబాకింది. పెరిగిన గ్యాస్ ధరలతో మహిళలు మరలా కట్టెలపొయ్యిలను నమ్ముకుంటున్నారు. కరెంట్ బిల్లుల్ని జగన్ రెడ్డి 9సార్లు పెంచాడు. గతంలో రూ.200లు వచ్చే కరెంట్ బిల్లు ఇప్పుడు తక్కువలో తక్కువగా రూ.1000లు వస్తోంది. మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి మహిళలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి, కల్తీ మద్యం అధిక ధరకు అమ్ముతూ పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు.

క్వార్టర్ నాసిరకం మద్యాన్ని రూ.200లకు అమ్మిస్తున్నాడు. ఇవన్నీ చాలవన్నట్టు ఆస్తిపన్ను, నీటిపన్ను, మరుగుదొడ్లపై పన్ను అంటూ ఆఖరికి చెత్తపై కూడా పన్నులు వేసిన ఈ ప్రభుత్వం చెత్త ప్రభుత్వంగా పేరు పొందింది. రేషన్ దుకాణాల్లో బియ్యం తప్ప మరేమీ పేదలకు ఇవ్వడంలేదు. కొన్ని చోట్ల ఆ బియ్యం కూడా సరిగా ఇవ్వడం లేదు. గతంలో చంద్రబాబు హాయాంలో బియ్యంతో పాటు, కంది పప్పు, పంచదార, నూనె ప్యాకెట్, చింతపండు, బెల్లం వంటి 6 రకాల సరుకుల్ని సగం ధరకు అందించడం జరిగింది. 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలనలో నలుగురు సభ్యులున్న కుటుంబం కేవలం నిత్యావసరాలకే నెలకు రూ.7నుంచి రూ.8వేలు ఖర్చు చేయాల్సిన దుస్థితి దాపురించింది.

అదే కుటుంబం టీడీపీప్రభుత్వంలో నిత్యావస రాలకు రూ.2వేలు మాత్రమే వెచ్చించింది. రూ.5వేలు నిత్యావసరాలకే అదనంగా ఖర్చు చేయడం అంటే సంవత్సరానికి రూ.60వేల కష్టార్జితాన్ని ఒక్కో కుటుంబం కోల్పోతోంది. ఇంత ముఖ్యమైన అంశంపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబడితే, వాస్తవాలు ప్రజలకు తెలియకూడదన్న దురుద్దేశంతో, కుట్రతోనే చర్చ చేపట్టకుండా మమ్మల్ని అన్యాయంగా సస్పెండ్ చేశారు. ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో ప్రజలు శాశ్వతంగా రాష్ట్రం నుంచి సస్పెండ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.” అని రామానాయుడు తేల్చిచెప్పారు.

Leave a Reply