-రాష్ట్రాభివృద్ది, సంక్షేమం చంద్రబాబు నాయుడుతోనే సాధ్యం
– సినీ నటుడు నారా రోహిత్
వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అన్ని విధాల నాశనమైందని సినీ నటుడు నారా రోహిత్ అన్నారు. మంగళవారం నాడు బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లి మండలం బలుసుల పాలెం, మెట్ట గౌడ పాలెం, నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం జలదంకిలో ఎన్డీయే కూటమికి మద్దతుగా నారా రోహిత్ ప్రచారం నిర్వహించారు.
ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ…. జగన్ అసమర్ద పాలనతో ఈ రాష్ట్రం చీకట్లోకి వెళ్లిపోయింది. 2019లో మనం తప్పు చేసి ఒక రాక్షసుడిని సీఎంగా ఎన్నుకున్నాం. ఆ రాక్షసుడి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు తెలుగుదేశం-జనసేన-బీజేపీ మూడు పార్టీలు ముందుకొచ్చాయి. నాడు రావణాసురుడిని చంపడానికి లక్ష్మణుడు, హనుమంతుడు, వానర సైన్యం కలిసినట్లు నేడు వైసీపీ రాక్షష పాలనను అంతం చేయడానికి మూడు పార్టీలు కలిశాయి.
మే 13వ తేదీన ఓటు ద్వారా ఆ రాక్షసుడిని అంతమెందిద్దాం. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. పోలింగ్ రోజు ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. సమర్దవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలి. రేపల్లె ప్రజల కష్ట, నష్టాల్లో తోడుండే నాయకుడు అనగాని సత్యప్రసాద్ ని మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించండి.