Suryaa.co.in

Andhra Pradesh

జగన్ తన ఓటమిని తాను ముందుగానే అంగీకరించినట్టుగా ఉంది

-వైసీపీకి తొత్తుల్లా పనిచేస్తున్న సీఐలు, ఎస్సైలను వెంటనే బదిలీ చేయాలి
-ఈసీకి వర్ల ఫిర్యాదు

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, పలువురు టీడీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాను వెలగపూడి సచివాలయంలో ఆయన కార్యాలయంలో కలిసి పలు అంశాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం వర్ల రామయ్య మాట్లాడుతూ….రేపు ప్రధాన మంత్రి పర్యటన విధుల్లో ఉన్న అధికారులకు మరొక రోజు పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసే అవకాశం కల్పించాలి సీఈవోను కోరాం. ఈ నెల 9 తేదీ ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పారు

వేమూరు నియోజవర్గంలో గతంలో టీడీపీ యువనేత బాలకోటిరెడ్డిపై అక్రమ కేసులు పెట్టి పోలీసు కస్టడీలో వేధించిన వేమూరు సీఐ, నలుగురు ఎస్సైలపై కోర్టు ఆదేశాలతో కేసు నమోదైంది, ఆ కేసు దర్యాప్తులో ఉంది. ఇక్కడ టీడీపీ ఎలా గెలుస్తుందో చూస్తామంటూ ఆ పోలీసు అధికారులు అంటున్నారు. వారిని అక్కడ నుంచి వెంటనే బదిలీ చేయాలని కోరాం. దీనిపై సీఈవో సానుకూలంగా స్పందించారు. మరో వైపు గురజాల డీఎస్సీ, మాచర్ల సీఐ, కారంపూడి ఎస్సై, సీఐ వీళ్లు అసమర్ద అధికారులు, వాళ్ల పై అధికారుల మాటలు సైతం లెక్క చేయకుండా స్ధానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ట్ణారెడ్డికి బానిసల్లా పనిచేస్తున్నారు. వీరిని బదిలీ చేయాలని కోరాం.

సజ్జల భార్గవ్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ మహిళా నేతల ఫోటోలు మార్పింగ్ చేసి వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీని వెనుక సీఎం జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ కుట్ర ఉంది. వీళ్లపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరాం. వైసీపీ సోషల్ మీడియా బాధ్యులు సజ్జల భార్గవ్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి.

రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా సాగుతాయో లేదో అన్న జగన్ మాటలు వైసీపీ ఓటమిని అంగీకరిస్తున్నాయి. జగన్ బీద పలుకులు చూసి వైసీపీ ఓడినట్టేనని ఆ పార్టీ నేతలకు అర్దమైంది. జగన్ ఎన్నికలకు ముందే తన ఓటమిని అంగీకరించాడు. అదే జరుగుతుందని తదాస్తు అని వర్ల రామయ్య అన్నారు. జగన్ కి చేతనైతే ప్రజాక్షేత్రంలో పోరాడాలి తప్ప దొడ్డి మార్గం, దొంగమార్గాలలో అధికారం కోసం ప్రయత్నాలు చేయెద్దని వర్ల రామయ్య హితవు పలికారు. ఈసీని కలిసిన వారిలో టీడీపీ నేతలు సయ్యధ్ రఫీ, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, బుచ్చిరాంప్రసాద్, బండారు వంశీ, కోడూరి అఖిల్ తదితరులున్నారు.

LEAVE A RESPONSE