Suryaa.co.in

Telangana

స‌ర్కార్ నిర్ల‌క్ష్యంతోనే విద్యార్ధిని బ‌లి

* క‌లుషిత ఆహారంతో రోజుకో చోట ఆస్పత్రి పాలవుతున్న విద్యార్థులు
* 11 నెలల్లో 42 మంది విద్యార్ధులు ప్రాణాలు కొల్పోయారు
* విద్యార్ధిని శైల‌జ మృతికి బాధ్య‌త వ‌హిస్తూ స‌ర్కార్ వారి కుటుంబానికి అండ‌గా నిలువాలి
* తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మ‌న్ మేడే రాజీవ్ సాగ‌ర్

హైదరాబాద్: ఎంతో భవిష్య‌త్ ఉన్న వాంకిడి గిరిజ‌న గుర‌కుల విద్యార్ధిని శైల‌జ కాంగ్రెస్ స‌ర్కార్ నిర్ల‌క్ష్యానికి బ‌లైంద‌ని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మ‌న్ మేడే రాజీవ్ సాగ‌ర్ మండిప‌డ్డారు. ఉన్న‌త చ‌దువులు చ‌దివి వారి కుటుంబానికి అండ‌గా నిల‌వాల్సిన విద్యార్ధిని ఈ విదంగా విగ‌త‌జీవి మార‌డం దుర‌దృష్ట‌మ‌న్నారు.

కావాల‌నే రేవంత్ రెడ్డి స‌ర్కార్ కొన్ని కార్పోరేట్ విద్యాసంస్థ‌ల‌కు కొమ్ము కాసేందుకు కేసీఆర్ స్థాపించిన గురుకులాల‌ను నిర్ల‌క్ష్యం చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. 25 రోజులుగా నిమ్స్ ఆస్ప‌త్రిలో వెంటిలేటర్ మీద విద్యార్ధిని అనుభవించిన నరకానికి ప్రభుత్వమే జవాబు చెప్పాల‌న్నారు.

రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం వ‌చ్చిన 11 నెల‌ల్లోనే 42 మంది విద్యార్ధులు ప్రాణాలు కొల్పోయార‌ని మండిప‌డ్డారు. నిత్యం రాష్ట్రంలో ఏదో ఒక మూల క‌లుషిత ఆహారంతో విద్యార్ధులు ఆస్ప‌త్రుల పాలు అవుతున్న ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయ‌ని విమ‌ర్శించారు.

వాంకిడి గురుకులంలో నాణ్యత లేని భోజనం పెట్టకుండా అస్వస్థతకు గురైన విద్యార్థులకు సకాలంలో మెరుగైన చికిత్స అందించకపోవడం వ‌ల్లే ఈఘోరం జ‌రిగింద‌న్నారు. గిరిజన విద్యార్థినీ మ‌ర‌ణానికి బాధ్య‌త వ‌హిస్తూ వారి కుటుంబానికి అండ‌గా నిలువాల‌ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE