రాజకీయాల నుండి చంద్రబాబు వైదొలిగే సమయం ఆసన్నమైంది

– మతిస్థిమితం కూడా పూర్తిగా కోల్పోయారు
– వైసీపీ గుడివాడ పట్టణ అధ్యక్షుడు గొర్ల
గుడివాడ, అక్టోబర్ 20: రాజకీయాల నుండి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పూర్తిగా వైదొలిగే సమయం ఆసన్నమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుడివాడ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను అన్నారు. బుధవారం గుడివాడ పట్టణం శరత్ థియేటర్లోని నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిత్యం ఎల్లో మీడియాలో వస్తున్న కథనాలను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, పూర్తి విజ్ఞతతో నడుచుకుంటున్నారని చెప్పారు. గత రెండున్నర ఏళ్ళ పాలనలో పేదప్రజల సంక్షేమానికి చేస్తున్న కృషిని దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్మోహనరెడ్డిని ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నారని చెప్పారు. ఈ పరిణామాలను తెలుగుదేశం పార్టీ జీర్ణించుకోలేక పోతోందని అన్నారు. సీఎం జగన్మోహనరెడ్డి పాలన ఇదే విధంగా కొనసాగిస్తే వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోతుందన్న అభిప్రాయంలో ఆ పార్టీ శ్రేణులు ఉ న్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో విధంగా అస్థిరపర్చాలనే కుట్రలకు పాల్పడుతున్నారన్నారు.
ప్రజల దృష్టిని మరల్చేందుకు కుట్రలకు తెరలేపారన్నారు. దీనిలో భాగంగానే టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభితో సీఎం జగన్మోహనరెడ్డిని దుర్భాషలాడించారన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం పెరిగిందంటూ పిల్లల తల్లిదండ్రుల్లో అభద్రతా భావాన్ని కలుగజేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఎటువంటి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహనరెడ్డి పాలనలో ఏవైనా చిన్నపాటి లోపాలుంటే ప్రతిపక్షాలు వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చని చెప్పారు. అలాకాకుండా ప్రతి విషయాన్నీ సీఎం జగన్మోహనరెడ్డికి ఆపాదించేలా మాట్లాడుతున్నారని చెప్పారు. మంత్రి కొడాలి నాని అన్నట్టుగా చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయారని అర్ధమవుతోందన్నారు. టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ గా ఉన్న పట్టాభితో కోట్ల మంది ప్రజలు అభిమానించే జగన్మోహనరెడ్డిని దుర్భాషలాడించడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. స్థాయి తెలుసుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడాలని సూచించారు.
ష్ట్రంలో వ్యవహరించినట్టుగా కేంద్ర ప్రభుత్వం విషయంలో కూడా ఎందుకు నోరు మెదపడం లేదో చెప్పాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అంటే చంద్రబాబుకు విపరీతమైన భయమని అన్నారు. జగన్మోహనరెడ్డి ప్రభుత్వంలో ఏది మాట్లాడినా కక్ష సాధింపు చర్యలు ఉండవనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పథకాల అమల్లో ఏవైనా తప్పు ఒప్పులు ఉంటే చెప్పవచ్చని, వెంటనే సరి చేసుకుంటామన్నారు . అలాగే డ్రగ్స్ మాఫియాకు సంబంధించి సమాచారం ఉన్నా పోలీసులు దృష్టికి తీసుకురావచ్చన్నారు. అలా కాకుండా ప్రతి అంశాన్ని ప్రభుత్వానికి ముడి పెట్టే ధోరణిలో వ్యవహరించడం సరికాదన్నారు. ఇకనైనా తెలుగుదేశం పార్టీ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, లేకుంటే రాష్ట్రంలో ఎక్కడా తిరగనిచ్చేది లేదని గొర్ల శ్రీను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మండలి హనుమంతరావు, గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి సంఘం చైర్మన్ ఎంవి నారాయణ రెడ్డి, మాజీ కౌన్సిలర్ మాదాసు వెంకట లక్ష్మి, నాయకులు తులిమిల్లి యేషయ్య, నైనవరపు శేషుబాబు, తోట రాజేష్, షేక్ బాజీ, మెండా చంద్రపాల్, మామిళ్ళ ఎలీషా, వెంపటి సైమన్ తదితరులు పాల్గొన్నారు.