అంబేద్కర్ ను అవమానించి విగ్రహాలు పెడతారా?

-విదేశీ విద్య పథకానికి తిరిగి అంబేద్కర్ పేరు పెడతాం
-ఉండవల్లి రచ్చబండ సభలో యువనేత నారా లోకేష్

తాడేపల్లి: రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కనబెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుచేస్తున్నారు, అంబేద్కర్ ను అవమానిస్తూ ఆయన పేరిట ఉన్న విదేశీ విద్య పథకం పేరును జగనన్న విదేశీవిద్యగా మార్చేశారు, అంబేద్కర్ ను అవమానించి విగ్రహాలు పెడితే సరిపోతుందా అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఉండవల్లి దళితవాడలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతూ… ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విదేశీవిద్య పథకానికి అంబేద్కర్ పేరుపెడతామని చెప్పారు. విధ్వంసంతో జగన్ రెడ్డి పాలన మొదలైంది. అధికారంలోకి వచ్చాక మంగళగిరికి పరిశ్రమలు తీసుకువచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. రాజధాని పనులు కొనసాగిస్తామని లోకేష్ పేర్కొన్నారు.

ఉండవల్లి వాసులు తమ సమస్యలను లోకేష్ దృష్టికి తెస్తూ… మా ప్రాంతంలో డ్రెయిన్లు నిర్మించాలి. ఇళ్లులేని వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. రోడ్లు, తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు. చదుకున్న పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మా ప్రాంతంలో తాగునీటి కోసం గ్రామస్తులు సొంత నిధులతో మోటారు ఏర్పాటుచేసుకుంటే అధికారులు వేధిస్తున్నారని వాపోయారు.

దీంతో మోటారు పెట్టాలని, ఎవరు అడ్డువస్తారో చూస్తానని లోకేష్ వారికి భరోసా ఇచ్చారు. ఉండవల్లి ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ నిర్మాణంతో పాటు ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందిస్తాం. ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించి పట్టాలు అందజేస్తామని యువనేత హామీ ఇచ్చారు.

Leave a Reply