Suryaa.co.in

Telangana

వరద పొటెత్తుతున్నా నీళ్లు తరలించాలన్న సోయి లేదు

– బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి
– మాజీ మంత్రి వి .శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్: వర్షాలు పడుతుంటే రిజర్వాయర్లను నింపుకోవాలని ఎవరైనా చూస్తారు. ముఖ్యంగా కరువు పీడిత జిల్లాలైన మహబూబ్ నగర్ ,నల్లగొండ ల్లో వచ్చిన వరదతో రిజర్వాయర్లు నింపే అనవాయితీ ఉండేది. ఇపుడు జూరాల కు వరద పొటెత్తుతున్నా నీళ్లు తరలించాలన్న సోయి ఈ ప్రభుత్వానికి లేదు.

నీళ్లు వృధాగా కిందికి పోతున్నాయి. ఆల్మట్టి ,తుంగభద్ర నుంచి నీళ్లు వస్తున్నా వాటిని వాడుకోవాలని ఈ ప్రభుత్వానికి లేదు. వస్తున్న నీటిని వాడుకోవడం పై కనీసం ఓ సమీక్ష కూడా చేయలేదు. జూరాల పై ఆధార పడ్డ నెట్టెం పాడు ,బీమా లకు నీళ్లు తరలించడం లేదు. ఈ సారి ముందు వర్షాలు పడ్డా నీళ్లు సద్వినియోగం చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు.

నీళ్లు నదిలోకి వదులుతున్నారు. యాసంగి లో నీళ్లు లేక రైతులు ఇబ్బంది పడ్డారు. ఈ వర్షా కాలం లో నీళ్ళుండి కూడా ప్రభుత్వం రైతులను సమస్యల పాలు చేస్తోంది. సంగం బండకు మరమ్మత్తులు చేయక నీళ్లు నింపుకోని పరిస్థితి దాపురించింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో పంపులు సిద్ధంగా ఉన్నా కాలువలు తవ్వక నీళ్లు వాడుకోని పరిస్థితి ఉంది. గ్రావిటీ ద్వారా జూరాల నీళ్లు వాడుకునే పరిస్థితి ఉన్నా ప్రభుత్వం స్పందించడం లేదు.

దేవుడు కరుణించినా పూజారి కరుణించే పరిస్థితి లేదు. జూరాల గత కాంగ్రెస్ ప్రభుత్వాల పుణ్యమాని పూడికతో నిండి పోయింది. సీఎం సొంత జిల్లా అయినప్పటికీ మహబూబ్ నగర్ కు ఈ దుస్థితి ఏమిటీ ? పాలమూరు రంగారెడ్డి ద్వారా ఆరునెలల్లో నీళ్లు ఇస్తామన్నారు . ఎన్నో ఆరునెలలు గడిచిపోయాయి. నీళ్లు ఎప్పుడిస్తారు ? మహబూబ్ నగర్ ను ఏం చేయదలుచుకున్నారు ?

అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారు. కేసీఆర్ హాయం లో పడ్డ ప్రతీ వాన చినుకును సద్వినియోగం చేసుకునేలా అధికారులను అప్రమత్తం చేసే పరిస్థితి ఉండేది. రిజర్వాయర్లు ఉన్న ప్రాంతం లో మంత్రులు అధికారులు పర్యటించాలి. సంగం బండ గేట్లకు వెంటనే మరమ్మత్తులు చేయాలి. భూత్పూర్ రిజర్వాయర్ గేట్ల కు కూడా తక్షణమే మరమ్మత్తులు చేయాలి.

ఉన్న రైతు వేదికలు ఉపయోగించుకోవాలి. రైతు భరోసా నిధులను రైతుల అకౌంట్లలో వేయడం వెంటనే పూర్తి చేయాలి. రైతులకు కేసీఆర్ హయం లో ఎన్నో ప్రయోజనాలు అందాయి. ఎన్నికల మేనిఫెస్టో లో కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చాలి. రైతుల కిచ్చిన హామీలు అమలు చేశాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి.

బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. వర్షాకాలం లో మున్ముందు వానలు ,వరదల పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు. వస్తున్న వరదతో రిజర్వాయర్లు నింపేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించుకోవాలి.
.భవిష్యత్ లో రిజర్వాయర్లు నింపక పోతే ప్రభుత్వానిదే భాద్యత .

LEAVE A RESPONSE