– కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ కు ఎలాంటి భద్రత తగ్గించలేదు
– ముఖ్యమంత్రి గా పనిచేసిన జగన్ రెడ్డికి ఎన్నికల కోడ్ ఉల్లంఘించకూడదని తెలీదా?
– రూ.7వేలు ఎమ్మార్పీ ఫిక్స్ చేసిన జగన్ రెడ్డికి మిర్చి రైతులను కలిసే అర్హత ఉందా?
-విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్
అమరావతి: జగన్ కు ఏం భద్రత తగ్గిందని వైఎస్సార్సీపీ నేతలు గవర్నర్ ను కలిశారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ కు ఎలాంటి భద్రత తగ్గించలేదని తెలిపారు. ముఖ్యమంత్రిగా పని చేసిన జగన్ మోహన్ రెడ్డికి ఎన్నికల కోడ్ ఉల్లంఘించకూడదనే విషయం కూడా తెలియదా అని మండిపడ్డారు.
ముఖ్యమంత్రిగా వ్యవస్థల్ని నాశనం చేసి ఎప్పుడూ లేనంత అధ్వానంగా పరిపాలన చేశారని వైసీపీ పాలనను విమర్శించారు. చంద్రబాబు ఇంటి గేటుకు తాళ్లు కట్టిన రోజులు, ఎమ్మెల్యేని దాడికి పంపిన రోజులు గుర్తుకు రాలేదా అని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ నిలదీశారు. 7 వేల రూపాయల ఎంఎస్పీ ఫిక్స్ చేసిన జగన్ కు మిర్చి రైతుల వద్దకు వెళ్లే అర్హత ఉందా అని మండిపడ్డారు.
ప్రజలు 11 సీట్లు ఇచ్చి సంవత్సరమైనా జగన్ బుద్ధి మారలేదు అన్నారు. ఇప్పటికైనా వైఖరి మార్చుకోకపోతే భవిష్యత్తులో 11 కూడా రావని అన్నారు. గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా అసత్యాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనుకోవటం మానుకోవాలని మంత్రి గొట్టిపాటి హితవు పలికారు.