Suryaa.co.in

Andhra Pradesh

ఏపీలో మైనారిటీల సంక్షేమానికి పిఎంజెవికె కింద రూ. 600 కోట్లు ఇవ్వండి

– కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కు మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ లేఖ
-రూ.1000 కోట్ల ప్రతిపాదనలో 60%కేంద్ర వాటా ఇవ్వాలని కోరిన మంత్రి

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో మైనారిటీల సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి, మైనారిటీ ప్రజల జీవన నాణ్యతను పెంపొందించడానికి ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం కింద(PMJVK) రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల ప్రతిపాదనలకు కేంద్రం వాటా కింద రూ. 600 కోట్లు ఇవ్వాలని కోరుతూ కేంద్ర మైనారిటీ మంత్రిత్వ శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కు రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గురువారం లేఖ రాశారు. కేంద్రమంత్రికి రాసిన లేఖలోని ముఖ్యమైన అంశాలను ప్రస్తావిస్తూ అమరావతిలో మంత్రి ఫరూక్ ఒక ప్రకటనను విడుదల చేశారు.

LEAVE A RESPONSE