Home » అవన్నీ చెత్త ఫైల్సేనట..

అవన్నీ చెత్త ఫైల్సేనట..

-హార్డ్ డిస్క్లు చెదారమేనా?
-ప్చ్ ఏది నిజం?
-ఏది అబద్ధం ?
( బహదూర్)

తాగుబోతు ఎప్పుడూ అబద్దలాటలో ఆడడు. అతడికి తెలిసింది ఒక్కటే. నిజం. ఒకవేళ నిజం చెప్పలేదంటే.. అతడి హావ భావం ఒప్పుకోదు. మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కీలక డాక్యుమెంట్లు దగ్ధం కేసు విచారణలో పోలీసులు పురోగతి పెంచినట్టే.

సాధారణంగా కాకరకాయ కథలు వింటారు. ఆ తరువాత దొండకాయ పచ్చడీ చేస్తారు. పోలీసుల అదుపులోని డ్రైవర్ నాగరాజు అసలు కథని బుధవారం రాత్రే చెప్పేశాడు. కాలుష్య నియంత్రణ మండలి మాజీ చైర్మన్ సమీర్ శర్మ ఆదేశాలతోనే రికార్డులను తగులబెట్టినట్టు నాగరాజు చెప్పేశాడు. ఓ ఫుల్ బాటిల్, బిర్యానీ ఆఫర్ తో .. ఇంకాస్త డిటైల్ కథ వినిపించటం ఖాయం.

సీఎంవో ముత్యాల రాజు, హెడ్ సాయి గంగాధర్, ఓఎస్ డీ రామారావు పేరు చెప్పాడు. ఇక పోలీసుల విచారణలో రామారావు తన కథ వినించారు. అబ్బే కాల్చేసిన పైళ్లన్నీ ,, చెత్త ఫైల్స్అని వివరించారు. కానీ పోలీసుల్ని ఎన్నో అనుమానాలు కుదురుగా కూర్చోనీయటం లేదు. ఆఫీస్ లో సెక్షన్ హెడ్ శ్రీనివాస్ ని, ఓఎస్డీ రామారావు కోసం ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

సరే అవన్నీ చెత్త ఫైల్సే.. అనుకుంటే..
ఓఎస్డీ రామారావు చెప్పినట్టు అవన్నీ చెత్త ఫైల్సే కావచ్చు. ఈ ఐదేళ్లు వీటిని ఎందుకు పేరబెట్టారు? ఓ రోజు చెత్తను మరో రోజు డస్ట్ బిన్ కు ఎందుకు తరలించలేదు? హార్డ్ డిస్క్ కూడా చెత్త డిస్కేనా? పని చేయని హార్డ్ డిస్క్ను ఎందుకు దాశారు? ఎర్రర్ ఉంటే.. ఎందుకు ఎర్రర్ వచ్చిందో? ఆ హార్డ్ డిస్క్ స్థానంలో కొత్తదాన్ని ఓ కంపెనీ నుంచి కొన్నారో తెలిపే ఎంబుక్ ఏమైంది? ఒక వేళ ఉన్నా .. ఎంబుక్ లో ఎందుకు నమోదు చేయలేదు? నిజంగా చెత్త డిస్కేనా? అయితే చెక్ చేస్తే తెలిసేదిగా? మరి ఎందుకు తగలబెట్టారు? ప్చ్ .. అర్థం కావటం లేదు గురూ. ఏది ఏమైనా… శవాలు నిజాలు చెబుతాయి. కాలిన ఫైళ్లే సాక్ష్యం చెబుతాయంటే .. అతిశయోక్తి కాదేమో?

Leave a Reply