Home » ఇది హిందూ వ్యతిరేక సర్కార్

ఇది హిందూ వ్యతిరేక సర్కార్

– గుంటూరులో బీజేపీ గర్జన
రాష్ట్ర ప్రభుత్వం హిందువుల పండుగలపై అనుసరిస్తున్న నిరంకుశ విధానాన్ని వ్యతిరేకిస్తూ గుంటూరు జిల్లా భారతీయ జనతాపార్టీ అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడం జరిగింది. ముందుగా హిందూ కాలేజీ కూడలి నుండి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్ వద్దకు చేరుకొని ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్ వివేక్ యాదవ్ని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ, మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి సాదినేని యామిని శర్మ మాట్లాడుతూ… ఆంధ్ర రాష్ట్రంలో హిందుత్వం అణగదొక్కి, వేరే మతం వ్యాప్తి చెందాలని వైసీపీ ప్రభుత్వానికి ఏదైనా రహస్య ఎజెండా ఉందా అని, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వినాయక చవితి పండగ ఎట్టిపరిస్థితుల్లోనూ చేసి తీరుతామని చెప్పారు. ఇతర మతాల ఉత్సవాలకు లేని అడ్డమైన అడ్డంకులు వినాయకచవితికి ఎందుకని, రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ వర్ధంతి ఎలా చేశారని వినాయక చవితి ఉత్సవాలను గట్టి బందోబస్తు ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తూ భక్తుల మనోభావాలను కించపరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం వినాయక చవితి పండగ పట్ల విధించిన ఆంక్షలను ఉపసంహరించు కోవాలని, లేని పక్షంలో రాష్ట్రంలో ఉన్న హిందువులు ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు.


రాష్ట్రంలో మతాలను రెచ్చగొడుతూ , ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వైకాపా పార్టీ మాత్రమే. హిందూ దేవుళ్లను రోడ్డుమీదకి తీసుకొచ్చారు. నేడు హిందువులు తమ పండగలు జరుపుకోవడానికి దేహీ అని రోడ్లమీదకి రావాల్సిన దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది. ప్రపంచం ఈరోజు భారతదేశ ఆచార వ్యవహారాలు, పండగలను కీర్తిస్తూ, వాటిని ఆచరిస్తుంటే, హిందువులు మెజారిటీ గా ఉన్న దేశంలోని ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం దేవుడి విగ్రహ తలలు విరగకొట్టడం, దేవాలయాలను కూల్చడం,అర్చకులకు జీతాలు ఇవ్వకపోవడం, హిందూ పండగలను జరుపుకోవద్దని ఆంక్షలు విధించడం చేస్తున్నారు. కుహనా లౌకికవాదులు, కమ్మీ ఖాంగ్రేస్ సానుభూతిపరులు కేవలం హిందూ పండగలమీదే కాలుష్యం, పర్యావరణం అంటూ సాకులు చెప్తారు. ఎన్నికలు నిర్వహించినప్పుడు, మందు షాపులు, వర్ధంతిలు జరిపినప్పుడు రాని కరోన కేవలం హిందూ పండగలకు మాత్రమే వస్తుందా అని ప్రశ్నించారు. హిందూ సమాజం తరపున బీజేపీ పోరాటం చేస్తుంది అని తెలిపారు.
బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బిట్రా వెంకట శివన్నారాయణ మాట్లాడుతూ, ఏపీలో జగన్ ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి ఇవ్వము అనటం, అతని నిరంకుశ వైఖరికి నిదర్శనమని.. స్వాతంత్రానికి ముందే ఇంగ్లీష్ వారి పరిపాలనలో ఆనాటి దేశ భక్త నాయకులు,ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు బాల గంగాధర తిలక్ గారు దేశంలోని ప్రతి వాడలోను గణేశుని ఉత్సవాలను దొరలను ఎదిరించి మరీ జరిపించి హిందుభక్తిని,హిందు ఐక్యతను చాటారు.ఇంగ్లీష్ పరిపాలనను మైమరిపిస్తోంది. ఈనాటి జగన్ ప్రభుత్వం ఇతని నిరంకుశ పాలనను హిందువులు సంఘటితంగా ఎదుర్కొని, వినాయకుని ఉత్సవాలకు అనుమతి ఇచ్చేదాకా పోరాటం కొనసాగించాలని,ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడకుండా హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు…
బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాగంటి సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ, కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా వినాయక మండపాలు పెట్టుకోవటానికి, అనుమతులు ఇవ్వమని అడిగే హక్కు మాకు లేదా అని ప్రశ్నిచారు. విజ్ఞనాయకుడికే విజ్ఞాలు కలిగిస్తున్న మీకు,త్వరలో ఆ వినాయకుడే యావత్ హిందూ సమాజం ద్వారా బుద్ధి చెబుతాడు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శివన్నారాయణ బిజెపి రాష్ట్రకార్యదర్శి మాగంటి సుధాకర్ యాదవ్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యడ్లపాటి స్వరూపరాణి,అమ్మిశెట్టి ఆంజనేయులు, రమాకుమారి, మహిళామోర్చా రాష్ట్ర కార్యదర్శులు యామిని శర్మ,పుట్టి లక్ష్మీసామ్రాజ్యం బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు రాచుమల్లు భాస్కర్ రావు,చరక కుమార్ గౌడ్,అప్పిశెట్టి రంగారావు,ఉపాధ్యక్షులు ఈమని మాధవరెడ్డి, కంతేటిబ్రహ్మయ్య, పాలపాటిరవికుమార్, ఈదర శ్రీనివాసరెడ్డి,వనమా నరేంద్ర,దారా అంబెడ్కర్,ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు అనుమోలు ఏడుకొండలు గౌడ్,ఎస్టిమోర్చా అధ్యక్షుడు ఉయ్యాల శ్యాంవరప్రసాద్, ఎస్సీమోర్చా అధ్యక్షుడు బుజ్జిబాబు,యువమోర్చా అధ్యక్షుడు మైలాహరికృష్ణ, మైనార్టీమోర్చా అధ్యక్షుడు షేక్ బాషా,గూడూరు రాంబాబు,నాగుల్ మీరా,నజీర్, రామచంద్రరావు,సురేష్ బాబు,హరీష్,సాయి, లక్ష్మణ్, రావూరి లక్ష్మీ కుమారి,ఏలూరి లక్ష్మి, కరుణశ్రీ,రేణుకాదేవి, నాగమల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply