– ఫార్మాసిటీ ఉన్నట్టా? లేనట్టా
– ఫార్మాసిటీ ఉంటే 14 వేల ఎకరాలు ఉండాలే
– లేదంటే రైతులకు భూములు తిరిగి ఇచ్చేయాలి
– కేటీఆర్
సిరిసిల్ల: ఫోర్త్ సిటీ పేరుతో తన సోదరులకు వేల కోట్లు లబ్ధి చేసే కుట్ర. ఫార్మాసిటీ వ్యవహారంలో ప్రభుత్వం పై కేటీఆర్ సంచలన ఆరోపణలు. ఫార్మాసిటీ ఉన్నట్టా? లేనట్టా స్పష్టం చేయండి. కోర్టులో మాత్రం ఫార్మాసిటీ కొనసాగుతుందంటూ న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తున్నారు.
ఫార్మాసిటీని రద్దు చేస్తే రైతుల భూమి వారికి అప్పగించాలి. ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి సహా మంత్రులు చాలా సందర్భాల్లో ప్రకటించారు. అదే నిజమైతే రైతుల నుంచి సేకరించిన భూమిని వారికి తిరిగి ఇచ్చేయాలి.
ఇదే ప్రభుత్వం ఒకవైపు ఫార్మాసిటీ రద్దు చేశామంటూనే…హైకోర్టులో మాత్రం ఫార్మాసిటీ రద్దు కాలేదని చెబుతోంది. ఫ్యూచర్ సిటీ, ఏఐ సీటీ, ఫోర్త్ సిటీ అంటున్నారు. దాని కోసం ఒక్క ఎకరం భూమినైనా సేకరించిరా?
ఒక్క ఎకరం సేకరించకుండా ఫార్మా సిటీ భూములను ఇతర అవసరాలకు ఎలా మళ్లిస్తారు? ఏ విధంగా హైకోర్టును, న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తారు. ఫార్మా సిటీ వెనకు వేల కోట్ల భూ కుంభకోణం ఉంది. అన్ని వివరాలను త్వరలోనే బయటపెడతాం.
నీ అన్నదమ్ములకు వేల కోట్ల రూపాయల లబ్ది చేసే కుట్ర చేస్తున్నావ్. ఫార్మా సిటీ ఉన్నట్టా? లేనట్టా? ఈ ప్రభుత్వం రేపు హైకోర్టులో స్పష్టం చేయాలి. 14 వేల ఎకరాలల్లో, 64 వేల కోట్ల పెట్టుబడులతో మేము ఫార్మాసిటీ ని ప్రతిపాదించాం.
అందుకోసం కండిషనల్ ల్యాండ్ అక్విజేషన్ ను చేశాం. ఆ భూములను ఇతర అవసరాలకు మళ్లించే అవకాశం లేదు. అలా భూములను ఇతర అవసరాల కోసం మళ్లించి వేల కోట్ల స్కాం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఫార్మాసిటీ ఉంటే 14 వేల ఎకరాలు ఉండాలే. లేదంటే రైతులకు భూములు తిరిగి ఇచ్చేయాలి .