Suryaa.co.in

Andhra Pradesh

సేవ చేయాలంటే మంచి మనసు కూడా ఉండాలి ఆర్కే!!

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

ప్రజాసేవ చేయాలంటే అధికారం ఒక్కటే సరిపోదు… పదిమందికి సాయపడాలన్న మనసు కూడా ఉండాలి. తాడేపల్లికి చెందిన ఈ దివ్యాంగ సోదరుడి పేరు కోడె కోటేశ్వరరావు. సొంతకాళ్లపై నిలబడి కుటుంబాన్ని పోషించుకుంటానంటే కొద్దినెలల క్రితం తోపుడుబండి ఇచ్చాను. ఇలాంటి వేలాదిమందికి గత అయిదేళ్లుగా నేను చేయూతనిచ్చా. మహిళల స్వయం ఉపాధి శిక్షణతోపాటు కుట్టుమిషన్లు ఇచ్చా. తాగునీటికి ఇబ్బంది పడుతున్నామంటే ట్యాంకర్లు ఏర్పాటుచేశా. 29సంక్షేమ పథకాలను అయిదేళ్లుగా సొంత నిధులతో అమలుచేస్తున్నా. పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే నేను చేసిన పనుల్లో పదోవంతైనా సాయం చేశారా? మీరు చేసింది ఏమిటంటే ముఖ్యమంత్రి ఇంటివద్ద ఇరుకుగా ఉందని పేదల ఇళ్లు కూల్చేశారు. ఇప్పటం, ఆత్మకూరులో రోడ్డు విస్తరణ పేరుతో బుల్డోజర్లను పంపి పేదల బతుకులను రోడ్డు పాల్జేశారు. సేవచేయడమంటే కోర్టుల్లో కేసులు వేసి అభివృద్ధిని అడ్డుకోవడం, పైసాపైసా కూడబెట్టి కట్టుకున్న పేదల గూళ్లు కూల్చివేయడం కాదు కరకట్ట కమలహాసన్!!

LEAVE A RESPONSE