Suryaa.co.in

Andhra Pradesh

త్వరలో విజయవాడ మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు

– పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో సుజన మిత్ర కార్యక్రమం ప్రారంభించిన మంత్రి నారాయణ
– సుజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో డివిజన్ కోఆర్డినేటర్ల నియామకం
– డివిజన్ కోఆర్డినేటర్లకు ఎలక్ట్రిక్ బైక్ లు పంపిణీ చేసిన మంత్రి నారాయణ

విజయవాడ: 2004 నుంచి సుజనా చౌదరి తో నాకు పరిచయం ఉంది. ఇద్దరం కలిసి అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేశాము. కేంద్ర మంత్రిగా పని చేసిన సుజనా కి అపారమైన అనుభవం ఉంది. సుజన మిత్ర కార్యక్రమం ప్రారంభిస్తున్నందుకు ఎమ్మెల్యే చౌదరి ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.

2014-19 మధ్య పురపాలక శాఖకు బడ్జెట్ ఉండేది. ఇప్పుడు మాత్రం గత ప్రభుత్వం తీసుకున్న లోన్ లు అప్పులు కట్టడానికి బడ్జెట్ సరిపోతుంది
2019 AIIB నుంచి 5380 కోట్లు నిధులు తీసుకొచ్చాం.కానీ గత ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్స్ ఇవ్వకపోవడం వల్ల ఆ నిధులు విడుదల నిలిచిపోయింది. గత ప్రభుత్వం నిధులు ఇచ్చి ఉంటే ప్రతి ఇంటికి మనిషికి 135 లీటర్ల నీరు అందేది. మళ్ళీ సీఎం చంద్రబాబు చొరవతో నిధులు తీసుకొస్తున్నాం. 8500 అమృత్ పథకానికి నిధులు ఇస్తే గత ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్ ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఆర్ధిక వ్యవస్థ ను నాశనం చేసింది.

ప్రజలు వివిధ పన్నుల ద్వారా కట్టిన 3 వేల కోట్ల నిధులు CFMS నుంచి ఇతర అవసరాలకు వాడేసారు. CFMS లో నిధులు ఉంచితే మున్సిపాలిటీలు తీవ్రంగా నష్టపోతాయనే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్ళాను. ఇకపై మున్సిపాలిటీల నిధులు ఆయా మున్సిపాలిటీలకు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నందుకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. త్వరలో విజయవాడ మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు తిరిగి ప్రారంభిస్తాం. సుజన మిత్ర కార్యక్రమానికి మా తరపున అధికారుల సహకారం ఖచ్చితంగా అందిస్తాము. విజయవాడ వెస్ట్ నియోజకవర్గం అభివృద్ధికి సుజనా చౌదరి , నేను కలిసి పనిచేస్తాము

LEAVE A RESPONSE