– అమెరికా-హైదరాబాద్ జట్ల పర్యటనపై చర్చలు
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావుతో అమెరికా క్రికెట్ సంఘం చైర్మన్ పి.వేణురెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సోమవారం మాదపూర్‌లోని జగన్‌మోహన్ రావు క్యాంప్ కార్యాలయంలో ఆయన్ని వేణురెడ్డి కలిశారు.
ఈ సందర్భంగా ఇరువురి మధ్య క్రికెట్ అభివృద్ధిపై విస్తృతమైన చర్చ జరిగింది. అమెరికా పురుషుల, మహిళల అండర్-19 టీమ్‌లతో పాటు జాతీయ జట్లతో హైదరాబాద్ టీమ్‌లు స్నేహపూర్వక మ్యాచ్‌లు ఆడేందుకు ప్రణాళిక రూపొందించాలని ఒక నిర్ణయానికి వచ్చారు. అలానే భవిష్యత్‌లో హైదరాబాద్ జట్లు కూడా అమెరికా పర్యటనకు వెళ్లేందుకు వీలుగా ఇరు క్రికెట్ సంఘాల టూర్ క్యాలెండర్‌ను తయారు చేయాలని చర్చించారు. దీనిపై హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్‌లో త్వరలో చర్చించి అధికారికంగా ప్రకటన చేస్తామని జగన్‌మోహన్ రావు తెలిపారు.