– సీఐడీ ఏడీజీకి తెదేపా నేత వర్ల రామయ్య లేఖ
సీఐడీ పోలీసులు చట్టపరమైన బాధ్యతలను మరిచి సీఏం జగన్ రెడ్డి వ్యక్తిగత సైన్యంలా కాకుండా రాజ్యాంగం ప్రకారం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఐడీ ఏడీజీకి లేఖ రాసిన తెదేపా నేత వర్ల రామయ్య.
జూన్ 29 రాత్రి సిఐడి పోలీసులు సంఘవిద్రోహుల వలె గోడ దూకి తలుపులు పగులగొట్టి అక్రమంగా గార్లపాటి వెనక్టేశ్వరరావును అరెస్టు చేశారు. జూన్ 30 ఉదయం మోకరాల సాంబశివరావును మంగళగిరిలోని అతని ఇంటి నుండి బలవంతంగా అరెస్టు చేశారు.అరెస్టు తర్వాత బాధితులను బలవంతంగా నగ్నంగా మార్చి థర్డ్ డిగ్రీ ప్రయోగించి కస్టోడియల్ టార్చర్‌కు గురిచేశారు.
వైసీపీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్ విజయమ్మ తన పదవికి రాజీనామా చేసిందనే పోస్ట్‌లను ఆన్‌లైన్‌లో షేర్ చేసారనే ఆరోపణలతో కేసులు నమోదు చేసి అక్రమ అరెస్టులు చేశారు.ఆరోపించిన పోస్ట్ లలో పేర్కొన్నట్లుగా వైఎస్ విజయమ్మ జూలై 8న జరిగిన వైసీపీ ప్లీనరీలో తన పదవికి రాజీనామా చేశారు.ఫిర్యాదులను క్షుణ్ణంగా విచారించకుండా, ఆరోపించిన పోస్ట్ అసలు సృష్టికర్తను కనుగొనకుండా, సీఐడీ ఒక అజ్ఞాని వలె వ్యవహరించింది.
బాధితులను శారీరక వేధింపులకు గురిచేయడమే కాకుండా బంధువులు, గ్రామస్థుల మధ్య అవమానపడేలా మానసిక వేదింపులకు గురిచేసింది.వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఐడీ జగన్ రెడ్డి వ్యక్తిగత సైన్యంలా వ్యవహరిస్తోంది.సిఐడి చట్టపరమైన రాజ్యాంగ బాధ్యతలను మరిచి ముఖ్యమంత్రి కోరిక మేరకు పనిచేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. కావున, సిఐడి తన విధులను రాజ్యాంగంప్రకారం, ఏపీ పోలీసు మాన్యువల్‌లో నిర్దేశించిన ప్రకారం పనిచేసేలా చర్యలు తీసుకోండి. సీఐడీ పోలీసుల చేతిలో వేధింపులకు గురైన బాధితులకు సీఐడీ చీఫ్ క్షమాపణలు చెప్పేందుకు కూడా అర్హులు అని గుర్తుచేస్తున్నాను.