Suryaa.co.in

Andhra Pradesh

జగన్‌కు ఓటర్ల బాండ్

– సోషల్‌మీడియాలో హల్‌చల్

ఏపీలో సంచలనం సృష్టిస్తున్న ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ బాండ్ అంశం.. ఇప్పుడు ఏకంగా జగన్ గెలిస్తే తమ భూములు ఆయనకు, ముందస్తుగా బాండు రాసిచ్చే నిస్సహాయ పరిస్థితి కనిపిస్తోంది. ఆ మేరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్‌కు మా భూములు మీకు అప్పగిస్తున్నాం. ఇకపై వాటిపై మాకు ఎలాంటి అధికారం లేదంటూ రాసిచ్చిన బాండ్ ఒకటి పోలింగ్‌కు రెండురోజుల ముందు సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అంటే జగన్ పార్టీకి ఓటు వేస్తే ఎవరికీ తమ భూములపై హక్కులుండవని, అవన్నీ జగన్ సర్కారు హక్కుభక్తుమవుతాయన్న సందేశం ఇస్తూ రాసిచ్చిన 100 రూపాయల నాన్ జ్యుడియిషల్ బాండ్ ఒకటి సోషల్‌మీడియా వేదికగా గ్రామాల రచ్చబండలో రచ్చగా మారింది.

‘‘ ది 13-5-2024 సోమవారం జగనార్పణం
రాసిచ్చేవారు: ఆంధ్రరాష్ట్ర ప్రజలు
వ్రాయించుకున్నవారు: వైఎస్ జగన్మోహన్‌రెడ్డి
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఫ్యాను గుర్తుమీద నొక్కడం ద్వారా నాపేరు మీదున్న యావదాస్థిని జగన్‌కు ధారాదత్తం ఇస్తున్నామని, ఇక మీదట మాకు మా కుటుంబసభ్యులకు ఈ ఆస్థితో ఎటువంటి సంబంధం లేదు.
ఇది నా మూర్ఖత్వంతో, అవివేకంతో తీసుకున్న నిర్ణయం.
నా భూమి-మీ హక్కు.
ఫ్యానుకు ఓటేసినందుకు నా ఖర్మ’’

అంటూ జగన్‌కు రాష్ట్ర ప్రజల పేరిట రాసిచ్చిన బాండ్.. సోషల్‌మీడియా ద్వారా గ్రామ స్థాయికి చేరిపోయి, అది రచ్చబండల దగ్గర హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఈ చట్టంపై పీకల్లోతు కోపంలో ఉన్న రైతులు, సాధారణ ప్రజలకు… జగన్ పార్టీపై అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. మా భూములపై జగన్ పెత్తనమేంటి? మా పాసుపుస్తకాలపై జగన్ ఫొటో ఏమిటి అంటూ ఆంధ్రాజనం ఆత్మాభిమానంతో రగలిపోతోంది. దానికి ఈ బాండ్ పేపర్ తోడయింది. దీని ప్రభావం జగన్ పార్టీకి ఏ స్థాయిలో ఝలక్ ఇస్తుందో చూడాలి మరి!

LEAVE A RESPONSE