అటవీ ప్రాంతంలో అరుదైన జలధార వృక్షం

నల్లమద్ది చెట్టు నుండి సుమారు 20 లీటర్ల నీరు

పాపికొండల నేషనల్ కింటుకూరు అటవీ ప్రాంతంలోని బేస్ క్యాంపు పరిశీలనకు వెళ్లిన అటవీ అధికారులకు.. ఇలాంటి చెట్లను ఏవిధంగా రక్షించుకోవాలో నల్లమద్ది చెట్టు కనివిప్పు చేసింది. ఒక చెట్టును ఎంపిక చేసుకున్న అటవీ శాఖ అధికారులు, ఆ చెట్టుపై కొద్దిగా కత్తితో గాట్లు పెడితే, అక్కడ ఏకబిగిన పదినిమిషాల పాటు చెట్టులోపల నుంచి జలధార పెల్లుబికింది. దానితో అధికారుల ఆశ్చర్యం. నల్లమద్ది చెట్టు నుండి సుమారు 20 లీటర్ల వరకు నీరు వస్తుందని అధికారులు వెల్లడించారు. అక్కడ ఇలాంటి చెట్లు ఇంకా ఎన్ని ఉన్నాయో, ఎన్ని చెట్ల నుంచి జలధార వస్తుందో తెలుసుకుని, వాటిని రక్షించాల్సిన అవసరం ఉంది.

Leave a Reply