Suryaa.co.in

Telangana

కేసీఆర్ కల నెరవేర్చే బాధ్యత మనదే: తలసాని

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కలను నెరవేర్చేలా పని చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ ల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నూతనంగా బాధ్యతలు చేపట్టిన దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ ను అన్నారు. గురువారం గోట్స్ అండ్ షీప్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ మాసాబ్ ట్యాన్క్ లోని కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చొరవతో యాదవులు రాజకీయంగా ఎంతో అభివృద్ధి సాధించారని అన్నారు. ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి ఆదేశాలతో 75 శాతం సబ్సిడీపై గొర్రెల పంపిణీ చేపట్టడం జరిగిందని చెప్పారు.

గతంలో ఉన్న పాలకులు కేవలం ఓటు బ్యాంకు గానే చూశారని అన్నారు. రాష్ట్రంలో గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న వారికి సేవ చేసే అవకాశాన్ని ముఖ్యమంత్రి KCR బాలరాజ్ యాదవ్ కు కల్పించారని చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ
tsy2-2 రాష్ట్ర ప్రభుత్వం యాదవుల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్ర సాధన కోసం ఉద్యమం లో భాగస్వాములైన ఉద్యమకారులకు ప్రభుత్వం సముచిత స్థానం కల్పించిందని చెప్పారు. రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుండగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు కొందరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో యాదాద్రి దేవాలయం ఒక అద్భుత కళాఖండం గా రూపుదిద్దుకున్నదని తెలిపారు. యాదవుల కులదైవం కొమురెల్లి మల్లన్న ఆలయం కూడా గతంలో కంటే ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, MLA లు అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, గొర్రెలు, మేకల అభివృద్ధి ఫెడరేషన్ MD రాంచందర్, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, బేవరేజెస్, వేర్ హౌస్ కార్పొరేషన్ ల చైర్మన్ లు గజ్జెల నగేష్, సాయిచంద్, నల్లగొండ జిల్లా DCCB చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, SC కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, మాజీ MLC పూల రవీందర్, వివిధ జిల్లాల నుండి వచ్చిన గొర్రెల పెంపకం దారులు, యాదవ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE