Suryaa.co.in

Telangana

న్యాయపరమైన చిక్కుల్లేకుండా బిల్లును తీసుకొస్తాం

* కొన్ని దశాబ్దాలుగా బలహీనవర్గాలు ఎదురుచూస్తున్న సంఘటన
* 2011లోనే మన్మోహన్ సింగ్ నాయకత్వంలో దీనికి బీజం పడింది
* గత పదేళ్లుగా బిజెపి ప్రభుత్వం పట్టించుకోలేదు
* సబ్ ప్లాన్ ను తీసుకొస్తాం
కుల గణన తీర్మానం పై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

కొన్ని దశాబ్దాలుగా బలహీన వర్గాలు ఎదురుచూస్తున్న ఆలోచన, సంఘటన ఇది. మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం చరిత్రలో నిలిచిపోతుంది. తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి పొన్నంను అభినందిస్తున్నాం. సభలో ముఖ్యమంత్రి లేరు అనడం సరి అయింది కాదు. ఈ తీర్మానం ప్రవేశపెట్టే ముందు క్యాబినెట్లో మంత్రుల బృందం కూలంకషంగా చర్చించి సలహాలు సూచనలు తీసుకొని మీ ముందుకు తీసుకొచ్చాం.

అత్యంత వెనుకబడిన వారిని పైకి తీసుకురావడం కాంగ్రెస్ మూల సిద్ధాంతం. జనాభా దామాషా ప్రకారం సంపదలో వారికి వాటా దక్కాలి. ఇప్పటికీ నిర్ణయం తీసుకోకపోతే ఆ వర్గాలకు అన్యాయం చేసిన వారం అవుతాం. 2011లోనే మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కుల గణన నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత వచ్చిన బిజెపి ప్రభుత్వం ఈ అంశాన్ని పక్కన పెట్టింది. ఈ బిల్లు రావాలి అని మా నాయకుడు రాహుల్ గాంధీ బలంగా నిర్ణయించారు. తెలంగాణలో మా ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది.

తెలంగాణ నుంచి ఈ బిల్లును అమలు చేస్తాం అని మొన్నటి ఎన్నికల సభల్లో రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఆ మేరకు సమగ్రంగా చర్చించి సభలో తీర్మానం ప్రవేశపెడుతున్నాం. తీర్మానానికి పార్టీలకతీతంగా మద్దతు పలికినందుకు ధన్యవాదాలు. సభ్యులు ఇచ్చిన సూచనలు సలహాలు పరిగణలోకి తీసుకుంటాం. ఎంఐఎం సోదరులు సచార్ కమిటీ రంగనాథ్ కమిషన్ ముస్లింలు పేదవారి గురించి అడిగారు. ఈ సర్వేలో రాష్ట్రంలోని అన్ని కుటుంబాల్ని లెక్కలోకి తీసుకుంటాం.

అన్ని కులాల సమాచారం సేకరిస్తాం. బీహార్ కర్ణాటకలో వివిధ ఇబ్బందులతో నిలిచిపోయాయి అంటున్నారు. కానీ మేము మాత్రం క్యాబినెట్లో కూలంకషంగా చర్చించి. లా సెక్రెటరీ తో మాట్లాడి విధి విధానాలు తయారు చేశాం. సర్వే పూర్తి అయిన తర్వాత అన్ని వర్గాలతో, మేధావులతో న్యాయ నిపుణులతో చర్చించి బిల్లు ప్రవేశపెడతాం.

గత పది ఏళ్లు అటువైపు కూర్చొని మీ బడ్జెట్ను చూశాను ఏనాడు బలహీనవర్గాలకు 6000 కోట్లు దాటి కేటాయించలేదు. ఈరోజు ప్రవేశపెట్టిన కులగనన నాంది మాత్రమే. సబ్ ప్లాన్ పై ఎటువంటి అనుమానం అవసరం లేదు సబ్ ప్లాన్ను మీ ముందుకు తీసుకొస్తాం. కాంగ్రెస్ చేసిన దాన్ని గుర్తించండి.

LEAVE A RESPONSE