అధికార దుర్వినియోగం,దొంగ ఓట్లతో కొండెపిలో గెలవాలనుకుంటున్న మంత్రి సురేశ్

• అధికార దుర్వినియోగాలకు పాల్పడి, దొంగఓట్లతో కొండెపి నియోజ కవర్గంలో గెలవడానికి మంత్రి సురేశ్ ప్రయత్నిస్తున్నాడు
• మంత్రి పదవిన ఉపయోగించి, ఇష్టానుసారం పక్క జిల్లాల నుంచి తహసీల్దార్లు, డిప్యూటీ కలెక్టర్లు, ఎండీవోలను కొండెపిలో నియమించారు
• అధికారుల బదిలీలపై కలెక్టర్ని ప్రశ్నిస్తే ఆయన నుంచి సమాధానం లేదు
• కలెక్టర్ కు తెలియకుండా మంత్రే స్వయంగా తన సామాజికవర్గం వారిని, తనకు అనుకూలంగా పనిచేసేవారిని ఎన్నికల విధుల్లో నియమిస్తున్నాడు
• కొండెపి నియోజకవర్గంలో జరుగుతున్న అధికారుల మార్పుపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశాను
• ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లి సురేశ్ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేస్తాం
– టీడీపీ శాసనసభ్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి

జగన్ రెడ్డి రాజకీయ బదిలీల్లో భాగంగా యర్రగొండపాలెం నుంచి కొండెపి నియోజకవర్గానికి వచ్చిన మంత్రి ఆదిమూలపు సురేశ్ నిబంధనలకు విరుద్ధంగా అధికారుల్ని ఒత్తిడి చేస్తూ టీడీపీ శ్రేణులపై తప్పుడు కేసులు పెట్టించే పనిలో బిజీగా ఉన్నాడని టీడీపీ శాసనసభ్యులు డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మంత్రి ఆదిమూలపు సురేశ్ చర్యల్ని తీవ్రంగా తప్పుపట్టారు.

గతంలో తనకు ఓట్లేసి గెలిపించిన యర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలు తాగునీరు లేక అల్లాడుతుంటే, మంత్రేమో కొండెపిలో వివిధశాఖల అధికారులు, పోలీసులతో సమావేశాలు జరుపుతూ టీడీపీని అడ్డుకోవడానికి కుట్రలు పన్ను తున్నాడని వీరాంజనేయస్వామి చెప్పారు.

మంత్రి సురేశ్ నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన అధికారుల బదిలీలపై కలెక్టర్ నుంచి సమాధానం లేదు
ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా మంత్రి ఆదిమూలపు సురేశ్ అధికా రుల్ని బదిలీ చేయిస్తున్నాడు. పక్క జిల్లాల నుంచి ప్రకాశం జిల్లాకు వచ్చిన తహసీల్దార్లు, ఎండీవోల జాబితాలో నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన శంఖల రమణ య్య అనే తహసీల్దార్ ను ఈ నెల 6న సింగరాయకొండకు పంపారు. ఆయన నచ్చలేదేమో వెంటనే 7వ తేదీన జే.ప్రసాదరావు అనే తహసీల్దార్ని అర్థవీడు నుంచి సింగరా యకొండకు బదిలీచేశారు. భవానీ శంకర్ అనే తహసీల్దార్ని అర్థవీడుకి పంపారు.

ఈ బదిలీలకు ముందు శిరీషా అనే డిప్యూటీ కలెక్టర్ని డిసెంబర్ 27వ తేదీన విధుల్లో చేరకుండా అడ్డుకున్నారు. 06-02-24న శిరీష స్థానంలో బీ.ఎల్.రాజకుమారిని నియమించారు. ఈ బదిలీలపై తాము కలెక్టర్ని ప్రశ్నిస్తే ఆయన నుంచి సమాధానం లేదు. శిరీష నియామకాన్ని అడ్డుకోవడానికి మహిళ తాముఅనుకున్న విధంగా పనులు చేయలేదని సాకులుచెప్పిన సురేశ్, అదే స్థానంలో తన సామాజిక వర్గానికి చెందిన రాజకుమారిని నియమించడంపై ఆయనే సమాధానం చెప్పాలి.

ఎన్నికలకు ముందు పథకం ప్రకారమే మంత్రి సురేశ్ తనకు అనుకూలంగా పనిచేసే అధికారుల్ని ఎన్నికల విధుల్లో నియమిస్తున్నాడు
ఎన్నికలకు ముందు మంత్రి పథకం ప్రకారం అధికార దుర్వినియోగానికి పాల్ప డుతున్నాడు. తనకు అనుకూలంగా పనిచేసే అధికారుల్ని ఏరికోరి ఎన్నికల విధులు నిర్వర్తించే స్థానాల్లో నియమిస్తున్నాడు. డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లనే కాదు, ఎండీవోలు, మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖ అధికారుల్ని కూడా ఇష్టానుసారం మార్చేశారు. ఈ బదిలీలతో ఆగకుండా వాలంటీర్లతో ఎక్కడికక్కడ గ్రామాలలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆదిమూలపు సురేశ్ అడ్డగోలుగా చేస్తున్న అధికారుల బదిలీలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎం.కే.మీనాకు ఫిర్యాదు చేశాను. ఆయనకు అందించిన ఫిర్యాదునే కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తాను.

అధికార దుర్వినియోగాలకు పాల్పడి, దొంగఓట్లను నమ్ముకొని కొండెపి నియోజ కవర్గంలో గెలవడానికి మంత్రి సురేశ్ ప్రయత్నిస్తున్నాడు
అధికారుల బదిలీలతో పాటు మంత్రి సురేశ్ దొంగఓటర్లను కొండెపి నియోజకవర్గం లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇష్టానుసారం ఫామ్-6, ఫామ్-7లను దుర్వినియోగం చేస్తున్నారు. కేవలం 15 రోజుల్లోనే మొత్తం ఫామ్-6, ఫామ్-7లను తనిఖీ చేశామని చెబుతూ, యర్రగొండపాలెం నుంచి కొండెపికి భారీసంఖ్య లో దొంగఓటర్లను తరలిస్తున్నారు. ఆధార్ కార్డుల్లో చిరునామాల మార్పులు అధికారులతో పెద్దఎత్తున చేయిస్తున్నారు.

ఇవన్నీ అడ్డుకోవడానికి తాము చేయాల్సిందింతా చేస్తున్నాం. మా ప్రయత్నాలకు తోడు ఎన్నికల సంఘం కూడా తగిన సహాయ సహకారాలు అందించాలి. ఎక్కడైనా గెలుస్తానని ఆదిమూలపు సురేశ్ చెబితే ఎలా గెలుస్తాడు అనుకున్నాం. ఈ విధంగా అధికారుల్ని అడ్డుపెట్టు కొని, దొంగఓట్లను నమ్ముకొని గెలిచే ప్రయత్నాలు చేస్తాడని ఇప్పుడే తెలిసింది.

మంత్రి సురేశ్ తప్పుడు మార్గంలో అధికార దుర్వినియోగాలకు పాల్పడి యర్రగొం డపాలెంలో గెలిచినట్టు, కొండెపిలో గెలవాలనుకోవడం కల్లే అవుతుంది. కొండెపి నియోజకవర్గప్రజలు సురేశ్ లాంటి వలసవాదుల్ని తరిమికొట్టి, స్థానికంగా ఉండి వారికి మంచిచేసే వారినే ఆదరిస్తారు.” అని వీరాంజనేయస్వామి తేల్చిచెప్పారు

Leave a Reply