Suryaa.co.in

Andhra Pradesh

రైతు ఉత్పత్తులకు మార్కెట్ కల్పిస్తాం

– ఉన్న వెసులుబాటు వినియోగించుకోండి
– విడివికేలను సద్వినియోగం చేసుకోండి
– దళారుల వ్యవస్థపై ఉక్కుపాదం
– రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషా విజయభాస్కర్

రంపచోడవరం: ఏజెన్సీ ప్రాంతాల్లో రైతు పండించిన ఉత్పత్తులకు మార్కెట్ కల్పిస్తామని, ఆ మేరకు రైతులు కూడా అధికారులకు సహకరించాలని రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషా విజయభాస్కర్ పిలుపునిచ్చారు. దళారుల వ్యవస్థ స్థానంలో ఏర్పాటుచేసిన విడివికేలను, పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆరుగాలం కష్టించే రైతుల శ్రమను దోచుకునే దళారులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.

అల్లూరి జిల్లా, రంపచోడవరం సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటిడిఏ) వద్ద రంపచోడవరం డివిజన్ పరిధిలో గల విడివికేల తో వర్క్ షాప్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మిర్యాల శిరీషా విజయభాస్కర్, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ కట్ట సింహాచలం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మిర్యాల శిరీషా మాట్లాడుతూ.. గిరిజన కుటుంబాలు వారు పండించే పంటలు, వారు సేకరించే అటవీ ఫలసాయాలు జీడి పిక్కలు, కొండ చీపురు, చింతపండు, పసుపు పంటలను నేరుగా దళారులకు అమ్ముకొనుటవలన నష్టపోయే వారు. కానీ ఇప్పుడు ఏర్పాటు చేసుకున్న విడివికేల ద్వారా, రైతులు వారి పండించే పంటను, వారి సేకరించి ఉత్పత్తులను విలువ పెంచి బ్రాండింగ్ తో మార్కెటింగ్ సదుపాయం కల్పించుకోవడం వలన గిరిజన కుటుంబాలకు ఉపాధి కల్పించుకొనుటకు ఈ వీడివికే లు ఉపయోగపడతాయని అన్నా రు.

రైతులు వారు పండించే లేదా సేకరించే ఉత్పత్తులు ధరలు ఎప్పటికప్పుడు ఫోన్ల ద్వారా రైతులకు వారం వారం సమాచారం తెలియజేయడం జరుగుతుంది. కావున రైతులు ఏ పంటకు ఏ ఏ ఉత్పత్తులకు ఏ రోజు ఎంత ధర ఉంటుందో తెలుసుకోవడం వలన, గిరిజన రైతులు దళారుల మోసపోకుండా ఉండడానికి ఈ వీడివికే లు ఉపయోగపడతాయని అన్నా రు. రైతులందరూ వీడివికే ఉత్పత్తులను అమ్ముకొనుట ద్వారా అధిక ఆదాయం పొంది జీవన ప్రమాణాలను పెంచుకోవాలని సూచించారు.

LEAVE A RESPONSE