Suryaa.co.in

Andhra Pradesh

కంటైనర్‌లో ఏం తరలించారు జగన్?: జీవీ

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న తాడేపల్లి ప్యాలెస్ కంటైనర్ ఉదంతంపై సీఎం జగన్‌కు ఘాటు ప్రశ్నలు సంధించారు తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు. అంత గుట్టుగా, అంత ఆగమేఘాల మీద ఏం తరలించారు? ఏమేం వస్తువులు ఎక్కడికి ఎవరికి కోసం పంపించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

విశాఖలో ఒకవైపు డ్రగ్స్‌ కంటైనర్ కలకలం, మరోవైపు ఓటమి మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో సీఎం నుంచి గుట్టుగా సాగిపోయిన కంటైనర్ ఎన్నో అనుమానాలకు తావిస్తోందన్నారు జీవీ. అక్కడి నుంచి డబ్బులు తరలించారా? పక్క రాష్ట్రం తెలంగాణలో జరుగుతున్న ట్యాపింగ్ విచారణలను చూసి భయపడి తమ వార్‌ రూమ్‌లను ముందే సర్దేశారా? అందుకు సంబంధించిన సామగ్రి మొత్తాన్ని ముందే సర్దేశారా? ఇంతకాలం సాగించిన అవినీతి, అక్రమాల పత్రాలు, రికార్డులు మాయం చేశారా? వీటన్నింటిపై ముఖ్యమంత్రి జగన్ లేదా ఆయన సకలశాఖల సలహాదారు సజ్జల అయినా సమాధానం చెప్పాలన్నారు జీవీ ఆంజనేయులు.

బుధవారం నూజండ్ల మండలం చెరువుకొమ్ముపాలేనికి చెందిన తాళ్లూరి సీతారామయ్య, రావులపల్లి వెంకటేశ్వర్లుతో పాటు 10 యాదవ కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. అందుకు సంబంధించి వినుకొండలో జరిగిన కార్యక్రమంలో జీవీ ఆంజనేయులు, లావు శ్రీకృష్ణదేవరాయలు, మక్కెన మల్లికార్జునరావు సమక్షంలో వారంతా తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి కండువాలువేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జీవీ ఆంజనేయులు జగన్ ఓటమి ఖాయమని ఎంతోకాలంగా తాము చెబుతున్నదే ఇప్పుడందరి కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందన్నారు.

అనంతరం మాట్లాడిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు అందుబాటులో ఉండి మంచి చేస్తాన్న నమ్మకం ఉంటేనే తనకు ఓటేయండని ప్రజలందరికీ పిలుపునిచ్చారు. పార్టీ లక్ష్యాలను, సంకల్పాలను తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులందరికీ సూచించారాయన. గడిచిన అయిదేళ్లలో దళితుల కోసం గత ప్రభుత్వంలో అమలు చేసిన 27 సంక్షేమ పథకాలను రద్దు చేశారని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే తిరిగి వాటిని పునరుద్ధరించడం సాధ్యమన్నారు లావు.

తర్వాత మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ… వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడి అరాచకాలు, రౌడీయిజం సహించలేకే వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని అన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో బొల్లా ఓటమి, వినుకొండ ప్రజలకు విముక్తే లక్ష్యంగా కూటమి పనిచేస్తున్నట్లు తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లో అది జరిగితీరుతుందని, బొల్లా కబంధహస్తాల నుంచి వినుకొం డ ప్రజలకు త్వరలోనే స్వేచ్ఛను కానుకగా అందిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న నుజెండ్ల జడ్పిటిసి జడ్డ సుబ్బులు రామయ్య ,పోకిరి రామయ్య ,నంబూరి గురునాధం తదితరులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE