1.ఆమె బుద్ధిమంతురాలు:
ఆమె మాటలలో జ్ఞానం ఉట్టిపడుతుంది. ఆమె సీరియస్‌గా, ఆలోచనాత్మకంగా మాట్లాడగలిగే శక్తితో ఉంటుంది.
2.ఆమె భావోద్వేగాలపై ఆధిపత్యం కలిగి ఉంటుంది:
ఆమె బాధపడినా, మానసికంగా ఒత్తిడిలో ఉన్నా తన భావోద్వేగాలను నియంత్రించుకుంటుంది. ప్రశాంతంగా, సమయస్ఫూర్తితో వ్యవహరిస్తుంది.
3.ఆమె సంవృద్ధి ప్రదాత:
ఆమె వందను వెయ్యిగా, వెయ్యిని లక్షగా మార్చగలగే శక్తి కలిగి ఉంటుంది. కష్టమైన పనులన్నీ ఇతరులపై నెట్టివేయకుండా కష్టపడి ముందుకు సాగుతుంది.
4.ఆమె ప్రేమను స్వీకరిస్తుంది, ఇస్తుంది:
ఆమెకు గౌరవం ఉంటుంది, కానీ ప్రేమతో సేవ చేస్తే, ఆ ప్రేమను అభినందిస్తూ స్వీకరిస్తుంది. సేవ చేయడానికి కూడా సిద్ధంగా ఉంటుంది.
5.ఆమెకు మంచి ఆహారం ఇష్టం:
ఉత్తమమైన వంటకాలు చేయడానికి ప్రయత్నిస్తుంది. అంతే కాదు, తన వంటతో కుటుంబ సభ్యుల మనసును కూడా తృప్తిపరుస్తుంది.
6.ఆమె సరదా మనిషి కూడా:
ఆమె తెలివైనదే కాక, సరదాగా ఉంటూ జోకులు చెబుతుంది, ఆనందిస్తుంది, ఆటపాటలతో ఇంట్లో మంచి ప్రేరణ ఇస్తుంది.
7.ఆమె సహాయం కోరడం తెలుసు:
ఏదైనా కష్టం వచ్చినప్పుడు సహాయం కోరడానికి వెనుకాడదు. సమస్యలను ఒంటరిగా ఎదుర్కొనడం కాదు కలుపుకొని పోవడం కూడా తెలుసు.
8.ఆమె దైవస్వరూపిణి:
ఆమెను చూస్తే దేవుని ప్రేమ, క్షమాభిక్ష, శక్తి, విలువలు కనిపిస్తాయి. ఆమె క్రమంగా ఆధ్యాత్మికంగా ఎదుగుతూనే ఉంటుంది.
9.ఆమెకు ఆత్మవిశ్వాసం ఉంది:
ఆమె అంతర్ముఖమైనా, బహిర్ముఖమైనా సరే, ఆమెకు మంచి ఆత్మగౌరవం ఉంటుంది. ఎవరూ ఆమెను దిగజార్చలేరు.
10.ఆమె తన శరీరం, మనసు, ఆత్మను పోషిస్తుంది:
ఉత్తేజకరమైన పుస్తకాలు చదవడం, ప్రార్థనలు చేయడం, సరైన ఆహారం తినడం, వ్యాయామం చేయడం వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తుంది.
11.ఆమె సంబంధాలను గౌరవిస్తుంది:
మంచి స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులతో బలమైన సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నిస్తుంది.
12.ఆమె తన శరీరాన్ని బాగా చూసుకుంటుంది:
ఏ దుస్తులు, ఫ్యాషన్, జుట్టు శైలి తన శరీరానికి, రంగుకు సరిపోతాయో బాగా తెలుసుకొని శరీరాన్ని అందంగా తీర్చిదిద్దుకుంటుంది.
13.ఆమె విశ్వాసపాత్రంగా, రతిశక్తితో జీవిస్తుంది:
ఆమె భర్తపై ప్రేమతో ఉండి, అప్పుడప్పుడు మొదటి అడుగు వేయడం, అతనిని ఆకర్షించడం వంటి శృంగార భావనలను కూడా అర్థం చేసుకుంటుంది.
మంచి భార్య అంటే ఆత్మగౌరవం, ప్రేమ, తెలివితేటల సమాహారం.
– ఏ.బాబు