Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ-జనసేన పొత్తు..సీట్ల సర్దుబాటుపై వైసీపీకేంటి బాధ?

– రెండుపార్టీలను విడదీయడానికి వైసీపీ నేతలు, కొందరు మంత్రులు గోతికాడ నక్కల్లా ఎదురుచూస్తున్నారు
• పొత్తులో భాగంగా ముందు అనుకున్న సీట్లకే నేడు పవన్ కల్యాణ్ అభ్యర్థుల్ని ప్రకటించారు
• ఊళ్లో పెళ్లికి కుక్కల హాడావుడిలా వైసీపీనేతలు, మంత్రులు ఎందుకు మాట్లాడుతున్నారు?
• జగన్ రెడ్డి అనే పిశాచిని రాష్ట్రం నుంచి తరిమికొట్టడానికే చంద్రబాబు-పవన్ ఒక్కటయ్యారు
• రాష్ట్రప్రయోజనాలు, ప్రజలకోసమే తెలుగుదేశం-జనసేన పొత్తు పెట్టుకున్నాయి
• రెండు పార్టీల పొత్తు పవిత్రమైనది.. పారదర్శకమైంది
• జగన్ రెడ్డిలా అవినీతి కేసుల నుంచి బయటపడటానికి.. బాబాయ్ హత్య కేసు నుంచి తప్పించుకోవడానికి మేం పొత్తు పెట్టుకోలేదు
• టీడీపీ-జనసేన పొత్తులపై మాట్లాడుతున్న వైసీపీ కాపునేతలు, ఆ వర్గం మంత్రులు జగన్ రెడ్డి తమవర్గానికి చేసిన అన్యాయంపై ఎందుకు మాట్లాడరు?
• చంద్రబాబు కాపులకు ఇచ్చిన 5శాతం రిజర్వేషన్లు ఎందుకు తీసేశావని జగన్ రెడ్డిని ప్రశ్నించే దమ్ము, ధైర్యం కాపుమంత్రులకు ఉన్నాయా?
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు

కొందరు మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు జనసేన-తెలుగుదేశం పొత్తు లపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, మా రెండు పార్టీల అంతర్గత వ్యవహారాలపై మాట్లాడే హక్కు అధికారపార్టీ నేతలకు ఎక్కడిదని, వారికి అంత ఉబలాటం ఎందుకని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు నిలదీశారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

జగన్ రెడ్డి తమవర్గానికి చేస్తున్న అన్యాయంపై కాపు మంత్రులు ఏనాడైనా మాట్లాడారా? చంద్రబాబు కాపులకు ఇచ్చిన 5శాతం రిజర్వేషన్లు ఎందుకు తీసేశావని జగన్ రెడ్డిని వారు ప్రశ్నించగలరా?

“ ఏదో జరిగిపోతోందని వైసీపీ నేతలు ఎందుకు కిందామీద పడుతున్నారు? కాపు సామాజికవర్గానికి చంద్రబాబు 5 శాతంరిజర్వేషన్లు ఇస్తే, జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఆ రిజర్వేషన్లు రద్దుచేశాడు. దానిపై ఏనాడైనా వైసీపీలోని కాపునేతలు జగన్ రెడ్డితో మాట్లాడారా? సోకాల్డ్ వైసీపీ కాపునేతలైన బొత్స సత్య నారాయణ, కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబు, పేర్నినాని లాంటివారు కాపువర్గానికి ఎందుకు అన్యాయం చేస్తున్నారని ఏనాడైనా జగన్ రెడ్డిని ప్రశ్నించారా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజోలు, రాజానగరం నియోజకవర్గాలకు తన పార్టీ తరుపున అభ్యర్థుల్ని ప్రకటించారు. దానిలో తప్పేమిటి? రిపబ్లిక్ డే సందర్భంగా పొత్తులో భాగంగానే ఆయన రెండు నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటిస్తే, దానికి వైసీపీనేతలకు ఏమిటి సంబంధం? టీడీపీ ఒకస్థానానికి అభ్యర్థిని ప్రకటిస్తే, జనసేన రెండుస్థానాలకు ప్రకటించింది. దానికి ఊళ్లోపెళ్లికి కుక్కల హడావుడి అన్నట్టుగా వైసీపీనేతలు, ముఖ్యంగా కొందరు మంత్రులు ప్యాంట్లు తడుపుకుంటున్నారు.

గోతికాడ నక్కల్లా కాచుకొని మరీ ఎప్పుడెప్పుడు టీడీపీ-జనసేన పొత్తుని చెడగొడదామా అని కొందరు వైసీపీనేతలు ఎదురుచూస్తు న్నారు. జగన్ రెడ్డికి.. వైసీపీనేతలకు వచ్చిన బాధ ఏమిటంటే.. టీడీపీ-జనసేన పొత్తుతో తమకు 20కు మించి స్థానాలు రావని అర్థమైపోయింది. దాంతోనే వైసీపీ నేతలు ప్యాంట్లు తడుపుకుంటుంటే, కొందరు మంత్రులు ఏకంగా కార్లలో డైపర్లు పెట్టుకొని తిరుగుతున్నారు.

టీడీపీ జనసేన పొత్తుల గురించి మాట్లాడే బొత్స, అంబటి, కొట్టు, పేర్నినాని, ఇతర నేతలకు జగన్ సీట్లు ఇస్తాడా?

మా పార్టీ.. జనసేన పొత్తుల గురించి మాట్లాడిన బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, కొట్టు సత్యనారాయణ సహా మరికొందరికి రేపు రాబోయే ఎన్నికల్లో జగన్ రెడ్డి వారు గతంలో పోటీచేసిన సీట్లే ఇస్తాడని గ్యారంటీ ఉందా? జగన్ రెడ్డి సొంతపార్టీ నేతలతో సీట్ల మార్పిడి పేరుతో బంతాట ఆడుతున్నారు. జగన్ ఆటదెబ్బకు గుమ్మనూరు జయరామ్ ఇప్పటికే అడ్రస్ లేకుండా పోయాడు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల్ని జగన్ రెడ్డి టిష్యూ పేపర్ల కంటే హీనంగా తీసిపారేస్తు న్నాడు. ఇలా అంతర్గత కుమ్ములాటలతో చస్తుందో, బతుకుతుందో తెలియని పరిస్థితికి వైసీపీ వచ్చింది. జనసేన-టీడీపీ పొత్తులో భాగంగా మూడుస్థానాలకు అభ్యర్థుల్నిప్రకటించగానే పోలోమంటూ మంత్రులు.. వైసీపీనేతలు ఎడాపెడా నోరు పారేసుకున్నారు. వాళ్లకు ఏస్థాయిలో తడుస్తోందో చెప్పడానికి వారి మాటలే నిదర్శనం. జగన్ రెడ్డి లాగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ చీకటి పొత్తులు పెట్టుకో రు. వారు ఏంచేసినా ప్రజలకోసం…రాష్ట్రంకోసమే.

టీడీపీ-జనసేన పొత్తులో కల్మషాలు, అభిప్రాయబేధాలకు తావులేదు

టీడీపీ-జనసేన పొత్తులో ఎలాంటి కల్మషాలు.. అభిప్రాయబేధాలకు తావులేదు. రెండుపార్టీల పొత్తు పారదర్శకం. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు జగన్ రెడ్డి అనే పిశాచిని రాష్ట్రంనుంచి తరమికొట్టడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ఊళ్లో పెళ్లికి కుక్కల హాడావుడి అన్నట్లు వైసీపీనేతలు, మంత్రులు ఎంతగా గొంతుచించుకున్నా తెలుగుదేశం- జనసేనకు వచ్చిన నష్టమేమీ లేదు. నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే వైసీపీలోని కాపునేతలు తమ వర్గానికి జగన్ చేసిన అన్యాయంపై మాట్లాడాలి. ఇప్పుడైనా ముఖ్యమంత్రిని గట్టిగా నిలదీయాలి.

60 రోజుల ముందే జగన్ రెడ్డి తన ఓటమిని తానే ప్రకటించాడు

జగన్ రెడ్డి 5ఏళ్లు అధికారంలో ఉండి ప్రజలనుంచి, రాష్ట్రంనుంచి పీక్కోవాల్సినంత పీక్కున్నాడు కాబట్టే, ఇప్పుడు ఆనందంగా దిగిపోతాను అంటున్నాడు. 2021లో నా వెంట్రుక కూడా పీకలేరు అన్న మనిషి, రెండేళ్లలోనే ఎందుకంతలా డీలా పడ్డాడు. ఇంటికెళ్లిపోతున్నానని చెబుతూ తన ఓటమిని 60రోజుల ముందే ప్రకటించాడు. అందుకు కారణం ప్రజాగ్రహమే. అధికారంలోకి వస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా, పరిశ్రమలు, ఉద్యోగాలు తెస్తానన్న జగన్ రెడ్డి ఎవరి ముందు మెడలు వంచాడో ప్రజలు చూశారు.

విలేకరుల ప్రశ్నలకు బొండా ఉమా స్పందన…!
పవన్ కల్యాణ్ ప్రకటించిన స్థానాలపై మా పార్టీకి ఎలాంటి అభ్యంతరం లేదు
ముందు అనుకున్న సీట్లనే పవన్ కల్యాణ్ ప్రకటించారు

నేడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేముంది. తనకు కూడా ఒత్తిడి ఉంది కాబట్టి, రెండుస్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నాను అన్నారు. ఆయన ప్రకటించిన రెండుస్థానాలు ముందుగా అనుకున్నవే. ఆ రెండుస్థానాలపై మాకు ఎలాంటి అభ్యంతరం.. బాధ లేవు. బాధల్లా గోతికాడ నక్కల్లా ఎదురుచూస్తున్న వైసీపీనేతలు.. జగన్ రెడ్డికి ఊడిగం చేసే మంత్రులకే. ఇరుపార్టీల అధినేతలు మాట్లాడుకున్న దానిలో భాగంగానే నేడు పవన్ కల్యాణ్ అభ్యర్థుల్ని ప్రకటించారు. వైసీపీ సోషల్ మీడియా టీడీపీ-జనసేన పొత్తులపై దుర్మార్గంగా ప్రచారం చేస్తోంది. మొన్నటికి మొన్న జనసేనకు ఇన్నిస్థానాలు.. టీడీపీకి ఇన్ని అని పోస్టులు పెట్టారు. నిన్న కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు అంటూ విషప్రచారం మొదలెట్టారు.

సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవ్ రెడ్డే వైసీపీ సోషల్ మీడియాను నిర్వహిస్తున్నాడు. అతడి ద్వారా జగన్ రెడ్డి నీచమైన ప్రచా రానికి పాల్పడుతున్నాడు. కులాలు, మతాలు, వ్యక్తులు, పార్టీల మధ్య చిచ్చు పెట్టి ఏదోరకంగా అధికారంలోకి రావాలన్నదే జగన్ కుట్ర. పవన్ కల్యాణ్ గతంలో నే వైసీపీ దుష్ప్రచారాలు నమ్మవద్దని తన పార్టీనేతలకు పిలుపునిచ్చారు. మా పార్టీ అభ్యర్థుల్ని మా అధినేత చంద్రబాబే స్వయంగా ప్రకటిస్తారు.

సోషల్ మీడియా ద్వారా అభ్యర్థుల్ని ప్రకటించాల్సిన అవసరం మా పార్టీకిలేదు. మీడియా సాక్షిగానే టీడీపీ-జనసేన అభ్యర్థుల ప్రకటన ఉంటుంది. వైసీపీ దాని అనుబంధ నీలిమీడియా దుష్ప్రచారపు ఉచ్చులో పడవద్దు.” అని బొండా ఉమా ఇరుపార్టీల కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.

LEAVE A RESPONSE