సచివాలయం తాకట్టు పెట్టే అధికారం ఎవరిచ్చారు?

-అడ్డగోలుగా దోచుకుని ఆస్తులు తనఖా పెడుతున్నారు
-రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి అధోగతిపాలు చేశారు
-బీసీలపై సానుభూతి లేని జగన్‌ ప్రభుత్వం అవసరమా?-నాసిరకం మద్యంతో ఛిద్రమైన బతులకు ఎవరు సమాధానం చెబుతారు?
-ప్రజలకు చేసిన మోసాలు, అవినీతిని ఎండగడతాం
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి

నా బీసీలు అంటూ సీఎం జగన్మోహన్‌రెడ్డి బీసీలపై కపట ప్రేమ నటిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడ పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగింది. సమావేశానికి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపీ శ్రీనివాస్‌ అధ్యక్షత వహించారు. పురంధేశ్వరి మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని, అందరూ ఈ ప్రభుత్వ బాధితులేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు సీఎం వేదికల మీదకు వచ్చి నా బీసీలు అంటూ అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ మభ్యపెడుతున్నారని, నా బీసీ అనేది పెదా లపై తప్ప…జగన్‌ గుండెల్లో లేదని వ్యాఖ్యానించారు. బీసీలపై కనీస సానుభూ తి లేని ఈ ప్రభుత్వం, ఈ సీఎం కొనసాగడం అవసరమా అని ప్రశ్నించారు.

రాష్ట్రాన్ని అన్ని విధాలా అధోగతి చేసి అప్పులపాలు చేశారని, నేడు రాష్ట్రంలో ప్రతిఒక్కరి పైనా రూ.2 లక్షల అప్పు భారం ఉందన్నారు. ఇవి చాలక సచివాలయం, రాష్ట్రంలో గనులు కూడా తనఖా పెడుతున్నాంని, అదేమిటని అడిగితే ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టకూడదని ఎక్కడైనా రాజ్యాంగంలో రాశారా అని ఆ పార్టీ నాయకుడు అడుగుతున్నారంటే ఎంత అధ్వాన పాలన చేస్తున్నారో తెలుస్తుందని వ్యంగ్య బాణాలు సంధించారు. ప్రజా ధనంతో కట్టిన సచివాలయాన్ని తనఖా పెట్టే అధికారం మీకు ఎవరిచ్చారచ్చారని ప్రశ్నించా రు. సుపరిపాలన అందిస్తారని ప్రజలు మీకు అధికారం అప్పగించారని, అడ్డగోలుగా దోచుకుని ప్రభుత్వం ఆస్తులు తనఖా పెట్టమని కాదని దుయ్య బట్టారు. మద్యపాన నిషేధం అంటూ మద్యాన్ని ఏరులై పారించారని అన్నారు.

వైసీపీ నాయకుల ధన దాహంతో మహిళలను వితంతువులుగా మార్చారు …పిల్లలకు తండ్రి లేనివారిగా మార్చి పేదల బతుకులు నాశనం చేశారన్నారు. నాణ్యత లేని మద్యం వల్లే ఆస్పత్రి పాలైనట్లు అనేకమంది వైద్యులు నిర్ధారిం చారు..ఛిద్రమైన జీవితాలకు ఎవరు సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం చేసిన మోసాలు, జరిగిన అవినీతిని ప్రజలకు వివరిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్‌ జీ, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివన్నారాయణ, ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మురళీ మోహన్‌ నాయుడు, ఆవుల నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply