Suryaa.co.in

Features

“ఎవరు మైనారిటీ ?”

(ఆయుష్ నడింపల్లి)

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూన్ 23న అమెరికాలో తన మూడు రోజుల చారిత్రాత్మక పర్యటనను పూర్తి చేసుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఇస్లామోఫోబియా ఎజెండాను నడిపించే ప్రయత్నంలో, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా CNN ఇంటర్నేషనల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని వ్యాఖ్య‌లు చేశారు. “అమెరికా అధ్యక్షుడు ప్రధాని మోడీతో సమావేశమైతే, మెజారిటీ-హిందూ భారతదేశంలో ముస్లిం మైనారిటీ రక్షణ, అది ప్రస్తావించదగ్గ విషయ‌మ‌ని నేను భావిస్తున్నాను. నాకు బాగా తెలిసిన ప్రధాని మోదీతో నేను సంభాషించినట్లయితే, భారతదేశంలోని మైనార్టీ ప్ర‌జ‌ల‌ హక్కులను మీరు రక్షించకపోతే, భారతదేశం విడిపోవడానికి ఒక దశలో బలమైన అవకాశం ఉందని నా వాదనలో భాగమే. ” అని ఒబానా అన్నారు.

ఒబామా వ్యాఖ్య‌లు పెద్దగా ప్రాచుర్యం పొంద‌న‌ప్ప‌టికీ… ఊహించినట్టుగానే భార‌త్‌ను వ్య‌తిరేకంగా చిత్రీకరించడానికి కొన్ని మీడియా సంస్థ‌ల‌కు మాత్రం ఊతం ఇచ్చాయి. కొన్ని న్యూస్ పోర్టల్స్ ఒబామా ద్వంద్వ వైఖ‌రి చూపెట్టాయి. ఒక‌వైపు కపటత్వం ప్ర‌ద‌ర్శిస్తూనే మ‌రోవైపు ప్రపంచవ్యాప్తంగా మానవ బాధలకు కారణమైన అతని ట్రాక్ రికార్డ్‌ను బహిర్గతం చేశాయి.

ఏది ఏమైనప్పటికీ, భారతదేశం వంటి విశాలమైన దేశంలో ఎవరు మైనారిటీ అనే దానిపై సరైన కథనాన్ని అర్థం చేసుకోవాల్సిన స‌మ‌యం ఇదే..

రాజ్యాంగ పరిషత్ చర్చ సందర్భంగా సర్దార్ పటేల్ మైనారిటీ అంశంపై ముస్లింల గురించి ఇలా అన్నారు. “దేశ విభజనను బలవంతం చేయగల మైనారిటీలు అస్సలు మైనారిటీలే కాదు. మీరు మైనారిటీ అని ఎందుకు అనుకుంటున్నారు. మీరు బలమైన వ్యవస్థీకృతంగా ఉన్నారు. మైనారిటీలు అయితే రక్షణలను, ప్రత్యేకాధికారాలను ఎందుకు కావాల‌నుకుంటున్నారు. కానీ అంతా అయిపోయింది. దేశ విభ‌జ‌న ఒక పిచ్చి కల అని దానిని పూర్తిగా మర్చిపోవాలి. ”

ఆయన అభిప్రాయాలను ఆ తర్వాత వచ్చిన నేతలు పట్టించుకోలేదన్నది వేరే విషయం. ఇప్పుడు లడఖ్, మిజోరాం, లక్షద్వీప్, కాశ్మీర్, నాగాలాండ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, పంజాబ్, మణిపూర్ తొమ్మిది రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌లో హిందువులు మైనారిటీగా ఉన్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఈ రాష్ట్రాలలోని హిందువులు తమకు నచ్చిన విద్యాసంస్థలను స్థాపించి నిర్వహించలేని పరిస్థితి ఉంది. హిందువులు 10% కంటే తక్కువ ఉన్న సందర్భాల్లో కూడా, ఇప్పటికీ అధికారికంగా వారు మెజారిటీగా గుర్తించ‌డం గ‌మ‌నార్హం.

దైనిక్ భాస్కర్ నివేదిక ప్రకారం దేశంలోని 775 జిల్లాల్లో 102 జిల్లాల్లో హిందువులు మైనారిటీలుగా ఉన్నారు. మరికొన్ని సంస్థలు ఈ సంఖ్యను 200 జిల్లాలుగా పేర్కొన్నాయి. పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అబ్రహామిక్ విశ్వ‌సించే వారి వలె కాకుండా, హిందూ మతంలోని చాలా విశ్వాసాలు అసంఘటితమైనవి. హిందువులు మైనారిటీగా ఉన్న చోట కూడా దురాక్రమణల‌కు గురువుతున్న పరిస్థితుల్లో ఇది పెద్ద సవాళ్లను సూచిస్తుంది. విచిత్రమేమిటంటే ఇక్కడ కూడా హిందువులను మెజారిటీగా పరిగణిస్తారు.

మైనారిటీలపై సుప్రీంకోర్టు:
సుప్రీంకోర్టు జూలై 18, 2022న “మత, భాషా వర్గాల మైనారిటీ స్థితి రాష్ట్రంపై ఆధారపడి ఉంటుంది” అని చెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 29, 30 ప్రకారం ఒక నిర్దిష్ట రాష్ట్రంలో మైనారిటీగా ఉన్న మతపరమైన లేదా భాషాపరమైన ప్ర‌జ‌లు అంతర్గతంగా రక్షణ, స్వంత విద్యా సంస్థలను నిర్వహించే హక్కును పొందవచ్చని కోర్టు సూచించింది.

ఈ కేసులో శ్రీ దేవకీనందన్ ఠాకూర్ తరఫు సీనియర్ న్యాయవాది అరవింద్ దాతార్ వాదనలు వినిపిస్తూ, నిర్దిష్ట రాష్ట్రాలలో నివసిస్తున్న హిందువులు మైనారిటీలుగా ప్రకటించే నిర్దిష్ట నోటిఫికేషన్ లేనందున ఆర్టికల్ 29, 30 ప్రకారం తమ హక్కులను మొద‌టి నుంచి వినియోగించుకోలేకపోతున్నారని అన్నారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని మైనారిటీల‌కు ఈ అంశంపై సామాజిక, రాజకీయ మేల్కొలుపుతో సహా తగిన చర్యలు తీసుకోవడానికి ఇది ఒక ప్రారంభ ద‌శ కావచ్చు.

ఇప్ప‌టికైనా దేశంలోని ప్ర‌తి జిల్లా, మండల స్థాయిలో మైనారీటిలుగా ఉన్న హిందువులు ఎదుర్కొంటున్న అల్లర్లు, అసహనం వంటి ఇతర వివ‌రాలు సిద్దం చేసి వాస్త‌వాల‌ను వెలుగులోకి తీసుకురావాలి.

Courtesy: ARISE BHARAT
(vsktelangana.org)

LEAVE A RESPONSE