Suryaa.co.in

Andhra Pradesh

ముస్లింలంటే ముఖ్యమంత్రికి ఎందుకంత ద్వేషం?

– అన్వర్ బాషా అరెస్ట్ పై ముఖ్యమంత్రి నోరువిప్పాల్సిందే. బాషా అక్రమ అరెస్ట్ పై మానవహక్కుల సంఘానికి, మైనారిటీ కమిషన్ కు ఫిర్యాదుచేస్తాం
• అబ్దుల్ సలాం, అలీషా, అన్వర్ బాషా లాంటి వాళ్లేకాదు, జగన్ ప్రభుత్వంలో 50ముస్లింకుటుంబాలపై దాడిజరిగింది. 10మందిని అన్యాయంగా చంపేశారు
• ముస్లింలపై దాడిచేసిచంపుతున్నా ముఖ్యమంత్రి, ప్రభుత్వం స్పందించడంలేదు
• అన్వర్ బాషా అరెస్ట్ పై మానవహక్కుల కమిషన్ కు, మైనారిటీ కమిషన్ కు ఫిర్యాదుచేస్తాం
• ముస్లింల స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు హరించి, వారిని వేధిస్తున్న జగన్ ఇంతకింత మూల్యం చెల్లించుకుంటాడు
• వచ్చేఎన్నికల్లో ముస్లింలంతా ఒక్కతాటిపై నిలిచి, జగన్మోహన్ రెడ్డికి బుద్ధిచెప్పి, చంద్రబాబుకి పట్టం కట్టాలి
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి మహమ్మద్ నసీర్ అహ్మద్

పల్నాడుజిల్లా మాచర్లలో టీడీపీమైనారిటీ నాయకుడైన సయ్యద్ అన్వర్ బాషాను బక్రీద్ పండుగకి ముందురోజు అక్రమంగా అరెస్ట్ చేయడం, పోలీసులే దొంగల్లాగా విద్యు త్ లేకుండా చేసి, బాషాను అదుపులోకి తీసుకోవడం ఎంత వరకు సరైందని, అన్వర్ బాషా అరెస్ట్ పై ముఖ్యమంత్రి నోరు విప్పాల్సిందేనని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి మహమ్మద్ నసీర్ అహ్మద్ డిమాండ్ చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే ..

టీడీపీ కార్యక్రమాల విజయవంతంలో బాషా కీలకంగా వ్యవహరిస్తున్నాడన్న అక్కసు తోనే ఎమ్మెల్యే పిన్నెల్లి అతన్ని అరెస్ట్ చేయించాడు
“ మాచర్ల వైసీపీఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి స్థానిక పోలీసులు తొత్తులుగా మారి గులాంగిరీ చేస్తున్నారు. చట్టప్రకారం వ్యవహరించాల్సినవారు జగన్మోహన్ రెడ్డి చుట్టా లుగా మారి దళితులు, బీసీలు, మైనారిటీలపై అక్రమకేసులుపెట్టి వేధిస్తున్నారు. ఎక్క డో కారంపూడిలో 20వతేదీన జరిగిన సంఘటనకు అన్వర్ బాషాను బాధ్యుడిని చేస్తూ పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని తీవ్రంగాఖండిస్తున్నాం.

అన్వర్ బాషా ఇటీవల టీడీపీ కార్యక్ర్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటూ, వాటిని విజయవంతం చేస్తున్నాడన్న అక్కసు తోనే ఎమ్మెల్యేపిన్నెల్లి అతన్ని అరెస్ట్ చేయించాడు. బక్రీద్ పండుగ సందర్భం గా బాషాకుటుంబం సంతోషంగా ఉన్నసమయంలో, అతన్నిఅదుపులోకి తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బాషాపిల్లలు ఏడుస్తున్న దృశ్యాలు ప్రతిఒక్కరినీ కలచి వేస్తున్నాయి.

జగన్ పాలనలో ముస్లింమైనారిటీలకు రక్షణలేదు. బాషా అరెస్ట్ పై ముఖ్యమంత్రి స్పందించకుంటే, మానవ హక్కుల సంఘానికి, జాతీయమైనారిటీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం
జగన్మోహన్ రెడ్డి పాలనలో ముస్లింమైనారిటీలకు రక్షణలేకుండా పోయింది. మైనారిటీ ల ఓట్లతో అధికారం చేపట్టిన జగన్, ముఖ్యమంత్రి అయినదగ్గరనుంచీ వారిపై కక్షసాధిం పులకు పాల్పడుతూ, దాడులతో వారిని వేధిస్తున్నాడు. గతంలో వైసీపీ నాయకుల దమనకాండకు నంద్యాలలో నలుగురుసభ్యుల మైనారిటీ కుటుంబం రైలుకిందపడి చనిపోయింది.

దాచేపల్లిలో చేయనినేరానికి అలీషా అనేయువకుడిని ఎక్సైజ్ సీఐ కొండారెడ్డి చితకబాదడంతో సదరుయువకుడు అవమానభారంతో ఆత్మహత్య చేసుకున్నాడు. రాజమహేంద్రవరంలో ఒకమైనారిటీ కుటుంబం మొత్తం జగన్ ప్రభుత్వ దుర్మార్గానికి బలైపోయింది.

నరసరావుపేట పట్టణంలోస్థానిక పెద్దాయన ముస్లిం సమాజం ఆస్తుల్ని కాపాడేప్రయత్నంలో, స్థానికఎమ్మెల్యే దుర్మార్గానికి బలైపోయాడు.అన్వర్ బాషా అరెస్ట్ వ్యవహారంపై ముఖ్యమంత్రి ముస్లింలకు సమాధానంచెప్పాలి. లేకుంటే ఈ అంశంపై మానవహక్కులసంఘానికి, మైనారిటీ కమిషన్ కుఫిర్యాదు చేస్తాం.

ముస్లిలంటే ముఖ్యమంత్రికి ఎందుకంత ద్వేషం? మైనారిటీలను భయపెట్టాలని చూస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇంతకింత మూల్యం చెల్లించుకుంటాడు
జగన్ ప్రభుత్వంలో ముస్లింమైనారిటీలకు రక్షణలేదని తేలిపోయింది. 4 ఏళ్ల జగన్ పాలనలో 50ముస్లింకుటుంబాలపై దాడులుజరిగాయి. 10 మందిని దారుణంగా చంపి తే, ఇప్పటివరకు నిందితులపై ఎలాంటిచర్యలు తీసుకోలేదు. మదర్సాలు, మసీ దులపై దాడిచేసేవారిపైకూడా ప్రభుత్వం ఎలాంటిచర్యలు తీసుకోవడంలేదు. తెలుగు దేశంపార్టీకి, ఇతరపార్టీలకు మద్ధతుతెలిపే ముస్లిం మైనారిటీలు అంటే ముఖ్యమంత్రికి ఎందుకంత ద్వేషం?

ముస్లింలకు స్వేచ్ఛ,స్వాతంత్ర్యం లేవా..వారు వారికి నచ్చినట్టు ఉండకూడదా అనిముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షనిస్ట్ పాలన ను ముస్లింలు అర్థంచేసుకున్నారు. కేసులు, వేధింపులు, దాడులతో ముస్లింలను భయపెట్టాలనిచూస్తే జగన్మోహన్ రెడ్డి ఇంతకింత మూల్యంచెల్లించుకుంటాడని హెచ్చ రిస్తున్నాం. ముస్లింమైనారిటీలు తనకు బానిసలు అన్నట్టు విర్రవీగుతున్న జగన్ కు వారే సమాధికట్టేరోజు దగ్గర్లోనేఉంది.

మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి వచ్చేఎన్నికల్లో ఆయననియోజకవర్గంలోని ముస్లింలే తగినబుద్ధి చెబుతారు. జగన్మోహన్ రెడ్డి, ఆయనప్రభుత్వం ముమ్మాటికీ ముస్లింలకు తీరని అన్యాయం చేసింది. వచ్చేఎన్నికల్లో ముస్లింసోదరులంతా ఒక్కతాటిపైనిలిచి చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయాలని కోరుతున్నా. టీడీపీప్రభుత్వమే ముస్లిం మైనారిటీల మనోభావాలు గౌరవించి, వారికి రక్షణగా నిలుస్తుంది.” అని నసీర్ అహ్మద్ స్పష్టంచేశారు.

LEAVE A RESPONSE