Suryaa.co.in

Features

అంత పెద్ద విగ్రహం ఎందుకు? ఆ వెయ్యి కోట్లు పేదలకు పంచొచ్చుగా?

అంత పెద్ద విగ్రహం ఎందుకు? ఆ వెయ్యి కోట్లు పేదలకు పంచొచ్చుగా?.ముచ్చింతల్ వేదికగా నిర్మితమయిన రామానుజ విగ్రహ నిర్మాణం, భారీ ఏర్పాట్లు, వీఐపీల రాకపై గత వారం నుంచి సోషల్‌మీడియా వేదికగా కొందరు సంధిస్తున్న ప్రశ్నలివి. వెయ్యి కోట్లు వృధాగా ఖర్చు చేసి విగ్రహం నిర్మించే బదులు, ఆ డబ్బేదో పేదలకు పంచవచ్చు కదా? ఆసుపత్రులు, స్కూళ్లు నిర్మించవచ్చు కదా? ఇలాంటి ప్రశ్నలతో చాలామంది కాలక్షేపరాయుళ్లు మొదలుపెట్టిన చర్చ ఇది. గమ్మతేమిటంటే.. ఈ ప్రశ్నలేసినవారెవరూ ఆ విగ్రహం కోసం నయాపైసా విరాళం ఇవ్వలేదు. ఆ ఇచ్చిన వారంతా హిందువులే. విమర్శించేవారిలో కొందరు హిందువులతోపాటు, మిగిలిన మతాలవారూ ఉన్నారు. ఇక ఈ ప్రశ్నలకు నా జవాబేమిటో చూడండి.
(కృష్ణమూర్తి, విశ్వహిందూ పరిషత్)

ముచ్చింతల్ లో 1000కోట్లు పెట్టి రామనుజులవారి అంత పెద్ద విగ్రహం పెట్టే బదులు హాస్పిటల్ కడితే రామానుజులకి గర్తింపు వస్తుంది కదా?
అక్కడ యాగాల్లో, హోమాల్లో వృధా చేస్తున్న నెయ్యి పంచిపెట్టొచ్చు కదా అని వింటున్నాము గత వారంరోజులుగా,
చినజీయర్స్వామి వారు పదేళ్లముందే తమ ఆశ్రమంలో 100 పడకల ఆస్పత్రి కట్టించారు అందులో ఉచిత సేవలు అందిస్తున్నారు, దానిముందు చిన్న విగ్రహము పెట్టించారు ఈ విమర్శించే లోకులకి ఈ విషయం తెలుసా? తెలీదు కానీ విమర్శించేస్తాం.
ఇవే కాదు ఆశ్రమంలో హోమియోకాలేజ్ ఉంది, వేదపాఠశాల ఉంది.
గోశాల ఉంది. అంధులకి స్కూల్&కాలేజి ఉంది. అందులో చదివే పిల్లలకి స్టేటు ర్యాంకులు ఉన్నాయ్. ఇవేవీ మనకి తెలీదు కానీ విమర్శించేస్తాం.
JET (jeeyar educational trust ) ద్వారా కొన్ని వందల మంది గిరిజన విద్యార్థులకి 2004 నుంచి ఉచిత విద్య, వసతి ఇస్తున్నారు. అది తెలుసా తెలీదు. కానీ విమర్శలు చేస్తారు.
వికాసతరంగిణి అనే ట్రస్టు ద్వారా కొన్ని వేల మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ మీద అవగాహన కల్పించారు. సేవలు అందించారు ఇవేవీ మనకి తెలీవు కానీ విమర్శిం చేస్తాం.
అబ్బే లేదండి స్వామీజీ పెద్దపెద్ద వాళ్లనే ముందు వరుసలో పెడతారండి.
ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలకి తోడ్పాటునిచ్చే వారిని ముందు పెట్టడంలో తప్పేంటి?
విమర్శకులు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆ విగ్రహం ఎందుకండి అని అంటే అన్నారు. రేపు తిరుమలలో వెంకన్న ఎందుకండీ అక్కడ కూడా హాస్పిటల్ పెట్టండి అనకండి.
అయినా ఆ 1000 కోట్లలో మీకు సంబంధించి, ఒక్కరూ రూపాయి కూడా లేదు.
ఆ డబ్బు అంతా హిందువులు ఇచ్చిన విరాళాలు, చందాలు, కానుకల ద్వారా పొగుచేసినవి.
మరి మా డబ్బులు దేనికి ఖర్చు పెడితే మీకేమీ?
చిన జీయర్ గారు చేసిన చేస్తున్న కార్యక్రమాలు చాలామందికి వివరాలు తెలియవు,
వారు పబ్లిసిటీ కోరుకోరు.
అలాంటివారికి ఈ పోస్ట్ ద్వారా కొంత సమాచారం తెలియజేయాలి అని ఈ పోస్ట్.
వేద విద్యాలయాలు..శ్రీరామనగరంతో పాటు విశాఖ, సీతానగరం, కరీంనగర్ (ఎల్‌ఎండి) లలో జీయర్ గారి ఆధ్వర్యంలో వేదపాఠశాలలు నడుస్తున్నాయి,
అంధులకు విద్య.. శ్రీరామనగరంలో అంధులైన విద్యార్థుల కోసం జూనియర్,
డిగ్రీకాలేజీలు నడుస్తున్నాయి.
విశాఖ జిల్లా వారిజలో ప్రాథమిక,మాధ్యమిక పాఠశాల నడుస్తున్నాయి అని ఎంతమందికి తెలుసు?
అన్నదానం..బదరీనాథ్ అష్టాక్షరీ క్షేత్రం,
హృషీకేష్
శ్రీరంగం
మేల్కొటే
తిరుమల
భద్రాచలం
నడిగడ్డపాలెం
సీతానగరం
శ్రీరామనగరంలలో రోజూ ఉచిత అన్నదానం జరుగుతోంది. తద్వారా రోజు కొన్ని వేలాదిమందికి ఆకలి తీర్చుతున్నారు అది తెలుసా?
ఆదర్శగ్రామం..ఆదిలాబాద్ జిల్లాలో యువతీ, యువకులకు శిక్షణ ఇచ్చి,
వారి ద్వారా ఆదర్శ గ్రామాలను రూపొందించే మహత్తర కార్యక్రమం కొనసాగిస్తున్నారు.
11 గ్రామాల్లో మంచినీటి పథకాల నిర్మాణం చేశారు తద్వారా ప్రజలకు సురక్షిత నీరు అందిస్తున్నారు,
ప్రకృతి విలయాలు..ప్రకృతి విలయాలు వచ్చినప్పుడు జీయర్ స్వామి వెంటనే స్పందిస్తున్నారు.
భూకంపాలు, సునామీలు వచ్చినప్పుడు రంగంలోకి దిగి బాధితులకు చేయూత ఇస్తున్నారు.
గుజరాత్‌లోని వల్లభాపూర్‌లో 88 శాశ్వత గృహాలు నిర్మించి ఇచ్చారు,
jeeyar-modiమొన్న నేపాల్ భూకంపబాధితులకు తాత్కాలిక సాయం అందిస్తూ, 1.50 కోట్ల ఖర్చుతో విద్యాలయం నిర్మిస్తున్నారు తమిళనాడులో సునామీ రాగా,నాగపట్నంలో 50 మందికి పక్కా ఇళ్లు కట్టించి ఇచ్చారు.
మత్స్యకారుల జీవనం కోసం పడవలు అందించారు.
జపాన్‌లో సునామీ సందర్భంగా 11 లక్షల రూపాయలు అందించారు.
ఉగ్రవాదనివారణకోసం..ఉగ్రవాద నివారణ కోసం మానససరోవరం తీరంలో బ్రహ్మయజ్ఞం 2002 లో నిర్వహించారు.
కార్గిల్ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకున్నారు
వృద్ధాశ్రమం..గుంటూరు జిల్లా చుండూరు మండలం నడిగడ్డపాలెంలో వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు.
జిమ్స్..జీయర్ ఇంటిగ్రెటివ్ మెడికల్ సర్వీసెస్ (జిమ్స్) పేరుతో శ్రీరామనగరంలో హోమియో మెడికల్ కాలేజీ,100 పడకల ఆసుపత్రి నడిపిస్తున్నారు.
అల్లోపతి/ఆయుర్వేదం/హోమియోపతి విధానాల్లో వేర్వేరుగా చికిత్స అందిస్తున్నారు,
వైద్య శిబిరాలు..గ్రామీణులకు ఉచితంగా వైద్య చికిత్స అందించేందుకు తరచూ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 2500 పైగా ఉచిత క్యాన్సర్ శిబిరాలు నిర్వహించి రెండు లక్షల మంది మహిళలకు చికిత్స అందించారు.
1300 వరకు ఉచిత వైద్య శిబిరాలు, 900 పైగా కంటి చికిత్స శిబిరాలు,
1000 కిపైగా దంత వైద్య శిబిరాలు నిర్వహించారు.
పశువైద్య శిబిరాలు..పశువులకు ఉచితంగా చికిత్స అందించేందుకు తరచూ పశువైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు.
గ్రామాల్లో ఈ తరహా శిబిరాలను నిర్వహిస్తూ ఏటా రెండు లక్షల పశువులకు చికిత్స అందిస్తున్నారు.
ఆలయాలజీర్ణోద్ధరణ..ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పురాతన ఆలయాల జీర్ణోద్ధరణకు చిన్న జీయర్ శ్రీకారం చుట్టారు.
గోసేవ..సీతానగరం/శ్రీరామనగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో గోశాలలు ఏర్పాటు చేసి దాదాపు 500 గోవులను రక్షిస్తున్నారు.
అవయవదానం..అవయవదానం గొప్ప దానమని భావించిన చిన్నజీయర్ ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఎవరైనా అవయవదానం చేయవచ్చు. అనుకోకుండా ఎవరైనా చనిపోతే, ఆరుగంటల వ్యవధిలో వారి అవయవాలను సేకరించి, అవసరమైన వారికి అమరుస్తారు.
ఇందుకోసం ముందుకు వచ్చేవారు 040-6636 9369/98492 45948 నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు తీసుకోవచ్చు.
2019 లో విశాఖపట్నంలో 90 మందికి పైగా జీయర్ ట్రస్ట్ ఆధ్వర్యములో అవయవదానం జరిగింది.
ఖైదీల్లోపరివర్తన..ఖైదీల్లో పరివర్తన తీసుకువచ్చేందుకు జీయర్‌స్వామి ప్రయత్నిస్తున్నారు.
సమాజంలో బాధ్యత గల పౌరులుగా రూపుదిద్దుతున్నారు వారి కుటుంబాల పోషణకోసం కుట్టుమిషన్లు,సైకిళ్లు తదితర వస్తువులను అందిస్తున్నారు.
భక్తినివేదన..భక్తినివేదన పేరుతో ఆధ్యాత్మిక మాసపత్రిక నడిపిస్తున్నారు.
పురస్కారాలు..వేదవిద్యావ్యాప్తికి పాటుపడుతున్నవారికి సన్మాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
వైదిక గ్రంథాలను ముద్రిస్తున్నారు.
ఇలా ఒకటా రెండా?
ఎన్నో వందలాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎందరికో సేవలు అందిస్తూ ఉన్నారు.
ఇవేవీ తెలియని వాళ్ళు ఏవేవో మాట్లాడుతున్నారు.

LEAVE A RESPONSE