Suryaa.co.in

Andhra Pradesh

సీతారామాంజనేయుల్ని ఎందుకు అరెస్టు చేయలేదు?

హైకోర్టు

అమరావతి: కక్ష సాధింపులు అనుకుంటారన్న మోహమాటంతో నేరస్తుల్ని ఏపీ ప్రభుత్వం ఎలా వదిలి వేస్తుందో చెప్పే ఘటన ఇది. స్వయంగా ఏపీ హైకోర్టే కనీసం ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా వేయని ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయుల్ని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది. హీరోయిన్ జత్వానీని వేధించిన కేసులో.. కేసులు నమోదు కావడంతో ఇతర ఐపీఎస్‌లు, పోలీసులు ముందస్తు బెయిల్ కోసంకోర్టుకెళ్లారు. విచారణ పూర్తయ్యే వరకూ వారిని అరెస్టు చేయవద్దని కోర్టు చెప్పింది. ఈ విచారణ జరుగుతోంది. తాజాగా విచారణలో హైకోర్టు.. ఈ కేసులో ఏ 2గా ఉన్న ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయుల్ని ఎందుకు అరెస్టు చేయలేదని .. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ వేయలేదు కదా అని ప్రశ్నించింది.

LEAVE A RESPONSE