Home » బీసీ సాధికార సభ విజయంతో వైసీపీ వెన్నులో వణుకు మొదలైంది

బీసీ సాధికార సభ విజయంతో వైసీపీ వెన్నులో వణుకు మొదలైంది

-రూ. 8 లక్షల కోట్లు అప్పులు చేసిన జగన్ రెడ్డి వాటిలో ఒక్క రూపాయి బీసీలకు ఖర్చు చేశారా?
-బీసీల పార్టీ టీడీపీ జగన్ రెడ్డి మాయమాటలు బీసీలు నమ్మరు
-బీసీలకు ఎవరేం చేశారో సాక్ష్యాధారాలతో ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు సిద్దం
– టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ

బీసీల పార్టీ అంటే తెలుగుదేశమేనని, నిన్న విజయవాడలో జరిగిన టీడీపీ బీసీ సాధికార సభకు వచ్చిన లక్షలాది మంది బీసీలను చూసి వైసీపీ వెన్నులో వణుకు మొదలైందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ…… బీసీ సాధికార సభ విజయవంతంతో వైసీపీ నేతలకు భయం పట్టుకుంది. అందుకే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి అరకొర పదవులు పొందిన బీసీ నేతల చేత ప్రెస్ మీట్లు పెట్టింది తాడేపల్లి స్ర్కిప్ట్ చదివిస్తున్నారు.

మూడేళ్లలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రూ. 8 లక్షల కోట్లు అప్పులు తెచ్చారు, వాటిలో కనీసం ఒక్క రూపాయి బీసీలకు ఖర్చు చేశారా? బీసీలకు ఖర్చు చేయపోగా తెచ్చిన అప్పులకు జగన్ రెడ్డి పన్నుల రూపంలో బడుగు, బలహీన వర్గాల రక్తం పిండుతున్నారు. బీసీ సబ్ ప్లాన్ కి చంద్రబాబు రూ. 36 వేల కోట్లు ఖర్చు చేస్తే జగన్ రెడ్డి సబ్ ప్లాన్ కి బడ్జెట్ లో ఒక్క రూపాయి కేటాయించలేదు. బీసీలకు పారిశ్రామిక రాయితీలు రద్దు చేసి పారిశ్రామికవేత్తలుగా ఎదగనీయకుండా అడ్డుకున్నారు. 11 వేల ఎకరాల బీసీల భూములు లాక్కున్నారు. స్థానిక సంస్థలలో బిసి నాయకత్వాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే జగన్ రెడ్డి కోత విధించి 16,800 మంది బిసిలను స్ధానిక ప్రజాప్రతినిధులు కాకుండా అడ్డుకున్నారు.

సామాజిక న్యాయం అంటే ఇదేనా?
జగన్ రెడ్డి బీసీల నిధులు రూ. 26వేల కోట్లు దారి మళ్లించారు. ఈ విషయం వైసీసీలో ఉన్న బిసి మంత్రులు, నాయకులకు తెలియదా? చంద్రబాబు నాయుడు బీసీలకు ఇచ్చిన పెళ్లి కానుకను సైతం జగన్ రెడ్డి నిర్వీర్యం చేశారు. చంద్రబాబు నాయుడు వేల కోట్ల రూపాయలతో 1200 బీసీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి చర్యలు చేపడితే జగన్ రెడ్డి వాటిని నిలిపివేశారు. చేతివృత్తుల వారికి ప్రోత్సాహం అందించేందుకు ఆదరణ పథకం కింద రూ. 1000 కోట్లకు పైగా నిధులు కేటాయించి పనిముట్లు అందజేస్తే ఆ పధకాన్ని కాల రాసిన నీచ చరిత్ర జగన్ రెడ్డిది. రాష్ట్రంలో మూడున్నరల లక్షల మంది చేనేతలుంటే ఉంటే కనీసం 50 వేలమందికి కూడా నేతన్న నేస్తం ఇవ్వటం లేదు. 56 కార్పోరేషన్లు పెట్టామని గొప్పలు చెబున్నారు తప్ప వాటికి కనీసం ఒక్క రూపాయి కేటాయించారా? అక్కడ కూర్చోడానికి కుర్చీలు కూడా లేవు. నిధులు, విధులు లేని పదవులు మాకెందుకని ఆ కార్పోరేషన్ల చైర్మన్లే తమ గోడు వెల్లబోసుకుంటున్నారు.

జగన్ రెడ్డి రాష్ట్రాన్ని నాలుగు భాగాలు చేసి తన సామాజికవర్గం వారికి కట్టబెట్టారు. ఉత్తారాంధ్రలోని మూడు జిల్లాలు వైవి.సుబ్బారెడ్డికి, ఉభయ గోదావరి జిల్లాలని మిథున్ రెడ్డికి, కృష్ణా, గుంటూరు జిల్లాలు అయోధ్య రామిరెడ్డికి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాలు సజ్జల రామకృష్ణా రెడ్డికి కట్టబెట్టి బీసీ మంత్రులని, ఎమ్మెల్యేలని బంట్రోతులకంటే హీనంగా చూస్తున్నారు. టీటీడీ చైర్మన్ గా టీడీపీ ముగ్గురి బీసీలకు అవకాశం కల్పిస్తే జగన్ రెడ్డి మాత్రం బీసీకి అవకాశం ఇవ్వకుండా తన బాబాయి వైవీ సుబ్బారెడ్డికి కట్టబెట్టారు.

24 మంది ముఖ్యమంత్రి సలహాదారుల్లో కేవలం బీసీ ఒక్కరే, 12 మంది యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ లో కేవలం బీసీ ఒక్కరే, 30 మంది ప్రభుత్వ న్యాయవాదులు ఉంటే వారిలో కేవలం బీసీలు 5 మందే. ఇలా చెప్పుకుంటూ పోతే బీసీలకు జగన్ రెడ్డి చేసిన ద్రోహం చాలా ఉంది. సిగ్గులేని వైసీపీ ప్రభుత్వం 126 బిసి కులాలకు గాను కేవలం 4 కులాలకు అరకొరగా సాయం చేసి ఉద్ధరించామని అసెంబ్లీ సాక్షిగా చెప్పి ఇప్పుడు సిగ్గు లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి అబద్దాలు చెప్పిస్తారా?

20 లక్షల మంది మత్య్సకారులుంటే కేవలం 1 లక్షమందికి మాత్రమే మత్య్సకార భరోసా ఇస్తున్నారని కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. చేనేతలకు సబ్సిడీలు ఏమీ ఇవ్వలేదని ఆర్టీఐ ద్వారా ప్రభుత్వమే చెప్పింది, చేనేతలకు రూ.111 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత చంద్రబాబు నాయుడిదే. చంద్రబాబు నాయుడు హయాంలో బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా వేలాది మంది లబ్ధి పొందారు. కానీ వాటిని జగన్ రెడ్డి నిర్వీర్యం చేశారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలో 39 మంది బీసీలను హత్య చేశారు. ఇక బీసీ మహిళలపై అత్యాచారాలు లెక్కలేనన్ని. టీడీపీ హయాంలో రజక కార్పొరేషన్ ద్వారా ప్రతి ఒక్క గ్రూపుకి 10లక్షలకు పైగా 7వేల గ్రూపులకి సబ్సిడి రుణాలు ఇచ్చారు. మత్సకారులకి 75శాతం సబ్సిడీలతో పడవలు, వలలు ఇచ్చారు. నాయి బ్రాహ్మణులని ఆదుకున్నారు. 16 యూనివర్సిటీలలో వీసీలుగా 9 మంది బిసిలలకు నియమించారు. నామినేటేటెడ్ పోస్టులలో 90శాతం బిసిలకే ఇచ్చారు.

జగన్ రెడ్డి పదే పదే బీసీలకు రాజ్యసభ పదువులిచ్చామని చెప్పుకుంటున్నారు. వాళ్లలో ఒకరేమో జగన్ రెడ్డి కేసుల్లో సహనిందితుడు, మరొకరేమో డబ్బులిచ్చి పదవి కొనుక్కున్నారు. ప్రకాశం జిల్లాలోని ఒక ప్రాంతంలో నాయి బ్రాహ్మణులు టీడీపీకి ఓటు వేశారని ఊరు నుంచి వెలి వేసిని ఘనత వైసీపీది. గత ఎన్నికల్లో కులాల మధ్య చిచ్చు పెట్టి వైసీపీ అధికారంలోకి వచ్చింది. మళ్లీ అదే ప్రయత్నం చేయాలనుకుంటే ఈసారి వైసీపీ ప్రణాళిక పారదు. జగన్ రెడ్డి టీడీపీ బీసీ నేతలపై కక్ష్య కట్టి అక్రమ కేసులు బనాయించి కోర్టులు చుట్టూ తిప్పుతున్నారు. బీసీల పార్టీ అంటే తెలుగుదేశమే. వైసీపీ నేతలు ఇకనైనా కాకమ్మ కబుర్లు ఆపండి… జగన్ రెడ్డి మాయమాటలు బీసీలు నమ్మరు. బీసీలకు ఎవరేం చేశారో సాక్ష్యాలతో సహా ఎప్పుడైనా, ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్దమని పంచుమర్తి అనురాధ సవాల్ విసిరారు.

Leave a Reply