– నిన్న వంశీ, నేడు పోసాని
– అక్కడి నుంచి ఖాళీ చేస్తున్న వైసీపీ నేతలు
అధికారం కోల్పోయాక వైసీపీ కీలక నేతలు హైదరాబాద్ నగరంలోని అత్యంత విలాసవంతమైన నివాస సముదాయం “మై హోమ్ భోజా”ను తమ అడ్డాగా మార్చుకున్నారు. కానీ, ఈ విలాసవంతమైన విలాసాల స్వర్గం వారికి కలిసిరావడం లేదు. కేవలం 15 రోజుల వ్యవధిలో, ఇద్దరు కీలక నేతలు – వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి – ఈ “మై హోమ్ భోజా”లోనే ఆంధ్రప్రదేశ్ పోలీసుల చేతికి చిక్కారు. ఈ వరుస అరెస్టులతో ఆ నివాస సముదాయంలో ఉంటున్న మిగిలిన వైసీపీ నేతలు హడలిపోతున్నారు. భయాందోళనలతో మకాం మార్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. వల్లభనేని వంశీ, పోసాని కృష్ణ మురళి వైసీపీ అధికారంలో ఉండగా చంద్రబాబునాయుడు కుటుంబాన్ని, టీడీపీని, పవన్ కల్యాణ్‌ను దారుణంగా దూషించిన విషయం తెలిసిందే.