Suryaa.co.in

Andhra Pradesh

పోసాని కృష్ణమురళి అరెస్టు

హైదరాబాద్‌: వైసీపీ నాయకుడు, సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని రాయదుర్గం మై హోం భుజా అపార్టుమెంటులో ఉంటున్న ఆయనను రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులతో పోసాని వాగ్వాదానికి దిగారు. పోలీసులు పోసానిని అతికష్టంమీద అదుపులోకి తీసుకున్నారు.

పోసానిపై గతంలో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సినిమా పరిశ్రమపై విమర్శలు చేశారని స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు, పోసాని పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి రాజంపేట కోర్టు పోసానిపై నాన్-బెయిలబుల్ వారెంటును జారీ చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు రాయదుర్గం చేరుకొని పోసాని కృష్ణమురళిని అదుపులోకి తీసుకున్నారు.

LEAVE A RESPONSE