Suryaa.co.in

Andhra Pradesh

పార్టీని ముందుండి నడిపే సైనికులు మీరే

-వైసీపీ హత్యా రాజకీయాలు ఇంకెంతో కాలం సాగవు
-సైకిల్‌ స్పీడు పెంచి దుర్మార్గులను తొక్కుకుంటూ పోవాలి
-ప్రొద్దుటూరు నిజం గెలవాలి యాత్రలో నారా భువనేశ్వరి

పార్టీ కోసం ప్రాణాలొదిన కార్యకర్తల త్యాగాలు వృథా కావని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. ప్రొద్దుటూరు మండలం పెదశెట్టిపల్లి గ్రామంలో నిజం గెలవాలి యాత్రలో భాగంగా గురువారం కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం పెద్దఎత్తున వచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. చంద్రబాబు ఎప్పుడూ కార్యకర్తలు, ప్రజల సంక్షేమం, అభివృద్ధి గురించే ఆలోచిస్తారు. కుటుంబాన్ని కూడా చంద్రబాబు ఇంతలా పట్టించుకోరు. టీడీపీకి కార్యకర్తలే బలం… ఎంత మంది నాయకులు పార్టీని వీడినా కార్యకర్తలు కదలకుండా నిలబడ్డారు. నందం సుబ్బయ్య, తోట చంద్రయ్య వంటి అనేక మంది పార్టీ కోసం ప్రాణాలు ఫణంగా పెట్టారు. వైసీపీ వాళ్లు మెడమీద కత్తిపెట్టి జై వైసీపీ…జై జగన్‌ అని చెప్పాలని బలవంతం చేసినా ఎక్కడా రాజీ పడకుండా జై టీడీపీ…జై చంద్రబాబు అని చెప్పి ప్రాణాలు అర్పించిన గొప్ప వ్యక్తులు వారు అని పేర్కొన్నారు.

పూతలపట్టు నియోజకవర్గంలో హంసవేణి అనే మహిళ మంచినీళ్లు రావడం లేదని ఫిర్యాదు చేసిందనే కోపంతో ఆమె కళ్లు పీకేసిన రాక్షసులు వైసీపీ నాయకులన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై వైసీపీ నేతల అరాచకాలు ఇంకెంతకాలమో సాగవని వ్యాఖ్యానించారు. వైసీపీ ఉన్మాదులకు భార్య, బిడ్డలు ఉంటే ఇలా ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు, ప్రజలపై ఈ విధంగా కర్కశంగా దాడులు చేయరు. చంద్రబాబు ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపించి జైలుకు పంపారు…కానీ నేటికీ ఆధారాలు చూపలేకపోతున్నారు. చంద్రబాబుకు ప్రజల డబ్బులు అవసరం లేదు… తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి ఎన్టీఆర్‌ కసిగా పెట్టిన పార్టీలో ప్రతి కార్యకర్త ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని రానున్న ఎన్నికల్లో బలంగా పోరాడాలని పిలుపునిచ్చారు. టీడీపీని ముందుకు నడిపేది లక్షలాది కార్యకర్తలేనని ధైర్యం నింపారు. టీడీపీ కార్యకర్తలు సైకిల్‌ స్పీడు పెంచి అడ్డొచ్చిన దుర్మార్గులను తొక్కుకుంటూ ముందుకెళ్లాలి…రానున్న ఎన్ని కల్లో పసుపు జెండాను ఎగరేయాలి…నిజాన్ని గెలిపించాలని పిలుపునిచ్చారు.

సొంత బాబాయ్‌ను చంపి నీతి సూక్తులు
టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ టీడీపీలో 19 ఓట్లు మాత్రమే ఉన్న ప్పటికీ నాతో చంద్రబాబు ఎమ్మెల్సీగా పోటీ చేయించి గెలిపించారు. పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన మహిళను అయిన నన్ను చాలెంజ్‌గా తీసుకుని చంద్రబాబు గెలిపిం చారు. పద్మశాలీలకు న్యాయం చేసే వ్యక్తి చంద్రబాబు, తెలుగుదేశం పార్టీనేనని తెలిపారు. వివేకానందరెడ్డిని చంపిన పార్టీ వైసీపీ. సొంత బాబాయ్‌ని ఎంపీ సీటు కోసం చంపిన వ్యక్తులు నేడు రోడ్డు మీదకు వచ్చి నీతి సూక్తులు మాట్లాడుతున్నారు. వైసీపీ అరాచక పాలనలో చంద్రబాబును అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేశారు… ఇందులో భాగంగానే చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని విమర్శించారు.

నా కొడుకును దారుణంగా చంపించాడు
నందం సుబ్బయ్య తల్లి లక్ష్మీదేవి మాట్లాడుతూ నా కొడుకును రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అనుచరులు ఇంటి నుంచి తీసుకెళ్లి దారుణంగా చంపించాడు. నా కొడుకును చంపి శవాన్ని ఆటోలో తీసుకొచ్చి అప్పజెప్పారు. ఆ సమయంలో నారా లోకేష్‌ మా కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చి నిరసన తెలియజేసి రూ.25 లక్షలు ఆర్థికసాయం చేయడమే కాకుండా నా మనుమళ్లను ఎన్టీఆర్‌ మోడల్‌ స్కూల్‌లో ఉచితంగా చదివిస్తున్నారు. చంద్ర బాబు కుటుంబానికి మేం రుణపడి ఉంటామని పేర్కొన్నారు.

వైసీపీని నిలదీస్తున్నారనే కోపంతోనే పొట్టనబెట్టుకున్నారు
నందం సుబ్బయ్య భార్య అపరాజిత మాట్లాడుతూ నా భర్తను మూడేళ్ల క్రితం దారుణంగా చంపారు. మేం బీసీ సామాజికవర్గానికి చెందిన పద్మశాలీలం. ఎవరు చంపారో అందరికీ తెలుసు. నా భర్త వైసీపీని నిలదీస్తున్నారనే కోపంతోనే చంపారు. ఆయన మరణం తర్వాత మేం ఈరోజు ఇలా ఉన్నామంటే చంద్రబాబు కుటుంబం చలువేనని చెప్పుకొచ్చారు. నా భర్తను చంపినప్పుడు మేం కేసు పెడితే పోలీసులు కనీసం పట్టించుకోలేదన్నారు. మాకు ఏ కష్టం వచ్చినా మధ్యవర్తులు ఎవరూ లేకుండా లోకేష్‌తో చెప్పుకునే అవకాశాన్ని కల్పిం చారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుంటుంది… నా పిల్లలు 6, 11 సంవత్సరాల వయస్సులో నా భర్తను వైసీపీ నాయకులు చంపేశారు. మాకు జరిగినట్లు ఎవరికీ జరగకూడదంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి. వైసీపీ చేసే తప్పులను నిల దీయడమే నా భర్త చేసిన తప్పా? అధికారం ఉంటే ఏ తప్పు అయినా చేయొచ్చా? రాష్ట్ర ప్రజలకు నా విజ్ఞప్తి…అందరూ టీడీపీకే ఓటు వేయండి…చంద్రబాబును ముఖ్యమంత్రిగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE